Jabardasth Rocking Rakesh: ‘జబర్దస్త్’ స్టాండప్ కామెడీ షో ఎంతోమంది కమెడియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ షోలో కామెడీ చేసే ప్రతీ కమెడియన్‌కు ప్రత్యేకంగా ఒక గుర్తింపు లభించింది. అలాంటి వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకడు. ముందుగా రాకేష్.. ‘జబర్దస్త్’లో ఒక టీమ్ మెంబర్‌గా జాయిన్ అయ్యాడు. మెల్లగా తనకు టీమ్ లీడర్ స్థానం లభించింది. చిన్నపిల్లలను టీమ్ మెంబర్లుగా పెట్టి రాకేష్ పండించిన కామెడీ.. చాలాకాలం వర్కవుట్ అయ్యింది. దీనివల్ల తనకు ఎన్ని ట్రోల్స్ ఎదురయినా కూడా రాకేష్ మాత్రం చిన్నపిల్లతోనే కామెడీ చేయిస్తూ ‘జబర్దస్త్’లో కొనసాగాడు. అదే సమయంలో తనకు న్యూస్ రీడర్ సుజాతతో పెళ్లయ్యింది. అసలు వారిద్దరు ఎప్పుడు, ఎలా కలిశారు? రాకేష్ గురించి ప్రేక్షకులకు తెలియని విషయాలేంటి? అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ఈ రాకింగ్ కమెడియన్.
సుజాతతో పరిచయం ఎలా జరిగిందంటే..?
సూజాత.. బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్‌గా ఎంటర్ అవ్వడంతో చాలామంది ప్రేక్షకులకు తెలిసింది. కానీ దానికంటే ముందు తను న్యూస్ రీడర్‌గా పనిచేసింది. అదే సమయంలో రాకేష్‌ను ఒక ఇంటర్వ్యూలో చేయమని అడిగిందట సుజాత. తాను ఎంత కష్టపడి ఈ రంగంలోకి అడుగుపెట్టిందో చెప్పిందట. దీంతో రాకేష్ తనకు సాయంగా నిలబడాలని అనుకున్నాడు. తాను ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే ఒక ఇల్లు చూసి సుజాతను షిఫ్ట్ చేశాడు. అప్పుడే రాకేష్ తల్లి పరిచయమైంది. సుజాతతో సాన్నిహిత్యం ఏర్పడింది. కానీ రాకేష్‌కు పెళ్లి, దాంపత్య జీవితం మీద నమ్మకం అసలు లేదట. ఎప్పటికైనా తాను సన్యాసం తీసుకునే ఆలోచనలో ఉండేవాడినని తాజాగా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు రాకేష్.
స్మశానంలో తిరిగేవాడిని..
స్మశాన జీవితం అంటే తనకు చాలా ఇష్టమని రాకేష్ బయటపెట్టాడు. రాకేష్ స్మశానంలో జీవిస్తున్నాడంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయని, అవన్నీ నిజమే అని తానే స్వయంగా ఒప్పుకున్నాడు. రాత్రి అయితే స్మశానానికి వెళ్లడం తనకు ఇష్టమని, అక్కడ ఉంటే కాటికాపరి కూడా తన ఫ్రెండ్ అని అన్నాడు. రాకేష్ గురువుగా భావించే రాళ్లపల్లి మరణం తర్వాత స్మశానంలో ఆయనను పాతిపెట్టిన ప్లేస్‌లో కూర్చుంటానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీలో తనకు చాలామంది సీనియర్ నటులు తెలుసు అని, వారితో చాలా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు. రాకేష్ రాసుకున్న కథలో నటించడానికి సీనియర్ నటుడు తనికెళ్ల భరణి స్వయంగా ముందుకు వచ్చారని కతజ్ఞత చెప్పుకున్నాడు.
పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు..
స్మశానంలో తిరిగే అలవాటు ఉన్న వ్యక్తిని సుజాత ఎలా పెళ్లి చేసుకుంది అని రాకేష్‌కు ప్రశ్నకు రాకేష్ స్పందిస్తూ.. ‘‘పెళ్లీ మీద ఇంట్రెస్ట్ లేదు. ఆ అమ్మాయిను చేసుకునేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఏమైపోతావో అనే చెప్పాను. పిచ్చిదానివి అన్నాను. అప్పటికే ఆమె ఇంట్లో కూడా చెప్పేసుకుంది’’ అని సుజాత గురించి చెప్పుకొచ్చాడు రాకేష్. పెళ్లి సమయంలో కూడా అన్ని పనులు తనే చేసుకుంది అని బయటపెట్టాడు. పెళ్లి తర్వాత నుంచి స్మశానాలకు వెళ్లడం మానేశానని, దాంపత్య జీవితం గురించి ఆలోచించి కొన్ని మార్పులు చేసుకున్నానని అన్నాడు. అంతే కాకుండా తన కెరీర్‌కు నాగబాబు చేసిన సాయాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు రాకేష్. జబర్దస్త్ కమెడియన్లకు ఇల్లు ఉండడానికి కారణం నాగబాబే అని, చాలామంది ఆ విషయం బయటికి చెప్పుకోరని అన్నాడు.
Also Read: మంత్రి రోజా బర్త్ డే స్పెషల్, ‘జబర్దస్త్‘ టీమ్‌తో తిరుమల శ్రీవారి దర్శనం