Satyabhama serial: స్టార్‌ మాలో ప్రసారమవుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ కు ఎండ్‌ కార్డు పడనుందా? అతి త్వరలోనే ఆ సీరియల్‌ కు శుభం కార్డు పడనుందా? రిషిధారల బంధానికి ఇక పులిస్టాప్‌ పడనుందా? శైలేంద్ర అరాచకాలను బుల్లితెర మిస్‌ కానుందా? దేవయాని విలనిజాన్ని.. ఫణీంద్ర అమాయకత్వాన్ని టీవీ ప్రేక్షకులు మిస్‌ కానున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ టైమింగ్‌ ను పలుమార్లు మార్చిన స్టార్‌ మా చానెల్‌. ప్రస్తుతం ఆ సీరియల్ స్థానంలో మరో సీరియల్‌‌ను తీసుకురానున్నట్లు తమ ఆఫీషియల్‌ ఇన్‌ స్టాలో అనౌన్స్‌ చేసింది చానెల్‌ యాజమాన్యం. అయితే ‘గుప్పెడంత మనసు’ కొత్త  టైమింగ్‌‌ను అనౌన్స్‌ చేయకపోవడంతో ఆ సీరియల్‌‌కు శుభం కార్డు పడినట్లేనని తెలుస్తుంది. 


‘సత్యభామ’ సీరియల్‌ అభిమానులకు ‘స్టార్ మా’ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఆ సీరియల్ టైమింగ్‌ ను మార్చుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతూ టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతున్న ‘సత్యభామ’ సీరియల్‌ ఇప్పటి వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతుంది. అయితే ఇప్పుడు ఈ టైమింగ్‌‌ నే మార్చుతున్నట్లు చానెల్‌ యాజమాన్యం ప్రకటించింది. వచ్చే నెల సెప్టెంబర్‌ 2 తేదీ నుంచి ( సోమవారం నుంచి శనివారం వరకు) ‘సత్యభామ’ సీరియల్‌ సాయంత్రం ఆరు గంటలకే ప్రసారం కానున్నట్లు ఆ చానెల్‌ యాజమాన్యం ప్రకటించింది. దీంతో  ‘సత్యభామ’ సీరియల్‌ అభిమానులకు ఇది స్వీట్‌ న్యూస్‌ కానుంది.


ఇప్పటికే సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ ఎండింగ్‌ అవుతుందా? లేక ఆ సీరియల్‌ టైమింగ్‌ మారుస్తారు అనేది సస్పెన్స్‌ గా మారింది. ఒకవేల ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ టైమింగ్‌ మార్చాలనుకుంటే ఇప్పటికే చానెల్‌ యాజమాన్యం అనౌన్స్‌ చేసేది. కానీ ఇప్పటి వరకు స్టార్‌ మా నుంచి అటువంటి ఆఫీసియల్‌ న్యూస్‌ ఇంకా రాలేదు. అయితే ‘గుప్పెడంత మనసు’  సీరియల్ స్టార్టింగ్‌లో సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం అయ్యేది. తర్వాత దాన్ని సాయంత్రం ఆరు గంటలకు మార్చారు. తర్వాత  మధ్యాహ్నం 12.30 కి మార్చేయడంతో టాప్‌  రేటింగ్‌ లో  ఉన్న సీరియల్ ఒక్కసారిగా  రేటింగ్‌ పడిపోయింది. దీంతో మళ్లీ సాయంత్రం ఆరు గంటలకు మార్చారు . కానీ ఇప్పుడు ఇంకా ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ టైమింగ్‌ ఆఫీషియల్‌ గా అనౌన్స్‌ కాలేదు. అంటే.. ఆ తేదీతో ఆ సీరియల్‌కు ఎండ్ కార్డు పడనుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.


ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రుద్రాణి చెంప పగులగొట్టిన ధాన్యం – రాహుల్‌ పై రివేంజ్‌ తీర్చుకున్న స్వప్న