Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode పార్థసారధి జాను దగ్గరకు వచ్చి మీ తాతయ్య ముందు చూపుతో ఆలోచించి ఇలా రాశారని చెప్తారు. చిన్నతనంలోనే లక్ష్మీకి మీ తాతయ్య వీలునామా చదివి వినిపిస్తే లక్ష్మీ ఆస్తి మొత్తం జానుకి ఇచ్చేయమని చెల్లినే తన ఆస్తి అని చెప్తారు. చిన్నతనం నుంచి నిన్ను అమ్మలా చూసుకుంటున్న లక్ష్మీ గురించి నా కంటే నీకే బాగా తెలుసు కదా అని అంటారు.
తాతయ్య: అలాంటి అక్కతో గొడవలు ఎందుకు తల్లీ తోడబుట్టిన వాళ్లతో గొడవ పడిన వాళ్లు ఎవరూ బాగుపడలేదు. నువ్వు అడిగితే మీ అక్క ఆస్తే కాదు తన ప్రాణం అయినా ఇస్తుంది. అలాంటి అక్క మనసు కష్టపెట్టకు. మీరు ఎప్పటికీ కలిసే ఉండాలమ్మా వస్తాను.
వివేక్: విన్నావా ఇప్పటికైనా మారు జాను ఆ మనీషా చెప్పింది వినకు తను నిన్ను పొల్యూట్ చేస్తుంది.
జాను: నేనేం చిన్న పిల్లని కాదు ఒకరు చెప్తే వినడానికి ముందు మీరు మారండి.
మనీషా: అసలు వీళ్లు ఫ్యాక్టరీకే వెళ్తున్నారా నేను ఫ్యాక్టరీకి వెళ్తేనే తెలుస్తుంది.
మిత్ర: నీకు వీలునామా గురించి మొత్తం తెలుసు కదా లక్ష్మీ మరి ఎందుకు ఇంత వరకు ఆగావు.
లక్ష్మీ: జాను మారుతుందేమో అని ఆగాను. కానీ ఇంత వరకు రావడంతో ఇలా ఇప్పుడు వీలునామా తీయాల్సి వచ్చింది.
మిత్ర: పిన్ని వల్ల జాను అలా అయింది మధ్యలో వచ్చిన మార్పు మధ్యలో పోతుందిలే. నువ్వు మార్చేస్తావ్ నాకు తెలుసు. ఇప్పుడిప్పుడే నువ్వు నాకు బాగా అర్థమవుతున్నావ్. ఇప్పుడు ఫ్యాక్టరీ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తావ్.
లక్ష్మీ: నా ప్లేస్‌లో మీరు ఉంటే ఏం చేస్తారు.
మిత్ర: మనసులో నేను ఏం చేస్తానో చెప్పను నేను చేయాల్సింది చేస్తా.
లక్ష్మీ: ఇప్పుడంటే నేను ఛైర్మన్ ఇది వరకు మీరే కదా ఛైర్మన్.
మిత్ర: నువ్వు ఫ్యాక్టరీకి వెళ్లు లక్ష్మీ చిన్న పని ఉంది నేను చూసుకొని వస్తా కొంచెం అర్జెంట్.
మిత్ర వేరే కారులో వెళ్లి లక్ష్మీని డ్రైవర్‌ని పెట్ట వేరే వెళ్లడంతో మనీషా షాక్ అవుతుంది. లక్ష్మీని ఫాలో అవుతానని లక్ష్మీ వెనక వెళ్తుంది. లక్ష్మీ గవర్నమెంట్ పర్మిషన్‌తో మెషిన్లు కొత్తవో పాతవో తేల్చమని గవర్నమెంట్ విజిలెన్స్ ఆఫీసర్లను తీసుకొస్తుంది. సమ్మె చేస్తున్న వాళ్లు యూనియన్ లీడర్‌తో మెషిన్లు పాతవేనా మరి లక్ష్మీ మేడం ఇంత ధైర్యంగా ఉన్నారేంటి అని అడుగుతారు. ఇక లక్ష్మీ యూనియన్ లీడర్‌కి మూడు నోటీసులు ఇస్తుంది. మొదటిది అతని యూనియన్ లీడర్ పదవీ కాలం ముగిసినట్లు రెండోది ఎలక్షన్ పెట్టాలని ఇచ్చిన నోటీసు మూడోది ఫైనల్ వార్నింగ్‌గా ఇచ్చిన నోటీస్ ఇస్తుంది. యూనియన్ లీడర్ షాక్ అయిపోతాడు. ఇక అధికారులు మెషిన్లలో ఏం లోపం లేదని అన్నీ మంచివే అని కండీషన్ బాగున్నాయని అంటారు. యూనియన్ లీడర్ వాళ్లు ఫేక్ అధికారులు అని చెప్తాడు. వాళ్లు ఐడీలు చూపిస్తారు. మనీషాకు గట్టి షాకే తగులుతుంది.
యూనియన్‌లీడర్: మిషన్లు అన్నీ కండీషన్‌లో ఉంటే వర్కర్ ఎలా గాయపడ్డాడు. జవాబు చెప్పండి.
మిత్ర: జవాబు నేను చెప్తా.
యూనియన్‌లీడర్: ఏం చెప్తారు సార్ మీరు అన్ని మెషిన్లు బాగున్నాయి అది ఒక్కటే బాలేదు అంటారా. అసలు మా పైడి తల్లికి గాయమే అవ్వలేదు అని చెప్తారా.
మిత్ర: పైడి తల్లికి నిజంగానే గాయం అయింది.
యూనియన్‌లీడర్: వాడికి గాయం అవ్వడం అందరూ చూశారు అందుకే కదా హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. మీ నాన్న గారు కూడా పది లక్షలు ఇచ్చారు కదా. ఊరికే అంత డబ్బు ఎందుకు ఇస్తారు.
మిత్ర: దీనికి నేను కాదు పైడితల్లే సమాధానం చెప్తాడు. పైడి తల్లి కట్లు తీసి చేయి చూపించు.
వర్కర్ పైడి తల్లి చేతికి గాయం ఏమీ ఉండదు. మిత్ర అతనికి చూపిస్తాడు. ఫ్యాక్టరీలో అసలు ప్రమాదమే జరగలేదని బ్యాడ్ నేమ్ తీసుకురావడానికే ఇలా చేశారని మిత్ర చెప్తాడు. యూనియన్‌లీడర్ ఇచ్చిన డబ్బు కోసమే ఇలా చేశానని పైడి తల్లి చెప్తాడు. ఇదంతా నీకు ఎలా తెలుసు అని జయదేవ్ మిత్రని అడిగితే మిత్ర బ్యాంక్ వాళ్లకి కాల్ చేసి చెక్ డిపోజిట్ అయిందా అని అడుగుతాడు. తర్వాత మరో ఐదు లక్షలు కూడా ఎవరో అకౌంట్లో వేశారని చెప్తారు. ఇక మిత్ర ఓ డాక్టర్‌ని తీసుకొని ఇంట్లో ఉన్న పైడి తల్లి దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయమని చెప్తాడు. డాక్టర్ సుత్తి, సూదులు, మేకులు, అన్నీ తీసుకురావడంతో పడితల్లి భయపడి నిజం చెప్పేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: వైకుంఠాన్ని కొట్టిన నయని.. త్రినేత్రిని బతికించమని వేడుకున్న బామ్మ.. నేత్రికి ఏమైంది?