Satyabhama Serial Today Episode మహదేవయ్య సత్యతో నన్ను కాదని నీకు సపోర్ట్ చేయడానికి ఈ ఊరిలో ఎవరూ ముందుకు రారు అని నీ పుట్టింటి వాళ్లు కూడా సపోర్టు రారు అని చెప్తాడు. ఇక విశ్వనాథం మహదేవయ్య తనని బెదిరించాడని భార్యతో చెప్తాడు. నందిని ఆ మాటలు వింటుంది.
విశ్వనాథం: ఆయన మనల్ని ఏదో చేస్తాడని కాదు సత్యకి ఏమవుతుందా అని నా భయం.
విశాలాక్షి: సత్య వల్ల మనం ఆ ఇంటిళ్లపాదికి శత్రువులమయ్యాం.
విశ్వనాథం: ఆ రాక్షసుడి మాటలు గుర్తొస్తుంటే చాలా భయంగా ఉంది విశాలాక్షి. తను ఎమ్మెల్యే అవ్వడానికి సిటింగ్ ఎమ్మెల్యేని కూడా చంపేశాడు. రేపు సత్య ఆయనకు గట్టి పోటీ ఇస్తే అప్పుడు సత్య పరిస్థితి ఏంటి. సత్యకు ఎవరు అండగా ఉంటారు.
నందిని: మనసులో నేను ఉన్నా మమాయ్య వదినకు నేను అండగా నిలబడతా. మా బాపుని వదిలి పెట్టను.
సత్య క్రిష్ దగ్గరకు వెళ్లి నామినేషన్ వేయడానికి పది మంది ప్రతిపాదిస్తూ సంతకాలు పెట్టాలా అంటుంది. అవును అని క్రిష్ చెప్తాడు. ఇక క్రిష్ నిన్ను ప్రతిపాదించే పది మంది పేర్లు చెప్పు సన్మానిస్తా అంటాడు.
సత్య: లెక్క పెట్టుకో చెప్తా ఒకటి నా మొగుడు
క్రిష్: ఛాన్సేలేదు.
సత్య: రెండు మా నాన్న.
క్రిష్: ఎలక్షన్‌లో నిల్చొవొద్దు అన్న పెద్ద మనిషి ఎలా సపోర్ట్ చేస్తాడు.. పది మంది పేర్లు కూడా లేరు నీకు నువ్వు పోటీ చేస్తావా. మామకు ఎదురు వెళ్తున్నావ్ అనే చెడ్డ పేరు నీకు వద్దు ఇక్కడితో ఆగిపో.
నందిని: బాపు.,
మహదేవయ్య: రా బిడ్డ..
నందిని: బిడ్డా అని పిలవకు నాకు కంపరంగా ఉంది.
భైరవి: ఏయ్ ఏం మాటలే అవి.
మహదేవయ్య: ఏమైందమ్మా లోపలికి రా మాట్లాడుకుందాం
నందిని: నేను రాను ఇక్కడే తేల్చుకుందాం.
క్రిష్: తేల్చుకోవడం ఏంటి నందిని కొట్లాటకు వచ్చావా.
నందిని: అవును ఈ ఇంటి అల్లుడిని బద్నాం చేశావ్. మా అత్తామామల్ని ఏడిపించావ్. మా ఇంట్లో సామాన్లు రోడ్డున పడే అంత పని చేశావ్.
క్రిష్: నీకు తిక్క లేచిందా బాపు మీద అంత నింద వేస్తున్నాం.
నందిని: నింద కాదు నిజం.
భైరవి: ఇంకొక్క మాట అంటే పళ్లు రాలగొడతా
నందిని: నీకు నీ పెనిమిటికి తెలిసిందే అదొక్కటే కదా మాట వినకపోతే బెదిరించుడు పళ్లురాలగొట్టుడు. 3 నెలల తర్వాత అప్పుడే తీర్చమని అప్పులోళ్లని ఇంటి మీదకి తోలిండు బాపు వాళ్లు నా భర్తని కొట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ తో బాపు ఇదంతా చేసిండు. ఆ పని చేసిన శేషు గాడే నాతో మొత్తం చెప్పాడు.
మహదేవయ్య: రేయ్ చిన్నా ఆ శేషు గాడు రెండు నిమిషాల్లో నా ముందు ఉండాలి. నందిని ఈ మహదేవయ్యని ఏం అనలేదు తండ్రి ప్రేమను అంటోంది.
క్రిష్: రేయ్ వాడు 2 నిమిషాల్లో ఇక్కడుండాలి. సత్య మా బాపు డబ్బు ఇచ్చి సాయం చేశాడు కదా చెప్పు. రేయ్ అటు ఇటూ చూడకుండా నిజం చెప్పురా.
నందిని: నిన్న నాకు చెప్పిన విషయం అందరి ముందు చెప్పు.
శేషు: మీరు ఏం చెప్పమంటున్నారో నాకు తెలీదు మనం మామూలుగా మాట్లాడుకున్నాం కదా.
శేషు మాట మార్చేస్తాడు. శేషుని కూడా కొనేశారని నందిని అంటుంది. భైరవి నందినిని ఇంటి నుంచి పొమ్మని అంటుంది. ఇక నందిని వదినకు సపోర్ట్‌గా నిలబడతా ఏం చేస్తావో చేసుకో అని తండ్రితో చెప్తుంది. భైరవి అందరినీ లోపలికి తీసుకెళ్లిపోతుంది. నందిని కూడా వెళ్లిపోతుంది. సత్య నందిని వెనక వెళ్లి మాట్లాడుతుంది. మా బాపు ఇంకా చాలా ఘోరాలు చేశారని అవన్నీ త్వరలోనే తెలుస్తాయని అంటుంది. తను ఏం కోల్పోవాల్సి వస్తుందో తెలీదని ఏదో ఒక రోజు ఈ ఇంటి నుంచి గెంటేస్తారని సత్య అంటుంది. దానికి నందిని అదే జరిగితే నేను మా బాపుని రోడ్డుకి ఈడ్చుతా అంటుంది.
మరోవైపు సంజయ్ సత్యపై సంధ్యకి ద్వేషం కలిగించాలని చెప్పి సంజయ్ కాల్ చేసి సంధ్యని రెచ్చగొడతాడు. సత్య ఇంట్లో వాళ్లతో గొడవ పడుతుంది. దాని ఎఫెక్ట్ మన మీద పడుతుందని అంటాడు. నందిని వచ్చి గొడవ చేసిందని మీ అక్కని ఇలాగే వదిలేస్తే మన ప్రేమ ఇక అంతే అని అంటాడు దాంతో సంధ్య ఈ విషయం ఈజీగా తీసుకోకూడదు అని అనుకుంటుంది. మహదేవయ్య గన్ రిపేర్ చేసుకుంటే సత్య గన్‌కి ఎదురెళ్తుంది. ఓడిపోతారని భయం లేదా అని సత్య మామని అడుగుతుంది.. కలలో కూడా మహదేవయ్య ఓడిపోడని చెప్తాడు. తన భర్తని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, రోహిణిలకు పెళ్లైందని కుప్పకూలిపోయిన రూప.. మళ్లీ గొడవ అవుతుందా!