Intinti Gruhalakshmi August 24th: లక్కీ తులసితో బాగా ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు. తనకు నాన్న కావాలి అని అంటాడు. దాంతో తులసి మమ్మీకి కూడా నువ్వు కావాలి కదా అనడంతో.. మమ్మీ వల్లే కదా డాడీ దూరం అయ్యింది.. మరి తప్పు మమ్మీదే కదా అని అంటాడు. ఇక తులసి మమ్మీని అలా తప్పు పట్టకూడదని సర్ది చెప్పే ప్రయత్నం చేయటంతో.. అయితే మీరే చెప్పండి ఆంటీ మమ్మీ చేసింది తప్పా కదా అని అడుగుతాడు.


దాంతో తులసి.. ఏది తప్పో ఏది ఒప్పో మనం నిర్ణయించలేం.. ఒకసారి తప్పు అనిపించింది ఇంకోసారి ఒప్పు అనిపిస్తుంది.. మన నిర్ణయాలపై మనం నిలబడలేకపోయినప్పుడు ఎదుటి వాళ్ళ నిర్ణయాలు జడ్జ్ చేయకూడదు అని నందుని ఉద్దేశించి అంటుంది. కానీ లక్కీ మాత్రం తనకు తన మమ్మీ వద్దు అని డాడీ కావాలి అని అంటాడు. మమ్మీ వద్దనుకుంటే నీకే నష్టం అని అనటంతో ఏం కాదు డాడీ ఉన్నాడు కదా అని అంటాడు.


మరి డాడీకి కోపం వస్తే నేను వదిలేస్తే ఏం చేస్తావో అనే అందుకే.. డాడీ అలా చేయడు డాడీ ఇస్ గుడ్ బాయ్ అని  అంటాడు. దాంతో తులసి ఎవరిని అంత గుడ్డిగా నమ్మకూడదు.. ఎవరి మనసు ఎలా మారుతుందో తెలియదు అని అంటుంది. కాసేపు తన మాటలతో లక్కీని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత నందు  తులసితో నాపై ఎందుకు అంత కోపం అని అనటంతో నేను ఎవరిని మీపై కోపం తెచ్చుకోవడానికి అని.. నేను కోపం తెచ్చుకున్న కూడా మీరు ఎవరు పట్టించుకోవడానికి అని డైలాగ్ కొడుతుంది.


దాంతో నందు తులసిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. లక్కీ వల్ల ఇదంతా జరుగుతుందని లక్కీని తన తల్లి దగ్గరికి పంపించేస్తాను అని అంటాడు. కానీ వాడు డాడీ కావాలి అని అంటున్నాడు కదా అని అంటుంది. అంత వాడి ఇష్టమేనా అని నందు కోపంతో అనటంతో.. అందరూ కలిసి వాడిని ఒంటరి వాడిని చేస్తారా అని తులసి అంటుంది. లక్కీ ఆశలని మీ పైన పెట్టుకున్నాడు జీవితాంతం మీ తోడు కావాలని అనుకుంటున్నాడు అని అంటుంది.


వెంటనే నందు బాధలో ఉన్నాడని ఎప్పుడు అండగా ఉండలేను కదా.. జీవితాంతం తోడుగా ఉండమంటే ఎలా అని ప్రశ్నిస్తాడు. వెంటనే తులసి మీరు జీవితాంతం ఎవరికి అండంగా ఉండలేరు.. మీకు అటువంటి అలవాటు లేదని నాకు తెలుసు.. ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు మీ గురించే కాకుండా ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉండండి నందగోపాల్ గారు అంటూ కాస్త వెటకారించి మాట్లాడుతుంది.


మరోవైపు రాజ్యలక్ష్మి ఫ్యామిలీ అంతా ఇంటి బయట గార్డెన్ లో శివుడి విగ్రహం ముందు ఉంటారు. ఇక రాజ్యలక్ష్మి చెవిలో తన తమ్ముడు గుసగుసలాడుతూ ఉంటాడు. కొడుకు కానీ కొడుకును గుప్పెట్లో పెట్టుకున్నావు కన్న కొడుకుని కాపాడుకోలేకపోతున్నావు అని అంటాడు. ఇప్పుడు గాని సంజయ్ ని కాపాడకపోతే 101 రోజుల తర్వాత వాడి బతుకు మరోలా ఉంటుంది అని అంటాడు. దివ్య వాడిని రోటి పచ్చడి చేస్తుంది అని అంటాడు.


ఇక ఈ కాళ్లు నొప్పని చెప్పి విక్రమ్ ను అడ్డుపెట్టుకుందాము అని అనుకుంటే వాడే నా నోరు నొక్కేశాడు అని రాజ్యలక్ష్మి కూడా అంటుంది. ఇక పూజారి సంజయ్ ను చల్లనీటితో స్నానం చేయమని చెప్పటంతో విక్రమ్ నేను చేయిస్తాను అని అమ్మ కాళ్లకు ఆశీర్వాదం తీసుకొని రమ్మంటాడు. తరువాత తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోగా.. విక్రం తనను స్నానం చేయించడానికి తీసుకెళ్లి చల్లని నీటితో స్నానం చేయిస్తాడు. దాంతో సంజయ్ వణికిపోతుంటాడు.


ఇప్పుడైనా తన భర్త మంచిగా మారాలి అని సంజయ్ భార్య కోరుకుంటుంది. ఇక స్నానం పూర్తయ్యాక సంజయ్ తో విక్రమ్ శివుడికి అభిషేకం చేస్తాడు. దివ్య లోలోపల తెగ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అభిషేకం చేస్తే సంజయ్ నీరసిస్తూ ఉంటాడు. ఇంట్లో జరిగే ఈ పూజతోనైనా విక్రమ్ మనసు మారి తనను దగ్గరికి తీసుకునేలా చూడమని కోరుకుంటుంది దివ్య. 


ఇక ఈరోజుకి అభిషేకం పూర్తయింది అని పూజారి అనటంతో.. 101 పూలతో అర్చనం చేయాలి కదా పూజారిగారు అని రాజ్యలక్ష్మి భర్త అంటాడు.  రాజలక్ష్మి వాడికి ఓపిక లేదు అని కోపంగా అనటంతో వెంటనే దివ్య కలుగచేసుకొని మీ కోసం ప్రియా అమ్మవారికి ఇలాగే అభిషేకం చేసింది మర్చిపోయారా అని.. విక్రమ్ చేసిన దీక్షను మరిచిపోయారా అంటూ అప్పుడు రాని కోపం ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అడుగుతుంది.


తప్పు దేవుడిని చూస్తే చెంపలు వేసుకోమని అనటంతో విక్రం కూడా అదే మాట అంటాడు. దాంతో రాజ్యలక్ష్మి చెంపలు వేసుకుంటుంది. పూజ అనంతరం.. అందరూ తినడానికి కూర్చుంటారు. ఇక సంజయ్ నొప్పులతో బాధపడుతూ వస్తుంటాడు. వెంటనే తన తండ్రి అలసిపోయావా అంటూ కాస్త వెటకారంగా అడగటంతో.. అప్పుడే రాజ్యం తమ్ముడు కూడా కాస్త వెటకారం చేస్తూ తన బావకు డైలాగులు కొడుతూ ఉంటాడు.


ఇక సంజయ్ తినడానికి ప్లేటు తీస్తుండగా వెంటనే దివ్య లాక్కుంటుంది. ఇక అందరూ షాక్ అవుతారు. వెంటనే రాజ్యలక్ష్మి దివ్య పై ఫైర్ అవుతుంది. దాంతో దివ్య పూజారి నేల మీద కూర్చొని తినమని అన్నాడని అనటంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా అదే మాట చెబుతారు. ఇక విక్రమ్ కూడా పంతులుగారు చెప్పినట్లు చేయాల్సిందే అని తన తల్లితో చెబుతాడు.


మధ్యలో దివ్య రాజ్యలక్ష్మికి తగిలేటట్టు డైలాగ్స్ కొడుతూ ఉంటుంది. వెంటనే విక్రమ్ ప్రియతో సంజయ్ ని కింద కూర్చోబెట్టి పండ్లు వడ్డించమని అంటాడు. దాంతో సంజయ్ చిరాకు పడుతూ ఉంటాడు. ఇక సంజయ్ కింద కూర్చొని పండ్లు అయిష్టంగా తింటూ ఉంటాడు. ఇక తన మామయ్య మాత్రం ఫుడ్ ని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండటంతో రాజ్యలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది.


ఆ తరువాత రాజ్యలక్ష్మి తన కొడుకుకు జరిగిన విషయాలను తలుచుకొని బాధపడుతూ కన్నీరు తెచ్చుకుంటుంది. అప్పుడే అక్కడకు దివ్య, విక్రమ్ వస్తారు. ఇక విక్రమ్ తల్లితో బాధపడుతున్నావా అని బాధగా అడుగుతాడు. నా బాధతో ఎవరికి అవసరం ఉందిరా ఈ ఇంట్లో.. నాకు తెలియకుండా నాకు చెప్పకుండా నాకు సంబంధం లేకుండా జరిగిపోతున్నాయి అని అంటుంది. 


దాంతో విక్రమ్ ఇదంతా నీ మంచి కోసమే.. నీ ఆరోగ్యం కోసమే.. నీ సంతోషం కోసమే కానీ నిన్ను ఎదురించడానికి కాదు అని అంటాడు. వెంటనే దివ్య ఆ విషయం అత్తయ్యకు కూడా తెలుసు అంటూ.. కానీ ఈ వయసులో ఏం జరిగినా తనకు చెప్పకపోతే బాధనిపిస్తుంది కదా అని అనటంతో రాజ్యలక్ష్మి తన వైపు కోపంగా చూస్తుంది. ఇక విక్రమ్ నువ్వు సంజయ్ కోసం ఎంత బాధ పడుతున్నావో నీ కోసం నేను అంత బాధ పడుతున్నాను అని అంటాడు. వాడు నీ రక్తం పంచుకొని పుట్టిన నాకు తమ్ముడే అని అంటాడు.


వెంటనే రాజ్యలక్ష్మి ఎందుకురా అలా అంటున్నావు నేనేమైనా నీకు లోటు చేశానా అని ప్రశ్నిస్తుంది. దాంతో విక్రమ్ ఎప్పటికీ చేయవమ్మా నాకు తెలుసు అని అంటాడు. ఇక రాజ్యలక్ష్మి సంజయ్ గురించి చెప్పుకుంటూ బాధపడుతూ ఉండటంతో అర్థమయింది అమ్మ అని అంటాడు విక్రమ్. నీకోసం కాదురా అర్థం అవ్వాల్సిన వాళ్ల కోసం చెబుతున్నాను అని రాజలక్ష్మి దివ్యను చూసి అంటుంది. ఇక విక్రమ్..  సంజయ్ నీకోసం చేస్తున్నాడు అని భారము దేవుడి మీద భారం వెయ్యమని అంటాడు.


 దిగులు పడకు ఇది నీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం అని ధైర్యం చెబుతాడు. అంతేకాకుండా తమ్ముడిని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టను అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. వెంటనే దివ్య రాజ్యలక్ష్మి తో.. కన్నా కొడుకు కష్టపడితే ప్రాణం కొట్టుకుంటుందా అని అంటుంది. తరువాయి భాగంలో విక్రమ్ స్టైల్ గా సూటు.. బూటు ధరించి తల్లికి ఆశీర్వాదం తీసుకొని హాస్పిటల్ కి వెళ్తున్నాను అని చెప్పటంతో రాజలక్ష్మి షాక్ అవుతుంది. విక్రమ్ పడిపోతూ ఉండగా వారి ముందే దివ్య స్టైల్ గా పట్టుకుంటుంది. అది చూసి రాజ్యలక్ష్మి మరింత కోపంగా కనిపిస్తుంది.


also read it : Neethone Dance: ‘నీతోనే డాన్స్’ షోలో విజయ్ దేవరకొండ సందడి - అంతా రౌడీ పెళ్లి గురించే రచ్చ


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial