Brahmamudi Serial Today Episode:  బెడ్‌ రూంలోకి వచ్చిన రాహుల్‌ లోపల బెలూన్స్‌ ఉండటం చూసి షాక్‌ అవుతాడు. ఎవరు పెట్టారని ఆలోచించి వెంటనే  ఒక బెలూన్‌ తీసుకుని హ్యపీ బర్తుడే మామ్‌ అంటూ బెలూన్‌ పగులగొడతాడు. లాఫింగ్‌ గ్యాస్‌ బయటకు రావడంతో రుద్రాణి, రాహుల్‌ పిచ్చి పట్టినవాళ్లలా నవ్వుతుంటారు. ఎందుకు నవ్వుతున్నాం. అని తెలియకుండానే నవ్వోస్తోందని ఇద్దరూ అనుకుంటారు. కల్యాణ్ వెళ్లిపోయాడు కదా. అందుకే ఆనందంలో నవ్వుతున్నాం అని బెలూన్స్‌  అన్నింటిని ఒక్కొక్కటిగా పగులగొడుతుంటారు. నా చెల్లెలిని ఏడిపిస్తారా. అసలు విషయం ఆ బెలూన్‌లోనే ఉంది. ఇలాగే ఇవాళంతా నవ్వి చావండి అని స్వప్న అంటుంది. అరేయ్ రాహుల్ నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నాం బయటకు వెళ్దాం పద అని ఇద్దరు బయటకు వెళ్లిపోతారు.


రుద్రాణి: పాపం పిచ్చిది ధాన్యలక్ష్మీ నేను చెప్పిన మాటలు నమ్మి కొడుకును దూరం చేసుకుంది.


రాహుల్‌: నువ్వు ఈ ఇంటికి పట్టిన దరిద్రం అని తెలియదు కదా మామ్‌.


 తర్వాత ఇద్దరూ ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి నవ్వుతూ ఉంటారు.


ధాన్యలక్ష్మీ: నేను ఇంత బాధలో ఉంటే మీకెలా నవ్వోస్తుంది.


రుద్రాణి: మేము చాలా బాధపడుతున్నాం ధాన్యలక్ష్మీ.


రాహుల్‌: అవును ఆంటీ మీ దయనీయ పరిస్థితి చూసి జాలి పడుతున్నాం.   కల్యాణ్‌ను అప్పు ఇంటికి రానియ్యదు. అప్పును చిన్నత్త  కోడలిగా ఒప్పుకోదు.


రుద్రాణి: నీ పరిస్థితి చూస్తుంటే ఇంకా బాధగా ఉంది ధాన్యలక్ష్మీ.


  అంటూ ఇద్దరూ నవ్వుతూనే ఉంటారు. దీంతో ఇరిటేటింగ్‌‌ గా ఫీలయిన ధాన్యలక్ష్మీ రుద్రాణి చెంప పగులగొడుతుంది. సాటి మనిషి బాధలో ఉంటే జాలిపడటం మానేసి నవ్వుతారా. రేపు మీ సంగతి చెబుతా అంటూ వెళ్లిపోతుంది. అప్పుడే అక్కడికి స్వప్న వస్తుంది. మీ నవ్వుకు కారణం నేనే అంటూ లాఫింగ్‌ గ్యాస్‌ పెట్టిన విషయం చెప్తుంది. మీరు చేసిన దానికి ఇదే నా లాఫింగ్ రివేంజ్ అని చెప్పి వెళ్లిపోతుంది.  తర్వాత ఉదయం అల్లారం మోగడంతో కావ్య నిద్రలేచి వెళ్లబోతుంది. వెంటనే రాజ్‌, కావ్య కొంగు పట్టి లాగుతాడు. దీంతో ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సన్నివేశం జరుగుతుంది. మరోవైపు కల్యాణ్ ను ఇవాళ ఏం తిందాం అని అప్పు అంటే.. ప్రాస పాయసం, పదాల పరమాన్నం అంటూ సెటైర్లు వేస్తాడు కల్యాణ్. ఇంతలో ఒకావిడ వచ్చి నిన్న వరలక్ష్మీ వ్రతం చేసుకున్నాం. నువ్ లేవు. నీ వాయనం ఇద్దామని వచ్చామని ఇస్తుంది. అందులో పాయసం, పరమాన్నం ఉండటంతో అప్పు, కల్యాణ్ జోకులు వేసుకుంటారు.


ఇంతలో కనకం, కృష్ణమూర్తి వస్తారు. వాళ్లను చూసిన అప్పు హ్యాపీగ ఫీలవుతుంది.


అప్పు: అమ్మా నాన్న  ఎలా ఉన్నారు.


కనకం: మేము సరేనే మీరెలా ఉన్నారు.


మూర్తి: అప్పు ఎలా ఉన్నారు. బాబు ఎలా ఉన్నారు.


అప్పు: మేము చాలా సంతోషంగా ఉన్నాం అమ్మ.


కళ్యాణ్‌: మొదటిసారి అత్తయ్య, మామయ్య ఇంటికి వచ్చారు వాళ్లకు మర్యాదలు బాగా చేయాలి కానీ ఎలా? ( అని మనసులో అనుకుంటాడు.)


 ఇంతలో అప్పు 20 నిమిషాల్లో టిఫిన్స్‌ చేస్తాను అంటూ లోపలికి వెళ్తుంది. దీంతో కనకం 20 నిమిషాల్లో పూర్తయ్యే టిఫిన్ ఏంటే అని అడుగుతుంది. చూస్తారు కదా అంటూ కిచెన్‌ లోంచి చెప్తుంది అప్పు. లోపల నుంచి సెనగలు వెయించి తీసుకొస్తుంది అప్పు. దీంతో కళ్యాణ్‌ కూడా అప్పు తన పరువు కాపాడిందని ఊపిరి పీల్చుకుంటాడు.  తర్వాత కనకం, మూర్తి ఇంట్లో ఇద్దరమే ఉంటున్నాం మీరు ఇంటికి వస్తే కొడుకైనా.. అల్లుడైనా మీరే మాకు అని చెప్తారు. దీంతో కళ్యాణ్‌ ఏదో చెప్పబోతుంటే.. అప్పు తాము రాలేమని ఇక్కడే ఉంటామని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.