Ammayi garu Serial Today Episode బంటీని గుడిలో రూప తండ్రికి పరిచయం చేస్తుంది. విజయాంబిక బంటీ పేరు విని ఎలుగు బంటిలా ఆ పేరు ఏంటి అని వెటకారం చేస్తుంది. దాంతో బంటీ విజయాంబిక పేరు అడిగి అంబ అంబ అని దున్నపోతు అని అంటాడు. దాంతో విజయాంబిక హర్ట్ అయి బంటీ బుగ్గులు గిచ్చేయడానికి ప్రయత్నిస్తే సూర్య ప్రతాప్ అక్కా అని అంటే విజయాంబిక గిచ్చ కుండా ఆపేస్తుంది. బంటీ కూడా విజయాంబిక బుగ్గలు గిచ్చేస్తాడు. 


రూప: బంటి ఇంతకీ మీ వాళ్లు రాలేదు ఏంటి.
బంటీ: మా నాన్న అన్ని మెట్లకు బొట్లు పెట్టుకొని వస్తున్నారు  వాళ్లతో పాటు నేను వచ్చి ఉంటే సాయంత్రం అవుతుందని నేను వచ్చేశా. మీరు ఇక్కడే ఉండండి నేను వాళ్లని తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తా. 
రూప: బంటీ ఆగు అని ఆపి బాబుకి బొట్టు పెడుతుంది. సూర్య మనవడిని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతాడు. రూప బాబుకి ముద్దు పెట్టుకుంటుంది. బంటీతో పాటు దీపు కూడా ఆడుకోవడానికి వెళ్తాను అని వెళ్తాడు. 


పిల్లలు ఇద్దరూ ఆడుకుంటూ రాజు వాళ్ల దగ్గరకు వెళ్తారు. దీపుని బంటీ అందరికీ పరిచయం చేస్తాడు. దీపు వాళ్ల ఫ్యామిలీ మొత్తం వచ్చారని పరిచయం చేస్తానని మీ పూజ అయితే చెప్పండి అప్పటి వరకు ఆడుకుంటానని అంటాడు. ఇక అప్పలనాయుడు రోహిణి మొక్కు తీర్చుకోమని చెప్తాడు. రూప అటుగా వస్తుంటుంది ఇంతలో రోహిణిని రూప ఢీ కొడుతుంది. దాంతో అమ్మ వారి బోనం కింద పడిపోతుంది. రూపని రోహిణి తిడుతుంది. నా మనసు కోరుకున్న కోరికని పగల గొట్టేశావ్ అని తిడుతుంది. నా మొగుడి కోసం కోరుకున్నానని ఏడుస్తుంది. నీకు ప్రేమ విలువ తెలీదని అంటుంది. రూప రోహిణి మాటలకు రాజుని గుర్తు చేసుకుంటుంది. నీ ప్రేమ గొప్పది కాదని నువ్వు కోరుకున్న ప్రేమ సరైంది కాదని అందుకే నీ బోనం కింద పడిపోయింది అని రూప అంటే రోహిణి రూపని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. దాంతో రాజు వచ్చి రోహిణి చేయి పట్టుకుంటాడు. రూప రాజుని చూసి షాక్ అవుతుంది. రెండు ఫ్యామిలీలు ఒక్కదగ్గరకు చేరుకుంటాయి. రూప రాజు ఫ్యామిలీని రాజు సూర్యప్రతాప్‌ని చూసి చాలా సంతోషిస్తారు. కానీ రాజు మాటలు గుర్తు చేసుకొని రూపతో ఎవరూ మాట్లాడరు ముఖం చాటేస్తారు. రూప షాక్ బాధ పడుతుంది. 


రోహిణి: ఏంటి రాజు నా చేయి పట్టుకున్నావ్.
రూప: రాజు అని అంత హక్కుగా పిలుస్తుంది ఎవరీ అమ్మాయి.
రాజు: ఒకరి మీద చేయి ఎత్తితే వాళ్లు చేసింది క్షమించరాని నేరం అయిండాలి ఇది దేవాలయం కాబట్టి ఇక్కడ అంత తప్పు ఎవరూ చేయరు. 
రోహిణి: క్షమించరాని నేరమే చేసింది రాజు ఇది
రూప: హలో అది ఇది అన్నావ్ అంటే పళ్లు రాలిపోతాయ్.
రోహిణి: అసలు ఇది ఏం చేసిందో తెలిస్తే నువ్వే పళ్లు రాలగొడతావు. మన ఆరోగ్యం బాగుండాలి. మంచి స్థాయికి రావాలని కోరుకొని బోనం ఎత్తితే ఇది పడేసింది నాకు వచ్చే కోపానికి దీనికి చేతితో చెప్తే కానీ కోపం తగ్గదు.


రోహిణి రూపని కొట్టబోతే రాజు రోహిణిని కొడతాడు. రూప గతంలో రాజు తనని కొట్టడం గుర్తు చేసుకుంటుంది. రోహిణి నన్ను కొట్టావా రాజు దారిన పోయిన దాని కోసం నన్ను కొట్టావా అని అంటుంది. రూప రాజు వైపు చూస్తుంటుంది. అందరూ షాక్ అయిపోతారు. రోహిణి ముత్యాలుని అత్తయ్యా అని పిలుస్తుంది. మామయ్య అని అప్పలనాయుడు అని పిలవడంతో అందరూ షాక్ అయిపోతారు. రాజు, రోహిణిలు పెళ్లి చేసుకున్నారా అని రూప షాక్ అయిపోతుంది. ఎమోషనల్ అవుతుంది. రాజు తనని మర్చిపోయాడా అని రాజుని చూస్తుంది. నేను ఒక అమ్మాయికి రక్షకుడిలా ఉంటానని మాట ఇచ్చాను ఏ అమ్మాయికైనా రక్షకుడినే అని రాజు అంటాడు. రాజు వాళ్లు ఏదో ప్లాన్ వేసుకున్నారని దీపక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: నెత్తి పట్టుకున్న మహదేవయ్య.. చిన్న కోడలిని ఏం చేస్తాడు? కవ్వించి మడతెట్టేసిన సత్య!