Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఆదికేశవ్ తన కూతురు కనక మహాలక్ష్మీని అమెరికాలో సెటిల్ అయిన తన చెల్లెలు సౌదామణి కొడుకు అవినాష్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటాడు. కోనేళ్ల క్రితం సౌదామణి అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఆదికేశవ్ డబ్బు సాయం చేస్తాడు. అప్పట్లో చెల్లి తన కొడుకుని ఆదికేశవ్ కూతురికి పెళ్లి చేసి రుణం తీర్చుకుంటానని మాటిస్తుంది. సౌదామణి డబ్బు బాగా సంపాదించడంతో అన్నకి ఇచ్చిన మాట పక్కన పెట్టేస్తుంది. ఆది కేశవ్ మాత్రం చెల్లి తన కూతుర్ని కోడల్ని చేసుకుంటుందని కనకమహాలక్ష్మిని బాగా చదివిస్తాడు. సౌదామణి కూతురికి అమెరికాలో సెటిల్ అయిన పెద్ద ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. వియ్యాలవారు పెళ్లి పల్లెటూరిలో చేయమని అడగడంతో గతి లేక సౌదామణి ఆదికేశవ్‌కి ఆ బాధ్యతలు అప్పగిస్తుంది. ఆదికేశవ్ తన కూతురి పెళ్లి కోసం ఉంచుకున్నా డబ్బంతా చెల్లి ఫ్యామిలీ కోసం వాడేస్తాడు.
ఇక మరోవైపు హీరో విహారి కూడా అమెరికా నుంచి వస్తాడు. తాతయ్యనానమ్మల షష్టిపూర్తి అని ఇంట్లో వాళ్లకి చెప్పకుండా వస్తాడు. తన తల్లిని అత్త, నానమ్మలు అనరాని మాటలు అనడంతో విహారి తల్లికి ఫిట్స్ వచ్చేస్తుంది. విహారికి నానమ్మకి మాట మాట పెరుగుతుంది. తన తల్లిని మామూలు మనిషిగా ఇంటి కోడలిగా గుర్తించాలి అంటే కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న ఆవిడ పెద్ద కూతుర్ని ఇంటికి తీసుకురమ్మని షరతు పెడుతుంది. విహారి సరే అంటాడు. ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..
విహారి తన తాతయ్యతో మాట్లాడుతాడు. పెద్ద అత్తయ్య ఎందుకు రావడం లేదు అని అంటే ఆయన తన అత్తయ్యది పగ అని అందుకే రాదు అని అంటాడు. మీ అత్తయ్య మన కంటే గొప్ప వాళ్ల ఇంటి అబ్బాయిని ప్రేమించిందని వాళ్లు మీ అత్తయ్య ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంటే కుండమార్పిడి పెళ్లి అడిగారని కానీ మీ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో మీ అత్త ప్రేమించిన వాడికి దూరం అయిందని మీ అమ్మ మీద అత్త పగ పెంచుకొని తాతయ్య చెప్తారు. ఇక విహారి పెద్ద అత్త కోసం రాజమండ్రి వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఇక అవినాష్, విహారి బ్యాగ్‌లు ఎయిర్‌పోర్ట్‌లో మారిపోతాయి. అవినాష్, విహారికి కాల్ చేసి బ్యాగులు మార్చుకోవాలి అని రాజమండ్రిలో ఉన్నానని చెప్తే విహారి కూడా రాజమండ్రి వస్తున్నాను అని మార్చుకుందామని చెప్తాడు.
కనక మహాలక్ష్మీ సౌదామణి వాళ్ల కోసం కాఫీ తీసుకెళ్తుంది. స్టీల్ గ్లాస్‌లలో కాఫీ చూసి ఆశ్రిత, సౌధామణి కాఫీ తాగడానికి ఇబ్బంది పడతారు. అసహ్యించుకుంటారు. ఆదికేశవ్ సర్ది చెప్పి కాఫీ ఇమ్మంటాడు. కనక మహాలక్ష్మీ కాఫీ ఇస్తుంది. అవినాష్‌కి కాఫీ ఇస్తుంటే చేయి తగిలి అతడి షూ మీద పడిపోతే అవినాష్ కనకాన్ని తిడతాడు. కనకం సారీ చెప్పి క్లాత్ తెచ్చి తుడబోతే ఆది కేశవ్ తన కండువాతో తుడుస్తాడు.. కనక మహాలక్ష్మీ వాళ్ల అమ్మ చాలా బాధ పడతారు. ఇక ఆదికేశవ్ తన చెల్లి ఫ్యామిలీని గుడికి తీసుకెళ్తాడు. ఇక విహారి, అతని తల్లి కూడా అటుగా వచ్చి అదే గుడి దగ్గర ఆగుతారు. ఇక చెట్టు దగ్గర అమ్మవారికి పూజ చేయాలని కనకాన్ని తల్లి పంపిస్తుంది. విహారి కూడా అక్కడికే వెళ్తాడు. కనకమహాలక్ష్మీ చెట్టు దగ్గరకు వెళ్లాలి అంటే మొత్తం బురద చూసి ఎలా వెళ్లాలా అనుకుంటుంది ఇంతలో విహారి అడుగుల్లో అడుగు వేసుకొని వెళ్తుంది. విహారి, కనక మహాలక్ష్మీ ఒకే దగ్గర పూజ చేస్తారు. ఒకర్ని ఒకరు చూసుకుంటారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ వెంటపడుతున్న సత్య, సోనితో రుద్ర అఫైర్, అందరూ శత్రువులయ్యారని మహదేవయ్య ఫైర్!