Karthika Deepam Idi Nava Vasantham Serial Episode

  లాయర్ జ్యోతి సుమిత్రని విచారిస్తానని అంటుంది. దీప ఎలాంటిదో చెప్పండని సుమిత్రని అడుగుతుంది. దానికి సుమిత్ర దీపకు తల్లిదండ్రులు లేరని భర్త అన్యాయం చేశాడని, మేనత్త అయిన నర్శింహ తల్లి కూడా అన్యాయం చేసిందని అంటుంది. దీపకి సాయం చేస్తా మన్నా ఆత్మాభిమానంతో వద్దు అంటోందని చెప్తుంది.


జ్యోతి: దీపని మీ ఇంట్లో వంట మనిషిగా ఉండమన్నారా.
సుమిత్ర: నా ఇంట్లో నా పెద్ద కూతురిలా ఉండమన్నాను. దీప అంటే నాకు అంత ఇష్టం.
జ్యోతి: మీ మేనల్లుడు చేసిన పనిని మీరు సమర్దిస్తున్నారా.
సుమిత్ర: అవును నిశ్చితార్థం ఆగిపోతే మళ్లీ చేయొచ్చు పాపకి ఏమైనా అయితే మళ్లీ తిరిగి రాదు కదా.
జ్యోతి: విన్నారు కదా జడ్జిగారు దీప ఎలాంటిదో దీప తప్పు చేస్తే కార్తీక్‌కి పిల్లనిచ్చే అత్త ఇలా మాట్లాడరు కదా. నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నాడు. శోభకి పిల్లలు పుట్టరని దీప కూతుర్ని తీసుకోవాలని అనుకున్నారు. 
వీవీ: నాకు పెళ్లే జరగలేదు అని శోభ అంటే పిల్లల గురించి జ్యోతి గారు మాట్లాడుతున్నారు. అనసూయని విచారిస్తే విషయం తెలుస్తుంది. అనసూయ గారు దీప కాపురం నిలబెట్టుకోవడానికి భర్తతో కలిసి ఉండటానికి ఎప్పుడైనా ఏమైనా చేసిందా.
అనసూయ: లేదు. 
వీవీ: దీప తన మనసులో భర్తకి చోటు ఇవ్వలేదు అంటే ఇదే ఉదాహరణ. మీ మనవరాలు మీ కొడుకు దగ్గరే పెరగాలి అనుకుంటున్నారా.
అనసూయ: అవును. 
దీప: మనసులో అంటే ఇక నా కూతురు నా చేయి జారిపోయినట్లేనా. 
సుమిత్ర: ఈ మనిషికి జన్మలో బుద్ధి రాదు.
వీవీ: దీప కార్తీక్‌తో కలిసి తిరగడం ఎప్పుడైనా చూశారా.
అనసూయ: చాలా సార్లు చూశాను. దీప జోలికి వెళ్లాడని నర్శింహని కార్తీక్ రెండు మూడు సార్లు కొట్టాడు. ఒకసారి పోలీస్ కేసు పెట్టి నా కొడుకుని కొట్టించాడు.
వీవీ: కార్తీక్, దీప కలిసి నర్శింహని ఇబ్బంది పెట్టారు. అందుకే నర్శింహ తన కూతుర్ని తనకి ఇచ్చేయ్ మని అడుగుతున్నాడు. కార్తీక్, దీపలకు సంబంధం ఉందని నర్శింహ తల్లే ఒప్పుకుంది కాబట్టి.
అనసూయ: ఏవండోయ్ లాయర్ గారు నేను ఎప్పుడు ఒప్పుకున్నాను. కలిసి తిరిగితే సంబంధం ఉన్నట్లా. చిన్నప్పటి నుంచి దీప నా చేతిలో పెరిగిన పిల్ల దాని గుణం ఏంటో నాకు తెలుసు. 
వీవీ: మీ కొడుకుకి శోభతో రెండో పెళ్లి జరిగిందని దీప చెప్తుంది ఇది నిజమా. అబద్దమా.
అనసూయ: చేసుకున్నాడు. (దీప చాలా సంతోషిస్తుంది నర్శింహ, శోభలు షాక్ అయిపోతారు.) మా ఊరి ముత్యాలమ్మ తల్లి మీద ఒట్టు నా కొడుకు శోభని పెళ్లి చేసుకున్నాడు. మా దీప చెప్పింది నిజం లాయర్ బాబు. నా కొడుకు ఊరి నిండా అప్పులు చేసి నన్ను నా కోడలిని వదిలేసి ఆరేళ్ల క్రితం వచ్చేశాడు. వాడిని వెతుక్కూంటూ వచ్చిన దీపకి నిజం తెలిసింది. నా కోడలు దిక్కులేనిది అయిపోతే సుమిత్రమ్మ కార్తీక్‌లు ఆదుకున్నారు. శోభకి పిల్లలు పుట్టకపోవడంతో నా సలహాలో దీప కూతుర్ని తీసుకోవాలని ఇదంతా చేశాడు. నా దీప ఏ పాపం ఎరుగని మంచిదండి పాప అంటే దానికి ప్రాణం ఇద్దరినీ వేరు చేయకండి. 


దీప, కార్తీక్‌ల మీద ఆరోపణలను కోర్టు కొట్టేస్తుంది. దీపకి విడాకులు మంజూరు చేస్తుంది. నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నందుకు కేసు పెట్టమని దీపకి జడ్జి చెప్తారు. నర్శింహకి ఆరు నెలల జైలు శిక్ష పది వేలు జరిమానా విధిస్తారని అంటాడు. ఇక పాప ఎవరి దగ్గర ఉండాలి అనుకుంటుందో పాపని అడిగి తెలుసుకోవాలి అనుకుంటారు. కార్తీక్ పాపని తీసుకొస్తాడు. జ్యోతి శౌర్యని తల్లిదండ్రులను చూపించి అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా అని అడుగుతుంది. శౌర్య నర్శింహ వైపు చేయి చూపిస్తుంది. అందరూ నర్శింహ దగ్గర ఉంటాను అనడం ఏంటి అని షాక్ అయిపోతారు. ఇంతలో పాప ఈ బూచోడు మా నాన్న కాదు అని చెప్తుంది. దీప వాళ్లు సంతోషిస్తారు. బూచోడితో ఉండను నేను మా అమ్మతోనే ఉంటానని చెప్తుంది. దీప శౌర్య ఒకర్ని ఒకరు పట్టుకొని ఏడుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కనకమహాలక్ష్మీ సీరియల్: అవినాష్‌తో కనకం పెళ్లి చేయనని తేల్చేసిన సౌధామణి.. ఆది కేశవ్‌కి ఘోర అవమానం!