Satyabhama Today Episode క్రిష్‌కి సత్య అన్నం తినిపిస్తుంది. అది చూసి సత్య తల్లిదండ్రులు మురిసిపోతారు. క్రిష్ కూడా సత్యను కావాలనే ఆటపట్టిస్తాడు. దీంతో సత్య ఇలా కాదు అని ఏవండీ వేడి వేడి సాంబారు వేయనా అని చెప్పి సాంబరును క్రిష్ చేతిమీద పోసేస్తుంది. దీంతో క్రిష్ కెవ్వుమంటాడు. 


భైరవి: మీ బాపుతో మాట్లాడావా.. 
నందిని: నువ్వు అన్నట్లు నా కష్టాలు అన్నీ చెప్పుకున్నా. కాపురం చేయడం నా వల్ల కాదు అన్నా.. అల్లుడిని పిలువు మాట్లాడుతా అన్నాడు. నేనే వద్దు అన్నా. 
భైరవి: మంచి పని చేశావ్. నీ మొగుడు నీ గురించి ఉన్నది ఉన్నట్లు చెప్తే నీ బాపు నిన్నే ఈడ నుంచి మెడపట్టుకొని బయటకు గెంటేస్తాడు. 
నందిని: ఆ విషయం నాకు తెలుసు అందుకే వద్దు అన్నా. ఇప్పుడు బాపు మీ అల్లుడు మీద బాగా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు కానీ వాడు ఒక్కమాట తేడాగా మాట్లాడినా అయిపోయే మా బంధం కట్ అయినట్లే.. నేను చేసింది నేను చేశాను. ఇక మిగిలింది నీ పనే ఉంది. మీ అల్లుడు నోరు జారాలి.
భైరవి: అదెంట పనే ఆల్రెడీ అన్నీ అరెంజ్ చేశానులే.. 


భైరవి పంకజాన్ని పిలిచి కళ్లు తెప్పిస్తుంది. వాటిని హర్షకు ఇవ్వమని చెప్తుంది. పంకజం తీసుకెళ్లి మహదేవయ్య ఇవ్వమన్నారని చెప్తుంది. మజ్జిగ అని చెప్పి హర్షతో కళ్లు తాగిపించేస్తుంది. భైరవి నందిని తెగ సంబరపడిపోతారు. ఇక పని అయిపోయినట్లే అని భైరవి కూతురితో అంటుంది.


మరోవైపు సత్య క్రిష్ తనని హగ్ చేసుకోవడం తలచుకొని బాధ పడుతుంటుంది. ఇంతలో విశాలాక్షి అక్కడికి వస్తుంది. శాంతమ్మ కూడా వచ్చి అల్లుడు మారిపోయాడు అని నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడని ఇక మాకు ఏ టెన్షన్ లేదని అంటారు.


సత్య: అమ్మా సంధ్యకు ఇప్పుడే పెళ్లి వద్దు. 
విశాలాక్షి: వచ్చింది మంచి సంబంధం అమ్మ.
సత్య: అమ్మ మంచి సంబంధమో కాదో ఇప్పుడు తెలీదు. పెళ్లి అయిన తర్వాతే తెలుస్తుంది. అది ఇంకా చిన్నదే కదా. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేయొచ్చు.
శాంతమ్మ: అదేంటే పెళ్లి అయిన తర్వాత సంతోషంగా ఉండరా ఏంటి. నీ వాలకం చూస్తుంటే మనసులో ఏదో పెట్టుకొని పైకి ఏదో మాట్లాడుతున్నావని అర్థమవుతుంది.  
సత్య: కాదు నానమ్మ పెళ్లి అంటే మొగుడుతో కాపురం ఒక్కటే కాదు కదా.. అన్ని మారుతాయి. సంధ్య ఇంకా చిన్నదే తనకి అంత మెచ్చూరిటీ లేదు. 
విశాలాక్షి: నీకో విషయం చెప్పనా.. ఈ సంబంధం ఎప్పుడో వచ్చింది.  క్రిష్ ప్రవర్తన చూసి సంధ్య భయపడింది. మీ ఇద్దరిని చూశాక సంధ్య ఆశ్చర్యపోయింది. మురిసి పోయింది. అందుకే ఇప్పుడు పెళ్లి చూపులకు ఓకే చెప్పింది. ఇంతలో సంధ్య వస్తుంది.
సత్య: సంధ్య అబ్బాయి నీకు నచ్చాడా.. 
సంధ్య: నాన్న గారికి నచ్చాడు. అయినా నాన్నకి నచ్చని అబ్బాయిని చేసుకొని నువ్వు సంతోషంగా ఉన్నావు అలాంటిది నాన్నకి నచ్చిన సంబంధం చేసుకుంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో అర్థం చేసుకో. అయినా నువ్వే టెన్షన్ పడకు అక్క వచ్చిన అబ్బాయిలో మా బావగారి లక్షణాలు అన్నీ ఉన్నాయో లేవో కన్ఫ్మమ్ చేసుకున్న తర్వాతే పెళ్లికి ఒప్పుకుంటా.. చాలా.. సంతోషమా.. 
సత్య: మనసులో.. క్రిష్ వల్ల నా జీవితమే కాదు సంధ్య జీవితం కూడా దారి తప్పబోతుంది. తప్పు అంతా నాదేనా..


మరోవైపు హర్షకి మత్తు ఎక్కుతుంది. మహదేవయ్య, రుద్ర మాట్లాడుకుంటుంటే హర్ష అక్కడికి వెళ్లి మహదేవయ్య పక్కన కూర్చొని అతన్ని పిలుస్తాడు. అది చూసిన మహదేవయ్య అల్లుడికి ఏమైంది పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు. నందిని, భైరవి కూడా అక్కడికి వచ్చి చూస్తుంటారు. 


హర్ష: తాగిన మైకంలో.. నందినిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అది నిజం. కానీ పెళ్లి చేసుకున్నాక ఇష్టపడుతున్నాను. అవును మామయ్య ఇక్కడ(గుండెల్లో) పెట్టుకొని చూసుకోవాలని నేను ఫిక్స్ అయ్యా.. చిలకాగోరింకల్లా.. ముద్దు ముద్దుగా ఉందామని ఫిక్స్ అయిపోయా. తనేం చేసినా నన్నేం ఏం అన్నా అస్సలు కోపం తెచ్చుకోకూడదు అనుకున్నా. తెచ్చుకోను కూడా. ప్రేమిస్తూనే కలిసి బతికేయాలి అనుకున్నా.. కానీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా మామయ్య నీ కూతురే.. నీ కూతురే నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. అస్సలు అర్థం చేసుకోవడం లేదు.
నందిని: మనసులో.. ఇదేంటి కథ మొత్తం అడ్డం తిరిగింది.
హర్ష: అయినా పర్లేదు మామయ్య.. నాకు ఓపిక ఎక్కువ  తను నాకు దగ్గరయ్యే వరకు ఓపికగా భరిస్తా ప్రామిస్.. మా మామయ్య మీకు ఒకటి తెలుసా మా వాళ్లకి నా కంటే ఓపిక ఎక్కువ కోడలి కోసం ఏం కావాలి అన్నా చేస్తున్నారు. కావాలంటే అడగండి. కాకపోతే మీరు చేసిన తప్పు ఒకటి ఉంది. మీరు కూతుర్ని గారాభం చేశారు. నెత్తిన పెట్టుకున్నారు. అసలు తప్పు అంతా మీదే మామయ్య.
భైరవి: వీడిని ఇలాగే వదిలేస్తే అన్నీ చెప్పేస్తాడు. ఆపాలి..
రుద్ర: అదేంటి బాపు చెప్తూ అలా పడిపోయాడు. 
భైరవి: ఏం లేదు ఏం లేదు. ఆచారం అని అల్లుడితో ముంతడు కళ్లు తాగిపించా..
మహదేవయ్య: దానికే ఇలా కళ్లు తిరిగి పడిపోయాడా.. సరే ఏమైనా తినిపించు.
నందిని: ఏంటమ్మా ఇది ప్లాన్ అంతా రివర్స్ అయింది.


క్రిష్ కాలిన చేయిన ఊదుకుంటూ ఉంటాడు. ఇంతలో సత్య వచ్చి పాపం అంటూ క్రిష్‌ని రెచ్చగొడుతుంది. ఇక బెడ్ మీద హర్ష పడుకుంటే సత్య నా బెడ్ అది కిందకి దిగు అని చెప్తుంది. క్రిష్ దిగను అంటే బెడ్ షీట్‌తో తోసేస్తుంది. తర్వాత సత్య పడుకుంటే క్రిష్ కూడా బెడ్ షీట్ లాగేస్తుంది. సత్య కూడా కింద పడిపోతుంది. మళ్లీ క్రిష్ బెడ్ మీద పడుకుంటాడు. ఇద్దరూ కాంప్రమైజ్ అవుదామని క్రిష్ అంటాడు. ఇక సత్య ఇద్దరి మధ్యలో తలగడలు చాకులు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్: బిడ్డను కంటానని ఆశలు పెంచుకుంటున్న కృష్ణ, కుమిలిపోతున్న మురారి.. ముకుందకు చేరిన ఆదర్శ్‌ పెళ్లి ప్రపోజల్!