Satyabhama Serial Today Episode డీఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ మహదేవయ్య ఇంటికి వస్తాడు. మీడియా, నర్శింహ అందరూ అక్కడికి చేరుకుంటారు. డాక్టర్ రిపోర్ట్స్ చదివి గంగ బిడ్డకు మహదేవయ్యకు ఏం సంబంధం లేదని డీఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్తాడు. ఇక క్రిష్, మహదేవయ్యల డీఎన్‌ఏ మ్యాచ్ అయిందని క్రిష్ మహదేవయ్య కొడుకే అని చెప్తాడు. దాంతో సత్య షాక్ అయిపోతుంది. ఇదెలా సాధ్యమైందని కన్నీరు పెట్టుకుంటుంది. ఇక మహదేవయ్య, క్రిష్, భైరవి అందరూ గెంతులేస్తూ సంబరాలు చేసుకుంటారు.
నర్శింహ: మనసులో ఈ గంగ ఏంటి మొత్తం నా గాలి తీసేసింది.
మహదేవయ్య: నా మీద కుట్ర జరిగింది ఇప్పుడు నిజం తేలింది.
క్రిష్: అసలు దొంగ ఎక్కడ.
మహదేవయ్య: పారిపోయి ఉంటుందిరా.
క్రిష్: మీడియా అందరికీ ఓ నిజం చెప్పాలి మా నాన్న మీద నింద వేసినామె గంగ కాదు శ్రావణి తనో స్టేజ్ ఆర్టిస్ట్. అని ఫ్రూప్స్ చూపిస్తాడు.
మహదేవయ్య: షబాష్ రా చిన్న.
క్రిష్: నీ జోలికి ఎవరైనా వస్తే ఊరుకోను బాపు.
మహదేవయ్య: పెద్దగా నవ్వుకుంటూ నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి కోడలి కాని కోడలా. నాకు నేను చేసుకోలేని సాయం చేశాం, లోకం ముందు సాక్ష్యాలతో సహా నన్ను చిన్నా గాడి తండ్రిని చేసేశావ్. ఇది చిన్న ముచ్చటకాదు. నీ కండ్లల నీ వేలితో నువ్వే పొడుచుకున్నావ్.
సత్య: ఆట ఇక్కడితో అయిపోలేదు మామయ్య.
మహదేవయ్య: నిజం తగలబడిపోయింది దాని స్థానంలో అబద్ధం కూర్చొంది. ఎన్ని సార్లు డీఎన్‌ఏ టెస్ట్ చేసినా ఇదే రిపోర్ట్స్ వస్తాయి. మరోవిషయం నీ మొగుడు గంగ దగ్గరకు వెళ్లాడు వాడు తనని ఉండచు దాని వెనక నువ్వే ఉన్నావని తెలిస్తే అంతే ఇక. పో పోయి నెత్తి మీద నిమ్మకాయ పెట్టుకో ఏమైనా లోపల కాలితే చల్లగా ఉంటుంది.
సత్య వెళ్లిపోతుంటే గతంలో సత్య హాస్పిటల్‌లో ఎంక్వైరీకి వెళ్లిన కాంపౌండర్ రాజు సత్యకి కాల్ చేసి మీరు వెరిఫై చేసిన టైంలో ఓ నర్స్ పని చేసిందని ఆ తరవాత రోజే తను రిజైన్ చేసి వెళ్లిపోయిందని ఆమె అడ్రస్ దొరికిందని చెప్తాడు. దాంతో సత్య నవ్వుకుంటూ వెళ్లి మహదేవయ్యతో మీ గెలుపు సంతోషానికి ఆయుష్షు తక్కువ ఉందని నిజం తగల బడిపోలేదని మీ కౌంట్ డౌన్ మొదలైందని అంటుంది. సత్యకి మళ్లీ ఏం దారి దొరికిందని మహదేవయ్య ఆలోచనలో పడతాడు.
మరోవైపు మైత్రితో తన ఫ్రెండ్ హర్ష నీ పుట్టిన రోజు అని తెలియగానే బయల్దేరుతున్నాడని చెప్తుంది. ఇంతలో హర్ష ఇంటికి వస్తాడు. నీ భర్త్‌డే సెలబ్రేట్ చేయడానికి వచ్చానని హర్ష చెప్తే మైత్రి వెళ్లి హర్షని హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు నందినితో శాంతమ్మ పూజ చేయిస్తుంది. అప్పుడే దీపం కొండెక్కుతుంది. దాంతో నందిని ఏదో అపశకునం అని నువ్వే చెప్పావ్ నాకు నా మొగుడికి మధ్య ఏమైనా అవుతుందా అని అడుగుతుంది. శాంతమ్మ నందినిని తిట్టి మళ్లీ పూజ చేయిస్తుంది.
మరోవైపు సత్య క్రిష్తో తెలీకుండా నర్స్ ఇంటికి వెళ్లాలి అని బయటకు వెళ్తుంది. అక్కడ క్రిష్ సత్యని చూసేస్తాడు. బయటకు వెళ్లడం చూసినా చెప్తావేంటి అని చూస్తున్నా అని నీ కోసం కారు ఆపి ఇక్కడ కూర్చొన్నా అని అంటాడు. చెప్పకుండా పారిపోతున్నావేంటి అని అడుగుతాడు. దాంతో నువ్వు కూడా నాకు చెప్పవని అంటుంది. ఇక క్రిష్ సత్యతో కారు ఎక్కమని అంటాడు. దాంతో సత్య వాదించి వాదించి కారు ఎక్కుతుంది. మరోవైపు సంధ్య ఓ చోట ఆటో కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడు సంజయ్ వస్తాడు. రాత్రి మెసేజ్‌కి రిప్లయ్ ఇవ్వడం లేదని అంటే మా అమ్మ పక్కనుంది నీ ఫోన్ దాయడమే కష్టంగా ఉందని అంటుంది. ఇక సంధ్య సంజయ్ బైక్ ఎక్కుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.