Madhuranagarilo July 13th: మధుర శ్యామ్ కు సంయుక్తతో భోజనం పంపించగా శ్యామ్ సంయుక్త తెచ్చినందుకు తినను అని కసురుకుంటాడు. ఇక శ్యామ్ అరవటంతో వెంటనే మధుర, రాధ వచ్చి ఏం జరిగింది అనటంతో తనతో భోజనం ఎలా పంపిస్తావు అని అడుగుతాడు. పంపిస్తే తప్పేముంటుంది అని మధుర, రాధ అనటంతో సైలెంట్ గా సంయుక్త తో గోరుముద్దలు తింటాడు.


కానీ తనకు రాధ తినిపిస్తుందన్న భ్రమలో ఉంటాడు. అంతేకాకుండా తనతో సరదాగా, రొమాంటిక్ గా మాట్లాడినట్లు అనిపిస్తాడు. ఇక తేరుకొని చూసేసరికి సంయుక్త ఉంటుంది. సంయుక్త ముద్ద పెట్టడంతో వెనక్కి జరగడంతో సర్ సిగ్గుపడుతున్నాడేమో అని మనం ఇక్కడ నుంచి వెళ్దాం పద అని రాధ మధుర తో అంటుంది. దాంతో వాళ్లు వెళ్లాక సంయుక్త తినిపించడానికి మళ్లీ ముద్ద పెట్టడంతో చాలు అని అంటాడు.


ఇక తనకి కడుపు నిండిపోయింది అని ఆకలేస్తే పిలుస్తానులే అనటంతో సంయుక్త అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మరోవైపు వాసంతి తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా గన్నవరం ఎవ్వరు చూడకుండా ముసుగు వేసుకొని ఇంట్లోకి వెళ్లగా వాసంతి ఏం జరిగింది అని అడుగుతుంది. చూస్తుంటే ఎవరో కొట్టినట్లుగా అనిపిస్తుంది అని అంటుంది.


దాంతో అహం దెబ్బతింటుంది అని ఎవరు కొట్టలేదు అని అంటాడు గన్నవరం. ఇక నిజం చెప్పకపోయేసరికి వాసంతి  రోకలితో కొడతాను అని బెదిరిస్తుంది. దాంతో గన్నవరం నిజం చెబుతాడు. తను స్వామీజీ గెటప్ వేసి వారి జాతకాలు చెప్పి వారి దగ్గర నుండి డబ్బులు తీసుకువచ్చి నీకు ఇస్తున్నాను అని అంటాడు. అలా జరిగిన విషయం చెబుతూ.. గడ్డం ఊడిపోవడం వల్ల తను దొరికిపోయాను అని అంటాడు. దాంతో వాసంతి కూడా ఇలాంటి పనులు చేసే బాగుండదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.


ఆ తర్వాత రాధ శ్యామ్ దగ్గరికి వెళ్లి రింగ్ గురించి మాట్లాడుతారు. అది మీ అక్క ఇచ్చింది కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని శ్యామ్ అంటాడు. దాంతో రాధ పోయిందనుకున్న రింగు ఇచ్చినందుకు మీకేం కావాలో చెప్పండి అని అడుగుతుంది. ఇక అప్పటికే సంయుక్త అక్కడికి వచ్చిన వారి మాటలు వింటూ కోపంతో రగిలిపోతుంది. నాకేం కావాలంటే అని శ్యామ్ సాగదీస్తూ ఉండగా సంయుక్త నీకేం కావాలో నాకు తెలుసు.. టిఫిన్ కదా పొద్దుపొద్దున రాధ దగ్గర అది తప్ప ఏం దొరుకుతుందని వెటకారం చేస్తుంది. ఇక రాధ టిఫిన్ తేవడానికి కిందికి వెళుతుంది.


వెంటనే సంయుక్త ఎలా ఉంది ఇప్పుడు అని అడగటంతో వెటకారంగా మాట్లాడుతాడు శ్యామ్. ఇక మనమే కిందికి వెళ్లి టిఫిన్ చేయాలి. ఆ తర్వాత నేను ఒక ఫ్రెండ్ ని కలవాలి అని అక్కడ నుంచి వెళ్తాడు. ఓ వైపు గోపాల్ హోటల్లో తమతో గన్నవరం చేయించిన పనిని గుర్తుకు చేసుకొని నీ పని కూడా చేస్తాను అని అనుకుంటాడు.


ఇవాళ అక్క చేత నీకు కోటింగ్ ఇప్పిస్తాను అని అనుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. వాసంతి గన్నవరం కు కాపురం పెడతూ బాగా తిడుతుంది. ఇప్పటినుండి అయినా మంచిగా ఉండు అని హెచ్చరిస్తుంది. అప్పుడే గోపాల్ వచ్చి దెబ్బలు ఎలా తగిలాయ్ అనటంతో మధ్యలో వాసంతి వచ్చి తన భర్త పై బాగా పంచులు వేస్తూ ఉంటుంది.


ఇక అన్నవరం నీకు నొప్పులు తగ్గాలంటే ఒకటే మార్గమని మందు చూపించి బయటకు తీసుకెళ్తాడు. తరువాయి భాగంలో శ్యామ్ రాధ పేరును బియ్యపు గింజ మీద రాయించి రాధకు ఇస్తూ ఇందులో నీ పేరు ఉంది అనడంతో వెంటనే రాధ.. ఐ లవ్ యు రాసాడేమో అనుకొని అప్పుడే ఆ బియ్యం గింజ తీసుకుని ఉడుకుతున్న అన్నంలో వేస్తుంది. దాంతో శ్యామ్ అయ్యో అలా వేసావ్ ఏంటి అని చెయ్యి పెట్టి తీయడంతో చేయి కాలుతుంది. దాంతో రాధ తనకు కాపురం పెడుతుంది.


also read : Trinayani July 13th: త్రినయని సీరియల్: సుమనను కాటేసిన పాము, మచ్చ గురించి తెలుసుకోవటానికి తాపత్రయపడుతున్న తిలోత్తమా?


 


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial