Jagadhatri Serial Today Episode: కౌషికి స్పృహ తప్పి పడిపోతుంది. డాక్టర్ వచ్చి పరీక్షించి తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో నిషిక, వైజయంతి, కమలాకర్, యువరాజ్ షాక్ అవుతారు. సుధాకర్, సురేష్, ధాత్రి, కేదార్ హ్యాపీగా ఫీలవుతారు. కౌషికి మాత్రం ఆందోళన పడుతుంది. సురేష్ చాలా హ్యాపీగా కౌషికికి థాంక్స్ చెప్తాడు. డాక్టర్ జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంది. అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తుంటారు. కమలాకర్, యువరాజ్, వైజయంతి వాళ్లకు విష్ చేయమని సుధాకర్ చెప్పడంతో ముభావంగా కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోతారు. తర్వాత అందరూ కలిసి బాధపడుతూ ఉంటారు.
వైజయంతి: తల తిక్క నాయాలా? ఎప్పుడు ఏదో ఒక తింగరి పని చేయడం. అందరి దగ్గర దెబ్బలు తింటావు.
బూచి: అది కాదు అత్తయ్యా..?
వైజయంతి: నువ్వు మాట్లాడకుండా? ఆ మూలన కూర్చో..
బూచి: మూల అని అంత తక్కువ చేసి మాట్లాడకండి అత్తయ్యా? మనం ఏం చేయకుండా జరిగేవి చూస్తూ ఊరుకుంటే మీరు రావాల్సింది కూడా ఆ మూలకే..
నిషిక: వినడానికి కష్టంగా ఉన్నా..? ఊహించుకోవడానికి భయంకరంగా ఉన్నా..? అన్నయ్య చెప్పింది నిజమే అత్తయ్యా?
కాచి: అసలు అక్క నెల తప్పడం ఏంటి? పెద్దమ్మా విడ్డూరం కాకపోతే…
వైజయంతి: రెండు నెలల ముందు వరకు ఆ సురేష్ పేరు చెబితేనే కౌషికి మండిపోయేది. ఇప్పుడు నెల తప్పడాలు ఏంటి?
అని అందరూ మాట్లాడుకుంటుంటారు. కౌషికికి మగ పిల్లాడు పుడితే మన పరిస్థితి ఏంటని ఆలోచిస్తారు. ఇంతలో ఆ బిడ్డను పైలోకానికి పంపించాలని నిషిక చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత వైజయంతి మంచి ఐడియా అని ముందు ఆ పనిలో ఉందామని వెళ్లిపోతారు. తర్వాత ధాత్రి హారతి తీసుకొచ్చి కౌషికికి దిష్టి తీస్తుంది. వైజయంతి, నిషిక మాత్రం మీ సంతోషం ఎన్ని రోజులుంటుందో చూస్తామని అనుకుంటారు. ధాత్రి అందరికీ స్వీట్స్ ఇస్తుంది. ధాత్రి మాకు బుజ్జి మేనల్లుడిని ఇవ్వాలని అడుగుతుంది. దీంతో సురేష్ కూడా మా సంగతి సరే మీరు కూడా మాకో బుజ్జి మేనకోడలును ఇవ్వాలని అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే వైజయంతి ముందు బిడ్డను పుట్టనివ్వండి అనగానే అందరూ షాక్ అవుతారు. ఇంతలో నిషిక మాట మార్చి అందరికీ ఏదో సర్ధి చెప్తుంది. తర్వాత సురేష్ వాళ్ల అమ్మ ఆదిలక్ష్మీ, చెల్లి భాగ్యలక్ష్మీ వస్తారు. వాళ్లను చూసి వైజయంతి షాక్ అవుతుంది.
వైజయంతి: ఆదిలక్ష్మీ వచ్చిందేంటి? చీర సారే తీసుకుని కోడలితో కలిసిపోవడానికి వచ్చిందా? ఇంతదూరం వచ్చి ఇంట్లోకి వచ్చేసిందంటే పరిస్థితి చేజారిపోయినట్లే..
కమలాకర్: వదిన అదే జరిగితే మన ఇన్నేళ్ల కష్టానికి ఫలితం లేకుండా పోతుంది వదిన. అందరూ కలిసిపోతే ఇక ఆ కౌషికికి మనతో అవసరం ఉండదు. ఈ కోటలో మనం ఉండలేం.
యువరాజ్: వాళ్లు ఎంత ప్రేమతో వచ్చినా..? పశ్చాతాపంతో వచ్చినా అక్క వాళ్ళ ముఖం కూడా చూడదు.
ధాత్రి: అన్నయ్యా ఎవరొచ్చారో చూడండి..
ఆదిలక్ష్మీ: వైజయంతి గారు ఎలా ఉన్నారు..?
వైజయంతి: బాగుండాములే కానీ చాలా రోజులకు గుర్తొచ్చినట్లున్నాము..
సుధాకర్: వైజయంతి… బాగున్నారా? అక్కయ్య గారు..
ఆదిలక్ష్మీ: బాగున్నామండి.. ఎలా ఉన్నావు కౌషికి..?
కౌషికి: ఎందుకొచ్చారు..?
భాగ్యలక్ష్మీ: అదేంటి వదిన అలా అంటున్నారు?
వైజయంతి: ఇంకేం అనాలి అమ్మీ.. ప్రేమగా పలకరించాలా? హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలా?
అంటూ వైజయంతి కోపంగా ఆదిలక్ష్మీ, భాగ్యలక్ష్మీలను తిడుతుంది. అయితే రెండు రోజుల్లో అమ్మా నాన్నా షష్టి పూర్తి వదిన అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాము. అనగానే కౌషికి ఏంటిది కొత్తగా బయటకు వెళ్లండి. మీరు ఇంట్లోంచి వెళ్లగొట్టినా నేను నా కూతురు బాగానే ఉన్నాము అంటూ తిడుతుంది కౌషికి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ప్రభాస్ గంటన్నర నవ్వాడు, నా గెటప్ చూసి నేనే షాక్ - అలీ