Satyabhama Serial Today Episode సత్యని కాపాడుకోవడానికి ఎవరూ సత్యకి ఎలక్షన్‌లో సపోర్ట్ చేయొద్దని విశాలాక్షి చెప్తుంది. సంధ్య కూడా అక్కకి సపోర్ట్ ఇవ్వొద్దని అంటుంది. విశ్వనాథం మాత్రం కన్న కూతురిని అలా కష్టాల్లో వదిలేస్తామా వియ్యంకుడు దాని జీవితంతో ఆడుకుంటాడు వదిలేస్తామా అంటాడు.


విశాలాక్షి: సత్యకి సపోర్ట్ చేస్తే అది ఇంకా రెచ్చిపోతుందండి. ఎలక్షన్‌లో నిలబడి అది ఏమైనా దేశాన్ని ఉద్దరించాలా. దాని కాపురం అది తిన్నగా చేసుకుంటే చాలు. 
సంధ్య: అమ్మ చెప్పింది కరెక్ట్ నాన్న ఇప్పటికే అక్క మారిపోయింది ఆ ఇంటి గాలి తగిలి మొండిగా తయారైంది. అది ఎవరికీ మంచిది కాదు.
హర్ష: అమ్మానాన్న మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటారు. 
సంధ్య: ఆ నిర్ణయం వల్ల నా జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అందుకే అన్నయ్య నేను మాట్లాడుతున్నా. 
విశాలాక్షి: ఈ ఇంట్లో ఎవరూ దానికి సపోర్ట్ చేసి నామినేషన్ మీద సంతకం చేస్తే నా మీద ఒట్టు. సత్యకు ఏం కాకూడదు అని నేను ఇలా చేస్తున్నాను. నన్ను కాదు అని ఎవరైనా చేస్తే నేను చచ్చిపోతా. మొదటి సారి చెప్తున్నా నన్ను కాదని ఎవరూ ముందుకు వెళ్లకూడదు.
నందిని: సపోర్ట్ చేస్తా అని ఇప్పుటికే నేను వదినకు మాటిచ్చాను అత్తమ్మ మాట వెనక్కి తీసుకోలేను నన్ను పరాయిమనిషి అనుకున్నా సరే. 


సత్య హాల్లో కాఫీ తాగుతున్న మహాదేవయ్య దగ్గర సత్య ఆశీర్వాదం తీసుకొని మంచి పని కోసం బయటకు  వెళ్తున్నా అని చెప్తుంది. దాంతో మహదేవయ్య నామినేషన్‌ నవగ్రహాల కోసం వెళ్తుందని అంటాడు. ఇక అక్కడున్న నౌకరు మహదేవయ్యతో కలసి సత్యని ఎర్రితనం తెలివి తక్కువ తనం అని జోకులు వేసి నవ్వుతాడు. అందరూ నవ్వుతారు. దాంతో క్రిష్ వచ్చి వాడిని కొట్టి తిట్టి పంపిస్తాడు. తండ్రితో మన ఇంటి మనిషిని మనం తక్కువ చేసి మాట్లాడకూడదని నా సత్యని కామెంట్ చేయడానికి వాడు ఎవడు అని అంటాడు.


సత్య పుట్టింటికి వెళ్తున్నా అని క్రిష్‌తో చెప్పి వెళ్తుంది. భైరవి కొడుకుతో సత్యని నెత్తి నెక్కించుకుంటున్నావ్ అని క్రిష్‌ని తిడుతుంది. దాంతో క్రిష్ నా పెళ్లాన్ని ఎవడో పనోడు వేరే ఎవరో మనిషి తప్పుగా మాట్లాడితే నేను ఎలా భరిస్తాను అని అంటాడు. ఎలక్షన్‌లో మాత్రం బాపు వైపే ఉన్నా కానీ తన భార్యని ఎవరైనా అవమానించినా సత్య కష్టంలో ఉన్న భర్తగా సపోర్ట్ చేస్తానని చెప్తాడు. సత్య పుట్టింటికి వెళ్తుంది. సత్య అమ్మ అని పిలిస్తే విశాలాక్షి చూసి అలా ఉండిపోతే ఎప్పుడు వచ్చినా సంతోషంగా వచ్చి హగ్ ఇచ్చే దానివి ఇప్పుడేంటి దూరంగా ఉన్నావని అంటే విశాలాక్షి తీసుకెళ్తుంది. అందరూ తనని చూసి సరిగా పట్టించుకోకపోవడంతో సత్య పరాయి ఇంటికి వచ్చినట్లుందని అంటుంది.


సంధ్య: నిజంగానే పరాయి ఇంటికి వచ్చావ్.  
సత్య: నేను నా వాళ్లతో మనసు విప్పి మాట్లాడుకోవాలని వచ్చా నాన్న నా మీద కోపంగా ఉన్నారా. మీరు నా మంచి కోసమే చెప్పారు. కానీ నా మంచికి మించి ఇంకేదో సాధించాలి అనుకున్నా అందుకే నార్ణయం మార్చుకోలేకపోయాను. సారీ నాన్న ఏం అనుకోవద్దు. అడగకపోయినా నా పుట్టింటి సపోర్ట్ నాకు ఉంటుందని కానీ అడగటానికి వచ్చాను నాకు నామినేషన్‌లో మీ సపోర్ట్ కావాలి. మా మామయ్య నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రారని ఎగతాళి చేశారు. మీ సపోర్ట్ చేస్తే నేను గర్వంగా వెళ్లి చెప్తా. ఇంక ఆలస్యం ఎందుకు ఊ అనండి ఆరుగురు లెక్క తేలారని చెప్తా
విశాలాక్షి: ముందు మీ ఆయనతో ఊ అనిపించుకొని రా.


క్రిష్ ఒప్పుకోడని సత్య చెప్తుంది. నీ భర్తే నీకు అండగా లేకపోతే మేం ఎలా సపోర్ట్ చేస్తామని అంటుంది. ఇలా మాట్లాడుతారేంటి అని సత్య అడుగుతుంది. ఇక సంధ్య అక్కతో నీ స్వార్థంతో నువ్వు పక్కనున్న వాళ్లని పట్టించుకోవడం లేదని అంటుంది. అనవసరంగా లేనిపోని గొడవలకు దూరంగా ఉండమని చెప్తుంది విశాలాక్షి. మామయ్య స్వార్థంతో ఉన్నారని మంచి చేయాలని ఎమ్మెల్యే అవ్వాలని అంటుంది. నీ కాపురం నువ్వు చూసుకో అని విశాలాక్షి అంటే నాకు ఏం కాదు మీరు అండగా నిలవండి అని చెప్తుంది. తండ్రి కూడా ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. వెనక్కి తగ్గమని తల్లి చెప్తే తగ్గను అని సత్య అంటే నీ పుట్టిళ్లు కూడా నీకు అండగా ఉండదు అని చెప్తుంది.


ఇంట్లో ఎవరూ నీకు సపోర్ట్ చేయరు అని సత్యతో విశాలాక్షి చెప్తుంది. నేను మిమల్ని వదులుకోవడం లేదు కానీ మీరే నన్ను వదులుకుంటున్నారని ఒంటరిగానే పోరాటం చేస్తానని అంటుంది. ఇక తనకు మంచి జరగాలని దీవించమని తల్లిదండ్రలు కాలు మీద పడుతుంది. ఎవరూ ఏం మాట్లాడరు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు పుట్టిళ్లు ఉండేదనే ధైర్యం ఉండేది కానీ ఇప్పుడు ఆ ధైర్యం వదిలేసి వెళ్తున్నా అని సత్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: క్షమించమని రాజుని అడిగిన రూప.. కఠినంగా మారిపోయిన రాజు.. మందారానికి ఆబ్దికం!