Prema Entha Madhuram  Serial Today Episode:  అసలు ఈ ఇంట్లో ఆ మాయ మనిషి ఎవరో అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది శంకర్‌ సార్‌ తమ్ముళ్ల మీద ఓ కన్నేసి ఉంచు అని యాదగిరి.. రవికి చెప్పగానే.. ఆ మాయ వాళ్లను ట్రాప్‌ చేసేంత లేదని ఒకవేళ జెండే సార్‌ నే ట్రాప్‌ చేసి ఉండొచ్చు కదా.. డబ్బు కోసం ఇన్ని రోజులు ఇంత చేశాడనే రావొచ్చని అనుకోవచ్చు కదా..? నేను ఆఫీసులో జాయిన్‌ అయిన మొదట్లో కొన్ని ఫైళ్లు చూశాను. అందులో జెండే సార్‌ తన తమ్ముళ్ల పేరు మీద తీసుకున్న కొన్ని ఆస్థుల వివరాలు చూశాను అని రవి చెప్పగానే యాదగిరి ఆలోచనలో పడిపోతాడు. మరోవైపు శ్రావణి, సంధ్యలో వెళ్లిపోతూ.. గౌరికి జాగ్రత్తలు చెప్తుంటారు. వాళ్ల మీద శంకర్‌ సెటైర్లు వేస్తాడు.


శంకర్‌: ఓరేయ్‌ తమ్ముళ్లు వీళ్లతో పెట్టుకుంటే కదలరు కానీ మీరు బయలుదేరండిరా..? జాగ్రత్తరోయ్‌..


తమ్ముళ్లు: అలాగే అన్నయ్యా..


శంకర్‌: ఇది.. సింపుల్‌ గా అయిపోయింది. నేరుగా టైం వేస్ట్‌ చేయడం అంటే ఈ అమ్మాయిల తర్వాతే..


జెండే: అమ్మాయిలు కదా శంకర్‌. వాళ్లకు భయం, కోపం, ప్రేమ అన్నీ ఎక్కువే..


శంకర్‌: బుర్ర ఒక్కటి తక్కువ సార్‌.


గౌరి: ఏమన్నారు..


శంకర్: నేను ఏమీ అనలేదే..


సంధ్య: మా అక్కను ఇలా ఏడిపించకుండా ప్రేమగా చూసుకోండి బావగారు.


శంకర్‌: ఏంటి బావగారా..? వామ్మో ఈ ముగ్గురు సిస్టర్స్‌ కు ఏమో అయిందోయ్‌..


యాదగిరి: ఏదో మాట వరుసకు అన్నారులే సార్‌. మీరు బయలుదేరండమ్మా..?


అని చెప్పగానే అందరూ వెళ్లిపోతారు. వీళ్లంతా ఒకేచోట ఉంటే భలే సరదాగా ఉంది అంటాడు అభయ్‌. బయటకు వెళ్లిన శ్రావణి, సంధ్య స్కూటీ మీద వెళ్లిపోతుంటే రాకేష్‌, మాయ ఎదురొస్తారు. వాళ్లను చూసిన శ్రావణి తిడుతుంది. పక్కన ఉన్న  అమ్మాయి ఎవరని అడుగుతుంది. రాకేష్‌ వాళ్ల చెల్లి అట మెయిన్‌ విలన్‌ తనే అట అని చెప్పగానే మాయతో రవి రెండుమూడు సార్లు మాట్లాడటం నేను విన్నాను అంటుంది సంధ్య. అన్నయ్యకు ఈ విషయం తెలుసు కాబట్టి జెండే సార్‌, మా అన్నయ్య చూసుకుంటారులే అనుకుని వెళ్లిపోతారు. రాకేష్‌ మాయతో కలిసి అభయ్‌ వాళ్ల ఇంటికి వస్తారు.


అభయ్‌: రేయ్‌ రాస్కెల్‌.. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోనే అడుగుపెట్టి నా ముందే నిల్చుంటావురా…?


మాయ: అభయ్‌ స్టాప్‌.. అన్నయ్యను నేనే తీసుకొచ్చాను..


అభయ్‌: మాట్లాడకు మాయ.. నిన్ను ఫ్రెండుగా ఎంతో నమ్మాను. మీ అన్నయ్య నాకు ఇండియాలో సపోర్టుగా ఉంటాడంటే తనను కూడా ఎంతగానో నమ్మాను. అన్నా చెల్లి కలిసి ఎంత మోసం చేశారు.


మాయ: అయిపోయిందా.. అభయ్‌.. నువ్వు అనాల్సినవన్నీ అనేశావా..? నీ స్థానంలో ఎవరున్నా అలాగే అనుకుంటారు. ఎందుకంటే మా నాన్నా మీ కుటుంబానికి చేసిన ద్రోహం అలాంటిది. కానీ ఇవేవీ నాకు తెలియదని చెప్తే నువ్వు నమ్ముతావా..? మా అన్నయ్య చేసిన దానికి నేను చాలా కుమిలిపోయాను. అందుకే మా అన్నయ్య చేత మీ అందరికీ క్షమాపణ చెప్పించడానికి వచ్చాను. చూస్తావేంటి అన్నయ్యా వీళ్లందరికీ క్షమాపణ చెప్పు.. నాన్న చేసినట్టు నువ్వు చేయకు.


రాకేష్‌: చేస్తాను.. నాన్నా చెప్పినట్టే చేస్తాను. నీతో పాటు వీళ్ల దగ్గరకు వచ్చింది వీళ్లకు క్షమాపణ చెప్పడానికి కాదు. ఇక మీదట వీళ్లను వదలను అని చెప్పడానికి వచ్చాను.


 అంటాడు దీంతో మాయ కోపంగా రాకేష్‌ను కొడుతుంది. వెంటనే సైగ చేస్తుంది మాయ. దీంతో  రాకేష్‌ కోపంగా మాయ గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తాడు. అకి, అభయ్‌ వచ్చి విడిపిస్తారు. రాకేష్‌ వెళ్లిపోతూ ఎలా ఉంది అన్నట్టు శంకర్‌ను చూసి సైగ చేసి వెళ్లిపోతాడు. మాయను అకి ఓదారుస్తుంది. మాయ ఏడుస్తున్నట్లు నటిస్తుంది. దీంతో మాయ నీకు నేనున్నాను అంటూ చెప్పగానే శంకర్‌, జెండే షాక్‌ అవుతారు. తన నటనతో మాయ పూర్తిగా అభయ్‌ని నమ్మిస్తుంది. ఇక వెళ్తాను అని వెళ్లబోతుంటే.. ఎక్కడికి వెళ్తావు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి అని చెప్తాడు అభయ్‌. సైలెంట్‌ వచ్చి అంతా వింటుంటాడు రవి.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!