Satyabhama Serial Today Episode బోనం ఎత్తడానికి సిద్ధపడ్డానని ఇక తన నిర్ణయం మార్చుకోనని, ఫలితం ఏదైనా అనుభవిస్తానని సత్య క్రిష్‌తో చెప్తుంది.  ఒకవేళ తన మీద నిందని పోగొట్టుకోలేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టనని రెండు నెలలు కూడా ఆగకుండా వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోతానని క్రిష్‌తో చెప్తుంది. సత్య మాటలకు క్రిష్ గమ్మునుండిపోతాడు. 


సత్య: నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. నీ వెంట పడి సతాయించే మనిషే ఉండరు. నీ ఒంటరి తనాన్ని డిస్ట్రబ్ చేసే మనిషే ఉండరు. నీ వాళ్ల నుంచి నిన్ను దూరం చేసే మనిషే ఉండరు. సంతోషమే కదా నీకు. 
పంకజం: భైరవితో.. ఇదిగోండమ్మా మీరు అడిగిన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చా. రెండు ట్యాబ్లెట్స్ వేస్తే చాలు ఎంత మొత్తుకున్నా లేవరు. అంత కంటే ఎక్కువ వేస్తే అస్సలు లేవరు. అవును ఇవి ఎవరికోసం అమ్మా.
భైరవి: నా చిన్న కోడలికి అది రేపు బోనం ఎత్తకూడదని ఇలా చేస్తున్నా. సత్య మాటల్లో ధైర్యం చూస్తే  అది ఏ తప్పు చేయలేదు అని అర్థమవుతుంది. దాన్ని ఓడించడానికే ఇలా చేస్తున్న అప్పుడు దాన్ని నేను ఇంటి నుంచి తరిమేస్తా నన్ను అడ్డుకునేవాళ్లే లేరు ఈ పని నువ్వే చేయాలి. 


రుద్ర సోని దగ్గర ఉంటాడు. పెళ్లి ఎప్పుడని సోని రుద్రని అడుగుతుంది. దాంతో తన పెళ్లాన్ని వదిలేసిన తర్వాత, తన తండ్రి నుంచి పదవి లాక్కోగానే పెళ్లి చేసుకుంటానని అంటాడు. నీతో పర్మినెంట్‌గా ఉండటానికి రేణుకని కడుపులో బిడ్డతో పాటు దాన్ని కూడా చంపేస్తానని సోనితో చెప్తాడు. మరోవైపు సత్య తనని గెలిపించమని దేవుడిని కోరుకుంటుంది. తన జీవితాన్ని తాను కోరుకున్న మలుపు తిప్పుకుంటానని అనుకుంటుంది. 


ఉదయం బోనం సమర్పించడానికి సత్యతో పాటు మహదేవయ్య ఫ్యామిలీ మొత్తం వస్తుంది. విశ్వనాథం కూడా కుటుంబ సమేతంగా వస్తాడు. అందరూ కలుసుకుంటారు. విశ్వనాథం మహదేవయ్య ఫ్యామిలీకి నమస్కారం పెడితే మహదేవయ్య తిరిగి నమస్కారం పెట్టడు సంస్కారం లేదని మహదేవయ్య అంటే నందిని కూడా మామకి సపోర్ట్‌గా తండ్రికే సంస్కారం లేదు అన్నట్లు మాట్లాడుతుంది. సత్య పెద్దవాళ్లని అలా అనొద్దని చెప్తుంది. ఇక సత్య ఓడిపోతే ఎవరి సంస్కారం ఏంటో తెలుస్తుందని భైరవి అంటే సత్య నవ్వి గెలవబోతున్నది నేను అని చెప్తుంది.  


సత్య: నేను గెలవడం అంతే అత్తింటి పరువు కాపాడటమే కదా అత్తయ్య.
క్రిష్: అంతే కదా మరి నేను ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు 10000 వాలా కాల్చి పోతా కారు డిక్కీలో రెడీగా ఉంది. 
భైరవి: మీకు కారు సీటులో ప్లేస్ ఖాళీగా ఉంది కదా వెళ్లేటప్పుడు మీ కూతుర్ని తీసుకెళ్లిపోదురు.
విశాలాక్షి: పరీక్ష ఏంటి ప్లేస్ ఏంటి నాకు ఏం అర్థం కావడం లేదు.
భైరవి: నీ కూతురికి అగ్ని పరీక్ష జరగబోతుంది. బోనం అమ్మవారికి సమర్పించలేకపోతే పరీక్షలో ఓడిపోయినట్లే సత్య మీద పడిన నింద నిజం అన్నట్లే ఆ పరీక్షకు ఆ పతివ్రత ఒప్పుకొనే వచ్చింది.
విశ్వనాథం: ఏంటి బావగారు ఇది నా కూతురుని పబ్లిక్లో శీల పరీక్ష విధిస్తున్నారా. ఏంటి అల్లుడు ఇది ఏంటి అమ్మా ఇది మీరంతా కలిసి నా కూతుర్ని ఎందుకు ఇలా అవమానిస్తున్నారు. 
సత్య: నాన్న నేను ఎవరికీ భయపడటం లేదు నేను నా అంతట ఒప్పుకున్నాను.  


విశ్వనాథం ఫ్యామిలీ సత్యని బయటకు తీసుకెళ్లి వాళ్ల ఉచ్చులో ఎందుకు పడుతున్నావు వాళ్లు దేవుడిని నమ్మరు ఇలా ఇబ్బంది పడితే ఎలా అని ఇంటికి వెళ్లిపోదామని అంటారు. సత్య ఒప్పుకోదు. కావాలంటే మీరు వెళ్లండి నేను రాను అంటే రాను అని మొండి కేస్తుంది. నింద మోస్తూ బతకడం అంటే చస్తూ బతకడమే అని ఓటమిని ఒప్పుకోవడం అంటే నాన్న పరువు తీయడమే అని సత్య చెప్తుంది. 


సత్య: కిడ్నాప్ నుంచి కాపాడి తీసుకొస్తూ చిరిగిన బట్టలతో నన్ను తీసుకొచ్చి ఎంతలా కుమిలిపోయారో నాకు తెలుసు నాన్న. ఆ అవమానాన్నే తట్టుకోలేక తల బాధపడ్డావ్. ఇప్పుడు నేను ఈ పరీక్షకు భయపడి పారిపోతే అంత కంటే ఎక్కువ అవమానాలు పడాల్సి వస్తుంది. రోడ్డు మీద వెళ్లే ప్రతీ ఒక్కరూ నీ కూతురు చెడిపోయింది అని అంటారు. వంద ఇస్తా వెయ్యి ఇస్తా పంపిస్తావా అని అడుగుతారు తట్టుకోగలవా. జరగబోయేది ఇదే నాన్న మన చుట్టూ ప్రపంచం ఇలాగే ఉంది మర్యాదగా బతకనివ్వరు. అలాంటి బతుకు కంటే చావే నయం నాన్న. చెప్పండి పరీక్ష వద్దు అనుకొని వస్తాను అందరం కలిసి కట్టకట్టుకొని చనిపోదాం. చెప్పండి నేను సిద్ధమే. నేను మచ్చ చెరిపేసుకోవడానికి మార్గం దొరికిందని సిద్ధపడ్డాను. అమ్మవారినే నమ్ముకున్నాను నాన్న నా వల్ల ఏదైనా తప్పు జరిగి ఉంటే శిక్ష పడనివ్వండి తల వంచుకొని బతుకుతా. చేయని తప్పునకు తల వంచుకొని బతకడం నా వల్ల కాదు నాన్న నా వల్ల కాదు. దయచేసి నా నిర్ణయం గౌరవించండి. నిజం చెప్పాలి అంటే నాకు భయంగానే ఉంది. మీరు అండగా ఉంటే ఇంకా ధైర్యంగా ఉంటుంది.  


ఆడవాళ్లగా వేషం వేసుకొని వచ్చిన ముగ్గురు రౌడీలతో రుద్ర మాట్లాడుతాడు. తన భార్య ఫొటో చూపించి చంపేమని చెప్తాడు. అడ్డు వస్తే తన తండ్రిని కూడా చంపేయమని రుద్ర చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: ప్రజెంటేషన్ అదరగొట్టిన మిత్ర, అర్జున్.. ప్రాజెక్ట్ దక్కించుకునేది ఎవరు?