Satyabhama Serial Today Episode సత్య తండ్రికి పోటీగా ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటుందని క్రిష్ ఇంట్లో వాళ్లకి కోపంగా చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. భైరవి క్రిష్‌తో ఏంట్రా ఇది బాపుకి వ్యతిరేకంగా పోటీ చేస్తుందా అని అడుగుతుంది. దాంతో క్రిష్‌ అవును మనం ఏం చేయలేకపోయాం అని తాను ఉద్ధరిస్తాను అంటోంది అని అంటాడు. 


మహదేవయ్య: లాయర్‌ సాబ్ నా నామినేషన్ పక్కన పడేయండి నా చిన్న కోడలి పేరిట నామినేషన్ రెడీ చేయండి. నేను వెనకాలే ఉంటా నా చిన్న కోడల్ని గెలిపిస్తా.
క్రిష్‌: నేను ఒప్పుకోను బాపు. మా బాపు వరంగల్ ఎమ్మెల్యే అయి తీరాలి. వేరే వాళ్లకి ఆ అవకాశం ఇవ్వను. నువ్వు కానప్పుడు అది ఎవరైనా పట్టించుకోను. నువ్వు ఎమ్మెల్యే కావాలి బాపు నువ్వు గెలిస్తే నేను భుజాల మీద ఎత్తుకొని ఊరేగాలి. అది జరిగి తీరాల్సిందే.
భైరవి: అడ్డం పడతా అంటుంది కదరా చెప్పు దానికి.
క్రిష్: చెప్పినా మాట వినడం లేదు.
భైరవి: అత్త మాట ఎలాగూ వినవు భర్త మాట కూడా వినవానే. ప్రేమించి పెళ్లి చేసుకొని నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తున్నాడు అయినా వాడి మాట వినవు అంత పొగరానే.
సత్య: అది పొగరు కాదు అత్తయ్య నా లక్ష్యం. 
భైరవి: మామని ఓడించడం లక్ష్యమా దిమాక్ ఉందా. ఆ దినమే దాన్ని ఇంటి నుంచి వెళ్లగొడతా అంటే దాన్ని వెళ్లగొడితే నేను వెళ్లిపోతా అన్నావ్ ఇప్పుడు చూడు అత్తమ్మ అది నీ కొడుకుకే పోటీ పడుతుంది. ఇలా తలదించుకోవడం కాదు అత్తమ్మ సమాధానం చెప్పు. దానికి చెప్పు.
సత్య: ఎవరు చెప్పినా నా నిర్ణయం మార్చుకునేదే లేదు.
క్రిష్: ఎవరు చెప్తే సత్య మాట వింటుందో నాకు తెలుసు నేను చూసుకుంటా.


విశ్వనాథం ఇంట్లో అందరూ సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో క్రిష్ అక్కడికి వెళ్లి సత్య ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుందని, మీరే ఏదో ఒకటి చేసి మీరే సత్యని కంట్రోల్ చేయాలని అంటాడు. దాంతో విశ్వనాథం కూతురు ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. సమస్య పరిష్కరిస్తుంది కానీ సృష్టించదు అని అందరూ సత్యని పొగుడుతారు. దాంతో క్రిష్ వెళ్లిపోతుంటే విశ్వనాథం ఆపుతాడు. సత్య మొదటి సారి తప్పు చేస్తుందని చెప్పినా వినడం లేదు అని అంటాడు. సత్య నా ప్రాణం అని అలాంటిది నేను తన గురించి ఇలా చేస్తున్నా అంటే  అర్థం చేసుకోండి అంటాడు. ఇక అందరితో సత్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందట అని మా బాపునకే ఎదురు  తిరుగుతుందని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. విశ్వనాథానికి వెళ్లి నచ్చచెప్పమని శాంతమ్మ అంటుంది. సంధ్య అక్క ఈ మధ్య మొండిగా ప్రవర్తిస్తుంది అని అంటే దానికి నందిని వదిన అలా చేస్తుంది అంటే ఏదో కారణం ఉంటుందని అంటుంది. క్రిష్ వెళ్లిపోయిన తర్వాత అందరూ విశ్వనాథానికి వెళ్లి సత్యతో మాట్లాడమంటారు. 


విశ్వనాథం ఇంటికి వెళ్లే సరికి భైరవి కోపంగా సత్యని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో వియ్యంకుడిని చూసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంది. అమాయకపు మొఖం పెడితే మేం నిన్ను నమ్మేస్తామా నీకు తెలీకుండా నీ కూతురు ఏం చేయదుకదా అని తిడుతుంది. ఫ్యామిలీ మొత్తానికి తిడుతుంది. ఇంతలో జయమ్మ వచ్చి కోడలితో ఆ అరుపులు ఏంటే వియ్యంకుడితో ఇలాంటి మాటలేనా అని తిడుతుంది. ఇక జయమ్మ విశ్వనాథంతో సత్యకి నచ్చచెప్పమని చెప్తుంది. విశ్వనాథం సత్య దగ్గరకు వెళ్తాడు. తండ్రి దగ్గర సత్య ఏడుస్తూ తండ్రి గుండెల మీద వాలిపోయి నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా నాన్న అని ఏడుస్తుంది. దాంతో విశ్వనాథం నీ గురించి నాకు తెలుసుమ్మా కానీ నువ్వు నీ ఫ్యామిలీకి ఎదురు వెళ్లకూడదమ్మా. నీ సంతోషమే నాకు కావాలి ఇలా చేయడం వల్ల నువ్వు చాలా నష్టపోతావ్ నీ జీవితమే నష్టం అయిపోవచ్చు అని అంటాడు. నిన్ను ఎలా రక్షించుకోవాలో తెలీక ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలుసా అని అంటాడు. దాంతో సత్య నాకు పవర్ కావాలి నాన్న కొన్ని జీవితాల్ని తొక్కి పెట్టేస్తున్నారు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: బిడ్డని చంపేసింది రాజే అని రూపకి చెప్పిన సూర్య.. బంటీ మీద రాజు సీరియస్!