Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode బూచోడు వస్తాడని భయంతో లోపల దాక్కున్నానని నువ్వు రావడం వల్ల బూచోడిని రానివ్వవని వచ్చానని కార్తీక్‌తో శౌర్య చెప్తుంది. ఇక కార్తీక్ కోపంతో జ్యోత్స్న దగ్గరకు వెళ్తారు. ఇద్దరూ గొడవ పడతారని దశరథ్ అంతే కార్తీక్ గొడవ పడే రకం కాదని సుమిత్ర అంటుంది.


కార్తీక్: జ్యోత్స్న ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు.
జ్యోత్స్న: బావ ఎవరితో ఎలా ఉండాలో తెలీదా నీకు.
కార్తీక్: కాస్త అయినా బుద్ధి ఉందా. 
జ్యోత్స్న: నాకు లేదు బావ నీకు ఉందా. కార్తీక్ కొట్టడానికి చేయి ఎత్తడంతో.. కాబోయే భర్తవి కొట్టినా తప్పులేదు. కొట్టు బావ.
కార్తీక్: నువ్వు అన్న మాటలకు శౌర్య ఎంత భయపడిందో తెలుసా. శౌర్యకి ఏమైనా అయింటే నిన్ను నిజంగానే కొట్టేవాడిని.
జ్యోత్స్న: బావ నా విషయంతో నన్ను ఏమైనా అనే రైట్ నీకు ఉంది. దీప విషయంలో ఎందుకు ఆ రైట్ తీసుకుంటున్నావ్. దాని గురించి నువ్వు నా మీద అరుస్తున్నావ్ ఏంటి. అసలు నేను చెప్పింది జరగబోయే నిజం.
కార్తీక్: అది జరగదు నేను జరగనివ్వను.
జ్యోత్స్న: తీర్పు ఇచ్చేది నువ్వు కాదు కోర్టు.
కార్తీక్: శౌర్య నర్శింహ దగ్గరకు వెళ్తే దాని జీవితం నాశనం అవుతుంది.
జ్యోత్స్న: అది వాళ్ల అమ్మ చూసుకుంటుంది. శౌర్య నీకు ఏమవుతుంది నీకు వాళ్ల మీద బాధ్యత ఉండటానికి.
కార్తీక్: ఇది వార్నింగ్ అనుకుంటావో రిక్వెస్ట్ అనుకుంటావో నీ ఇష్టం కానీ నాకు ఎవరి మీద కోపం లేదు వస్తే మాత్రం..
సుమిత్ర: మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుందిరా ఇంటికి వెళ్లు. 
కార్తీక్: ఇంటికి వెళ్లినా ఇదే గోల అత్త. నాన్న అమ్మ మనసు మార్చేస్తున్నాడు. నీ తప్ప ఒక్కరంటే ఒక్కరు అర్థం చేసుకోవడం లేదు. నీకు ఇంత ఆవేశం ఉన్న కూతురు ఎలా పుట్టిందో అర్థం కావడం లేదు. అన్నింటికీ అనుమానమే అందర్ని మాటలు అనేయడమే కాస్త నువ్వు అయినా చెప్పు అత్త. 
సుమిత్ర: చెప్పాడు కదా అర్థం చేసుకో జ్యోత్స్న.
జ్యోత్స్న: బావ అన్నాడు కదా నన్ను అర్థం చేసుకోరు  అని కానీ నన్ను గ్రానీ తప్ప ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అయినా నేను చెప్పిందే నిజం కోర్టు పాపని నర్శింహకే అప్పగిస్తుంది. అప్పుడు ఈ శ్రేయాభిలాషి ఎలా ఆపుతాడో నేను చూస్తా.
సుమిత్ర: కోర్టు కేసు ఏం జరుగుతుందో కానీ ఎవరికీ మనస్శాంతి లేకుండా ఉంది.


అనసూయ కోర్టులో దీప మీద లాయర్ వేసిన నిందలు తలచు కొని ఆలోచిస్తుంటుంది. నర్శింహ తల్లి దగ్గరకు వచ్చి దీప తల పట్టుకుందని మనవరాలు ఇంటికి వచ్చేస్తుందని అంటాడు. రేపటి నుంచి నువ్వు తల్లి అయిపోతావు శోభ అని అంటాడు. ఇక శోభ తాను దీపని చెప్పు దెబ్బ కొట్టాలని అంటుంది. ఇక అనసూయ తాను రేపు కోర్టుకు రాను అని చెప్తుంది. ఇక శోభ పాప రేపు తమ దగ్గరకు రాగానే దానికి కొత్త బట్టలు కొందామని స్కూల్ మార్చేద్దామని శౌర్య పేరు మార్చేస్తానని తల్లిగా నా పేరు రాసుకుంటానని గొప్పలు చెప్తుంది. 


దీప నిద్ర పోతూ కోర్టులో జరిగిన లాయర్ మాటలు తలచుకుంటుంది. నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతుంది. అందరూ తనని తప్పు చేసిన మనిషిగా చూస్తున్నారని రేపు విడాకులు అడిగితే ఇంకెన్ని నిందలు పడాల్సి వస్తుందో అని అనుకుంటుంది. శౌర్యని నర్శింహకు అప్పగిస్తే తాను చచ్చినట్లే అని అనుకుంటుంది. ఇక శౌర్యని పట్టుకొని దీప ఏడుస్తుంది. మరోవైపు కార్తీక్‌ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో వైపు జ్యోత్స్న తన బావ శౌర్య కోసం తండ్రి అని చెప్పడం తనని కొట్టడానికి చేయి ఎత్తడం ఇవన్నీతలచుకొని మూడు నెలల ముందు పరిచయం అయిన పాప కోసం తనని దూరం పెట్టడం తట్టుకోవడం తన వల్ల కాదని అంటుంది. పుట్టడమే నీ భార్యగా పుట్టానని నీ భార్యగా చస్తానని అనుకుంటుంది. శౌర్య నర్శింహ దగ్గరకు వెళ్లిపోతే దీప కూడా వెళ్లిపోతుందని ఒక్క రోజు ఓపిక పడితే జ్యోత్స్న ఏం చేస్తుందో అందరికీ తెలుస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది.


ఉదయం దీప కోర్టు దగ్గర ఉంటే నర్శింహ, శోభ వస్తారు. నర్శింహ శోభలు దీప దగ్గరకు వచ్చి మాటలు అంటారు. కోర్టు నుంచి వెళ్లేటప్పుడు దీప కళ్లనుంచి రక్తం వచ్చేలా చేస్తా అంటాడు. మరోవైపు పారు, జ్యోత్స్నలు దీప దగ్గరకు వచ్చి భయపడుతున్నావా అని అడుగుతారు. మా ఇంటి పరువు తీశావని పారిజాతం దీపతో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్: చెల్లి చేతిలో ఆది కేశవ్ మోసపోతాడా.. కనక మహాలక్ష్మిని కోడల్ని చేసుకుంటుందా, విహారి అడుగుల్లో కనకం!