Satyabhama Serial Today Episode సంధ్య ధనుంజయ్ ఇచ్చిన గిఫ్ట్ చూస్తూ అతని ప్రపోజల్‌ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. లాయర్ ఇచ్చిన వాచ్‌ పెట్టుకొని ఎవరైనా చూస్తారేమో అని దాచేస్తుంది. సడెన్‌గా ఐలవ్‌యూ చెప్పాడేంటి మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటని అనుకుంటుంది. ఇంతలో ధనుంజయ్ సంధ్యకి కాల్ చేస్తాడు. నీ గొంతు విందామని కాల్ చేశా గిఫ్ట్ ఎలా ఉందని అడుగుతాడు. సంధ్య బాగుందని చెప్తుంది. 


ధనుంజయ్: నిజంగా బాగుందా అలా చెప్తున్నావ్. నేను చెప్పిన దాని గురించి ఏం చేశావ్. ఐలవ్యూ చెప్పా కదా రెస్పాన్స్ గురించి వెయిట్ చేస్తున్నా. సైలెంట్‌గా ఉన్నావంటే సగం ఓకే చెప్పినట్లే కదా. లడ్డూ బాక్స్ కావాలనే నా దగ్గర ఉంచేశా దాన్ని అడ్డం పెట్టుకొని మళ్లీ మనం కలవొచ్చు కదా. 
సంధ్య: విశాలాక్షి రావడంతో నేను మళ్లీ చేస్తా అని కాల్ పెట్టేస్తుంది. 


జయమ్మ: అందరూ భోజనాలకు కూర్చొంటారు. మహదేవయ్య కోపంగా ఉంటాడు. రేయ్ చిన్నా నేను మౌనం వ్రతం ఆపేశా అని మీ నాన్న మొదలు పెట్టాడా. నాతో మాట్లాడటమే లేదు.
మహదేవయ్య: నేను మాట్లాడితే ఏంటి లేకపోతే ఏంటి నీకు కావాల్సిన వాళ్లందరూ నీతో మాట్లాడుతున్నారు కదా అది నీకు సంతోషమే కదా. 
జయమ్మ: అబ్బో మనసులో చాలా ఉక్రోషం దాచుకున్నావ్. నీకు వేరుగా చెప్పాలా రుద్ర మీ నాన్నకి చెప్తే అందరికీ చెప్పినట్లే.


సత్య మామకి వడ్డిస్తుంటే మహదేవయ్య కోపంతో భార్య మీద అరుస్తూ నువ్వు వడ్డించాలి కదా అని తిడతాడు. ఇక భైరవి నువ్వు ఇంట్లో ఎవరి సంగతి అయినా చూసుకో కానీ నా భర్త పని నేను చూసుకుంటా అని అంటుంది.. చిన్న కోడలు అనే సంబంధం తెగిపోయిందని భైరవి అంటే జయమ్మ భైరవితో మాటల యుద్ధానికి దిగుతుంది. ఇక మహదేవయ్య నీ పెద్దరికానికి తల వంచా అంతే అంటే జయమ్మ చిన్న కోడల్ని ఎన్ని రోజులు దూరం పెడతావని అడుగుతుంది. 


జయమ్మ: కట్టుకున్నోడు సత్య నిజాయితీని నమ్ముతున్నాడు ఇంకేంటిరా నీ సమస్య.
మహదేవయ్య: వాడో పనికి రాని సన్నాసి. పెద్ద మగోడు అనుకుంటున్నాడు. వాడేం చేస్తున్నాడో వాడికే అర్థం కావడం లేదు. వాడి జీవితంతో పాటు ఇంటి పరువు నాశనం చేస్తున్నాడు. వాడే సరిగ్గా ఉంటే ఈ పంచాయితీ ఎందుకు. ఎంతో పాపం చేసుకుంటే కానీ ఇలాంటి కొడుకు పుట్టడు. వాడేం అడిగినా కష్టమో నష్టమో చేశా కోరుకున్న పిల్లతో పెళ్లి చేశా, కుండమార్పిడికి ఒప్పుకున్నా, వాడి పెళ్లాం పేరు మార్చుకోను అన్నా సరే అన్నా. మొగుడు పెళ్లాలు దూరంగా ఉంటే ఒప్పించి హనీమూన్‌కి పంపాను. నా రాజకీయ వారసుడు వాడే అని పబ్లిక్‌లో ప్రకటించా. వాడికేం తక్కువ చేశా అయినా వాడు వాడి జీవితం మీద నాకు హక్కు లేదు అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఇదేనా తండ్రికి ఇచ్చిన గౌరవం. 
భైరవి: తినేటప్పుడు ఇదంతా ఏంటి జర మనసు రాయి చేసుకో.


మహదేవయ్య తినకుండా వెళ్లిపోతాడు. తర్వాత రుద్ర కూడా వెళ్లిపోతాడు. ఇక భైరవి ఇంటికి ఏదో అరిష్టం పట్టిందని వెళ్లిపోతుంది. క్రిష్ కూడా తనకి వడ్డించొద్దని కడుపు నిండిపోయిందని లేచి వెళ్లిపోతాడు.


క్రిష్ బాధ పడుతూ ఉంటే బయట సత్య లొకేషన్‌ ఏర్పాటు చేస్తుంది. ఇక గదిలో క్రిష్‌ పెట్టుకున్న గులాబి మొక్కని తీసుకొచ్చి దాంతో మాట్లాడుతుంది. ఎందుకు అంత అలక మీ ఫ్రెండ్‌కి అని అంటుంది. నాజూకు అయిన అమ్మాయి పక్కనే ఉందని తనతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని అంటుంది. కనీసం నవ్వకుండా మూతి ముడుచుకుపోయాడని అంటుంది. ఇంతకు ముందు వెనక వెనకే తిరిగి బతిమాలేవాడని భలే ఉందని ఇంకోసారి ఇలా తప్పు చేయకు అని చెప్పి దగ్గరకు తీసుకోవాలి కానీ ఇలా దూరం చేస్తావా అని అడుగుతుంది. ఇక క్రిష్ వెళ్లిపోతుంటే నిజంగా చెప్పాలంటే క్షమించు అని పాట పాడుతుంది సత్య. క్రిష్ వెనక వెనకే పడుతూ పాట పాడుతుంది. సత్య పాటకు క్రిష్‌ చిన్నగా నవ్వుతాడు. దానికి సత్య నన్ను చూసి నవ్వాడా నా తంటాలు చూసి నవ్వాడా అని అనుకుంటుంది. 


క్రిష్‌ లోపలికి వెళ్లి లాయర్‌కి కాల్ చేస్తాడు. ఎలా అయినా తనకు విడాకులు కావాలని తొందరగా ఇప్పించని చెప్తాడు. రెండు నెలలే కదా ఓపిక పట్టు అని లాయర్ అంటే నాకు రెండు నిమిషాలు కూడా కష్టమని అంటాడు. క్రిష్ మాటలకు సత్య బాధ పడుతుంది. క్రిష్ దగ్గరకు వచ్చి మళ్లీ విడాకుల విషయంలో నీ ఒక్కడి నిర్ణయం ఏంటని అంటుంది. అగ్రిమెంట్‌కి రెండు నెలలు ఉంది కదా అప్పుడే లాయర్‌తో మాట్లాడటం ఏంటని అంటుంది. అందరూ నన్ను దోషిలా చూస్తున్నారని ఇలాంటి టైంలో మనం విడిపోతే తన మీద నింద నిజం అవుతుందని అదేదో ముందే వదిలేసి ఉంటే అప్పుడే వెళ్లిపోయేదాన్ని కదా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య కోసం జ్యోత్స్న మీద చేయెత్తిన కార్తీక్.. ఒక్క తీర్పు ఎందరి జీవితాలు మార్చేస్తుందో!