Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్, దీపలు మాట్లాడుకుంటుంటే జ్యోత్స్న వచ్చి రెండు రోజుల్లో తనకు కార్తీక్‌కు పెళ్లి అని దీపతో చెప్తుంది. దీప తన సంతోషం వ్యక్తం చేస్తుంటే జ్యోత్స్న మనసులో దీప యాక్టింగ్ చేస్తుందని తన పెళ్లికి దీప రాదు అని నర్శింహ దీపని చంపేస్తాడని అనుకుంటుంది. పెళ్లి ఎల్లుండే కదా రావడానికి నీకు కుదురుతుందో లేదో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయేమో అని అంటుంది.


దీప: ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా నీ పెళ్లికి రాకుండా ఎలా ఉంటాను జ్యోత్స్న. పెళ్లిలో వంటలు నేనే చేస్తాను.
జ్యోత్స్న: వంటలు ఒక్కటే కాదు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి ఏం బావ అంతేనా. 
కార్తీక్: అన్ని పనులు చూసుకోవడానికి తానేం వంట మనిషి కాదు అతిథి. నాకు చిన్న పని ఉంది అమ్మని తీసుకొని వెళ్తా.
జ్యోత్స్న: పెళ్లికి రెండు రోజులే ఉంది కదా బావ అత్తయ్య ఇక్కడే ఉండనీ. మామయ్యని ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తా. ఈ పెళ్లి జరిగే వరకు అందరూ ఇక్కడే ఉండాలి.
కార్తీక్: నాకు ఎక్కడున్నా ఒక్కటే నువ్వే అమ్మకి చెప్పు. చూశావా దీప నీకు చిన్న మాట అంటే బావకి ఎంత కోపం వచ్చిందో నువ్వు అతిథివి కదా అందుకే. మనసులో నువ్వు ఈ పెళ్లి ఆపాలని చూస్తున్నావ్ కదా దీప కానీ అప్పటి వరకు నువ్వు బతకవు.
దీప: మనసులో. నువ్వు నా గురించి ఏం అనుకుంటున్నావో నాకు తెలీదు కానీ ఈ పెళ్లి తొందరగా అవ్వాలని నేను అనుకుంటున్నా అప్పుడే నీకు నా మీద అనుమానం తొలగిపోతుంది. నేను మా పాప అత్తయ్యని తీసుకొని ఊరు వెళ్లిపోతా. స్వప్న కథ కూడా ఓ కొలిక్కి వస్తే బాగున్ను.
శ్రీధర్: వచ్చే బుధవారమే మన ఇంట్లోనే శ్రీకాంత్‌కి స్వప్నకి పెళ్లి.
స్వప్న: నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న.
శ్రీధర్: నీకు ఇష్టమని కాలేజీలో జాయిన్ చేయలేదు ఆ కాలేజ్‌లో చదివితే మంచిదని చేశా అలాగే ఈ పెళ్లి కూడా. భవిష్యత్ బాగుంటుందని అనుకున్నప్పుడు కొన్ని ఇష్టాలు పక్కన పెట్టాల్సిందే. శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నేను కోరుకున్నట్లే ఉంటుంది.
స్వప్న: చూడండి నాన్న నా పెళ్లి చేస్తే కాశీతో చేయండి లేదంటే పెళ్లి ఊసే మర్చిపోండి.
శ్రీధర్: చూడమ్మా మీ నాన్న మంచోడే కానీ మరీ అంత మంచోడు కాదు. నువ్వు ఎవరో దారిన పోయిన వాడిన పెళ్లి చేసుకుంటా అంతే ఓకే అని అంటాను అనుకున్నావా. 
స్వప్న: మీరు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కానీ మీ కూతురు మాత్రం చేసుకోకూడదా.


శ్రీధర్ కాశీ డిటైల్స్ అడుగుతాడు. స్వప్న చెప్పలేకపోతుంది. ఉద్యోగం లేదు, ఆస్తి లేదు అతని గురించి ఏం తెలీదు అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటావా అని శ్రీధర్ స్వప్న మీద ఫైర్ అవుతాడు. కాశీ అల్లుడిగా నాకు వద్దు అని అంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు మాటలు అనుకుంటారు. స్వప్న అలిగి వెళ్లిపోతుంది. ఇక కావేరి తన ప్రేమను చంపుకోలేదు కాబట్టి తన కూతురి ప్రేమని కూడా చంపుకోమని చెప్పలేనని అంటుంది. రెండో పెళ్లి చేసుకున్నందుకు తనకు ఇది జరగాలే అని శ్రీధర్ అనుకుంటాడు.


ఇక నర్శింహని శోభ తన తల్లి పేరు చెప్పి బెదిరిస్తే నర్శింహ తిరగబడతాడు. మీ అమ్మకి భయపడేది లేదని ఆడవాళ్లు అంతా కలిసి తన జీవితం నాశనం చేశారని అంటాడు. ఆ దీప అంతు చూస్తానని అనుకుంటాడు. ఏం చేసినా శోభ చెప్పి చేయ్ అని అంటే నీకు చెప్తే సక్సెస్ అవడం లేదని ఈ సారి చెప్పకుండా చేస్తానని అంటాడు. మరోవైపు జ్యోత్స్న తన ఫ్రెండ్స్‌కి పార్టీ ఇస్తుంది. జ్యోత్స్నకి తన ఫ్రెండ్స్‌ జ్యూస్‌లో మందు కలిపి ఇచ్చేస్తారు. ఇంట్లో జ్యోత్స్న ఫోర్స్ వల్లే పెళ్లి ఫిక్స్ చేశారు కానీ కార్తీక్‌కి పెళ్లి ఇష్టం లేదని తన ఫ్రెండ్స్ అంటారు. కార్తీక్‌ని పార్టీ దగ్గరకు రమ్మని పిలవమని కార్తీక్ మాత్రం రాడు అని జ్యోత్స్నని అంటారు. 


ఇక శౌర్య కార్తీక్ పెళ్లి కాబట్టి బట్టలు కొనుక్కోవడానికి వెళ్దామని అంటుంది. ఇంతలో ఒకామె దీప కోసం వస్తుంది. సాయంత్రం ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందని వంటలు చేయమని అంటుంది. అనసూయ మాత్రం ఆమెను అనుమానిస్తుంది. అయితే ఆవిడ డబ్బులు ఇవ్వడంతో నిజమే అనుకుంటుంది. దీప ఆమెను వెళ్లిపోమని తర్వాత తాను వస్తానని అంటుంది. ఇక అనసూయ కూడా దీపతో వస్తాను అంటే దీప వద్దనేస్తుంది. ఇక కార్తీక్ జ్యోత్స్న కాల్ చేసి పార్టీకి రమ్మని చెప్పిందని వెళ్తానని కార్తీక్ అంటాడు. ఇంతలో శ్రీధర్ ఇంటికి వస్తాడు. కార్తీక్ సెటైర్లు వేస్తాడు. బంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని కార్తీక్ తండ్రితో చెప్పి వెళ్లిపోతాడు. 


కార్తీక్ వెళ్తూ దారిలో దీప కనిపించి ఆగుతాడు. దీప తనకు వంట చేసే అవకాశం వచ్చిందని చెప్తే కార్తీక్ కూడా అటే వెళ్తున్నాను అని డ్రాప్ చేస్తానని అంటాడు. జ్యోత్స్న పార్టీ ఇస్తుంది వెళ్తున్నాను అని కార్తీక్ చెప్తే దానికి దీప చివరు వరకు ఉంటాను అంటే వెళ్లండి లేదంటే ఇప్పుడే ఆగిపోండి అని అంటుంది. దానికి కార్తీక్ అర్థమైందని గతంలో తప్పు రిపీట్ అవ్వదని అంటాడు. ఇక దీప చెప్పిన అడ్రస్ దగ్గర కార్తీక్ డ్రాప్ చేస్తాడు. కూరగాయలతో దీప అక్కడికి వెళ్తుంది ఎవరూ లేకుండా ఒక్కావిడే ఉంటే దీప అడుగుతుంది. దానికి ఆమె ఫంక్షన్ వేరే దగ్గర అని వంట చేసి వెళ్లాలని అంటుంది. మరోవైపు కార్తీక్‌కి జ్యోత్స్న కాల్ చేస్తుంది కార్తీక్ వస్తానని అంటాడు. ఇంతలో దీప ఫోన్ మర్చిపోయి ఉంటుంది. జ్యోత్స్నకి రింగ్ వినిపించి అడిగితే నీ దగ్గర అనుకుంటాడు. తీరా చూస్తే దీప ఫోన్‌ని కార్తీక్ గుర్తిస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం కోసం ఎంక్వైరీ స్టార్ట్ చేసిన విహారి.. పేపర్‌లో కనకం, విహారిల పెళ్లి ఫొటో!