Satyabhama Serial Today Episode సత్యకి మత్తు వదలడంతో పూజ చేయాల్సిన నేను ఇక్కడున్నానేంటి అని రౌడీలను అడుగుతుంది. మతి మరుపు రౌడీ ఎందుకు కిడ్నాప్ చేశాడో మర్చిపోతాడు. సత్య తనని వదలమని రౌడీలను అడుగుతుంది. తాను మహదేవయ్య కోడలు అని ఆయనకు విషయం తెలిస్తే నిన్ను బతకనివ్వరని అంటుంది. ఇంతలో సత్య ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. రౌడీలు వాళ్లని చూసి భయపడతారు. 


మహదేవయ్య: మీరు విడిపోవాలి అనుకున్న మాట నిజమేనా.
రుద్ర: కళ్ల ముందు పేపర్లు చూసి కూడా నిజమేనా అని అడుగుతావేంటి బాపు.
మహదేవయ్య: నువ్వు నోరు ముయ్. వాడు చెప్తాడులే.
రుద్ర: చెప్పేవాడు అయితే నీతో అడిగించుకోడు వాడి పెళ్లానిది తప్పు అని చచ్చినా చెప్పడు.
విశ్వనాథం: ఎందుకు బాబు మౌనం నీ మౌనం నా కూతుర్ని దోషిని చేస్తుంది. తన మీద నిందలు పడుతున్నాయి. నేను ఎదురించి మాట్లాడలేకపోతున్నాను అలా అని మౌనంగా ఉండలేకపోతున్నాను. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. అది బంధాలు తెంచుకోవాలి అని ప్రయత్నించదు. అసలు ఆ సంతకం సత్యదేనా.
క్రిష్: ఆ సంతకం సత్యదే. మేము విడిపోవాలి అని నాలుగు నెలల క్రితమే నిర్ణయించుకున్నాం. కానీ పెళ్లి అయి ఆరు నెలలు అయితే కానీ విడాకులు ఇవ్వమని అన్నారు. అందుకే తగ్గకూడదు అని సంతకాలు చేశాం.
మహదేవయ్య: క్రిష్ కాలర్ పట్టుకొని.. ప్రేమించా అన్నావ్ ఇష్టం లేకపోయినా పెళ్లి చేశా నీ చెల్లిని కూడా కుండ మార్పిడి చేశాం. అలాంటప్పుడు బాపుతో ఒక్క మాట చెప్పాలని మర్యాద కూడా లేదారా నీకు. మమల్ని పిచ్చోలు అనుకున్నావా.
క్రిష్: నేను సత్యని ప్రేమించిన మాట నిజం అప్పుడే కాదు ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను. తను నా జీవితంలో ఉండాలి అని కోరుకుంటున్నాను. 
భైరవి: ఆ సత్య నాటకాలు ఆడుతుంది ఒక్కడు ఉన్నప్పుడు వాడిని సతాయించి తిన్నది. ముట్టుకోలే దగ్గరకు రానివ్వలే వాడు అడిగితే విడాకులు అడిగింది. వాడికి  మనసులో బాధ బయటకు రావడం లేదు. 
విశ్వనాథం: నా కూతురికి మోసం చేసే అలవాటు లేదు.
భైరవి: కళ్ల ముందు ఇంత జరుగుతున్నా మీరు మీ కూతురికే సపోర్ట్ చేస్తారా నా కొడుకు చూడండి పరువు పోయి ఎలా ఉన్నాడో.
క్రిష్: మనసులో సత్య వారం కూడా నాతో కలిసి ఉండలేకపోయావా. కలిసి వ్రతం చేయడం ఇష్టం లేకపోతే చెప్పాల్సింది ఇలా అందరి ముందు నా పరువు తీశావు.   
విశాలాక్షి: మీరు విడిపోవాలి అనుకున్నారు అది సరే కాని ఇప్పటికీ తను నీ భార్యదే కదా తనని వెతకడం నీ బాధ్యత కాదా.


సత్యని మీరే బాధ పెట్టారని అందుకే సత్య విడాకుల వరకు వెళ్లిందని హర్ష అంటాడు. హర్ష మీద క్రిష్‌ కోప్పడతాడు. సత్య బాధ్యత తనదే అని సత్య ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి నిజాలు సత్యతోనే చెప్పిస్తాను అని అంటాడు. ఇక భైరవి కూడా విడాకులు తీసుకోమని అంటుంది. ఇక క్రిష్‌ కూడా మీ మాట వింటానని ఇంకోసారి తప్పు చేయనను అని అంటాడు. కుండమార్పిడి అని నా జీవితంతో ఆడుకున్నావని నా పరిస్థితి ఏంటి అని నందిని నిలదీస్తుంది. దాంతో భైరవి పుట్టింటికి వచ్చేయ్మని చెప్తుంది. 


నందిని: నేను నీ చిన్న కొడుకు లెక్క కాదు మంచి ఏదో చెడు ఏదో ఆలోచించే దిమాక్ ఉంది. 
భైరవి: నిన్ను సతాయించుకొని తింటారు.
నందిని: నా అత్తమామలు నీ లెక్క కాదు. వాళ్లు బాధ పడతారు తప్ప నన్ను బాధ పెట్టరు. సత్య ఎంత మంచిదో నాకు తెలుసు. సత్యకు దేవుడు అన్యాయం చేయడు. 
మహదేవయ్య: ఏయ్ ఏంటి ఏ లొల్లి. 
రుద్ర: పట్టించుకోవాల్సిన పని లేదు బాబు అది మనల్ని వద్దు అనుకుంటే అది కూడా మనకు వద్దు. 
నందిని: సంతోషం
భైరవి: పదండి మనం పోదాం.


ఇంతలో బాబీ వచ్చి సత్యని కిడ్నాప్ చేసి రౌడీలు తీసుకెళ్లారని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. తనని కొట్టి పారిపోయారని చెప్తాడు. నా కోడల్ని కిడ్నాప్ చేసే అంత దమ్ము ఎవరికి ఉందిరా అని మహదేవయ్య అరుస్తాడు. భైరవి, రుద్ర బాబీ తాగి వాగుతున్నాడని బాబీని పంపాలని చూస్తారు. మహదేవయ్య తమ వాళ్లని పంపి అరగంటలో సత్యని తన ముందు ఉంచాలని లేదంటే నేనే రంగంలోకి దిగుతానని అంటాడు. రుద్ర వెళ్లబోతే క్రిష్ ఆపుతాడు. 


ఇక సత్య ఫ్రెండ్స్ రౌడీలను చితక్కొట్టి సత్యని గుడికి వెళ్లమని అంటారు. సత్య గుడికి పరుగులు తీస్తుంది. రుద్ర వెళ్లి సత్యని తీసుకొస్తా అంటే రుద్ర అన్న వెళ్తే సత్యని తెస్తాడని నేను వెళ్లి కిడ్నాప్ చేసిన వాళ్లని చేయించిన వాళ్లని నరికి వస్తానని అంటాడు. ఇక భైరవి ఇలా జరిగిందేంటని కంగారు పడుతుంది. క్రిష్ దేవుడిని దండం పెట్టి బయల్దేరుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   


Also Read: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమికి ఘనస్వాగతం పలికిన అపూర్వ – చంద్రను చూసి ఎమోషన్ అయిన భూమి