Madhuranagarilo July 20th: ఒక బాబా జ్యోతిష్యం చెబుతున్నాడు అని నెల్సన్ అక్కడికి వెళ్లగా.. ఆయన విల్సన్ ప్రాబ్లం చెప్పేసి వశీకరణం రింగు ఇస్తాడు. ఇక తను తన భార్యకు ఆ రింగు పెట్టాలని అక్కడి నుంచి వెళ్తాడు. అదే సమయంలో గన్నవరం, గోపాల్ కూడా అక్కడికి వెళ్తారు. గోపాల్ పెళ్లి సమస్యతో బాధపడుతున్నాడు అని ఆ బాబా చెప్పి తనను చీర కట్టుకొని ఒక మంత్రం చెబుతూ ధ్యానం చేయమని అంటాడు.


గోపాల్ కూడా సరే అంటాడు. చీరలు ఎలా తీసుకోవాలి అనటంతో శిరోజా చీరలు ఉన్నాయి కదా అవి కట్టుకో అని గన్నవరం సలహా ఇస్తాడు. మరోవైపు సంయుక్త, అపర్ణ మధుర ఇంటికి రావడంతో వెంటనే శ్యామ్ తండ్రి మధుర మీ ఫ్రెండ్ అపర్ణ వాళ్ళు వచ్చారు కాఫీ తీసుకొని రా అని అంటాడు. అప్పుడే రాధ వచ్చి మేడం ముత్తైదులను పిలవడానికి వెళ్ళింది. నేను తీసుకొస్తాను అని అంటుంది. వెంటనే అపర్ణ నీకెందుకు అంత శ్రమ అని వెటకారం చేయటంతో నేను చేసే కాఫీ సర్ కి నచ్చుతుంది అని అంటుంది.


నువ్వేం చేయకు సంయుక్త చేస్తుంది పెళ్లయ్యాక ఎలాగైనా చేయాలి కదా అని అనడంతో సంయుక్తను కాఫీ పెట్టమని అంటుంది. శ్యామ్ తనకు కాఫీ వద్దు అని అనటంతో.. పర్వాలేదు కాబోయే భార్య కాఫీ చేస్తే తాగాలి కదా అని అంటుంది రాధ. దాంతో శ్యామ్ రాధ చెప్పింది కాబట్టి తాగుతాను అంటాడు. ఇక రాధ పండు ని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సంయుక్త కాఫీ తీసుకొని వస్తుంది.


ఇక శ్యామ్ కాఫీ తాగుతూ ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో కాఫీ నచ్చలేదేమో అని అపర్ణ అంటుంది. కాని శ్యామ్ సైలెంట్ అవ్వటంతో తను సైలెంట్ గా ఉంటుంది. పెళ్లికి ముందే సంయుక్త అన్ని పనులు చేసేస్తుంది.. పెళ్లి తర్వాత మధురను కూర్చోబెడుతుంది అని అంటుంది అపర్ణ. అప్పుడే మధుర భర్త పేపర్ అడగటంతో నేను చదివి వినిపిస్తాను అని అంటుంది సంయుక్త.


ఇక అందులో కావాలని పెళ్లయి పిల్లలు ఉన్న అమ్మాయిని ప్రేమించిన ప్రబుద్ధుడు అనటంతో వెంటనే శ్యామ్ కాఫీ కక్కుతాడు. దాంతో అపర్ణ బుద్ధి లేకుంటే సరే అంటూ ఇలా పెళ్లయిన అమ్మాయిలను ఎలా ప్రేమిస్తారు అని అనటంతో వెంటనే అది ప్రేమ కాదు వ్యామోం అని అంటాడు శ్యాం తండ్రి. కరెక్ట్ చెప్పారు అని సంయుక్త కూడా అంటుంది.ఇటువంటి వాళ్లను నడిరోడ్డులో షూట్ చేయాలి అని శ్యామ్ తండ్రి వెంటనే శ్యామ్ రాధకు పెళ్లి కాలేదన్న ఎవరికి తెలియదు..


ఇటువంటి పేరు నాకు కూడా వస్తుంది ఎలాగైనా రాధకు పెళ్లి కాలేదని తెలుసుకోవాలి అని అనుకొని ప్లాన్ చేస్తాడు. గోపాల్ చీర కట్టుకొని ధ్యానం చేస్తూ ఉండగా విల్సన్ తన భార్య అనుకొని గోపాల్ చేతికి రింగు తొడుగుతాడు. కానీ గోపాల్ బాబా చెప్పినట్లు ఎవరు ఎవరి డిస్టర్బ్ చేసిన పట్టించుకోవద్దు అన్నట్లు ఉంటాడు. ఆ తర్వాత పసుపు కొట్టే కార్యక్రమంలో సంయుక్త పసుపు కొడతాను అనటంతో పెళ్లైన ముత్తైదులు కొట్టాలి అని అంటుంది మధుర.


రాధ పెళ్లి విషయం తెలుసుకోవటానికి రాధ తో కొట్టిస్తే సరిపోతుంది కదా అని శ్యామ్ అనటంతో రాధ పెళ్లి కాలేదని తెలిసిపోతుంది ఏమో అని భయపడుతుంది. ఇక వెంటనే అక్కడి నుండి మెల్లగా జారుకుంటుంది. మధుర కూడా రాధ తో కొట్టిస్తే బాగుంటుంది అని రాధను పిలవటంతో అప్పుడే రాధ వస్తుంది. ఎక్కడికి వెళ్లావు అని అడగటం తో పాలు పొయ్యి మీద పెట్టేసి వచ్చాను అది ఆఫ్ చేయటానికి వెళ్లాను అని అంటుంది.


పసుపు కొట్టమని అనడంతో పాలు పట్టుకునేటప్పుడు తన చెయ్యి కాలింది అని కట్టు కట్టిన చెయ్యి చూపించటంతో.. మధురవాళ్ళు బాధపడి వేరే వారితో పసుపు కొట్టిస్తుంది. ప్లాన్ సక్సెస్ కాలేదు అని శ్యామ్ బాధపడతాడు. తర్వాయి భాగంలో శ్యామ్ ఆయింట్మెంట్ పెట్టడానికి రాధ దగ్గరికి వెళ్ళగా అక్కడ తనకు ఎటువంటి గాయం కాలేదు అని తెలుసుకుంటాడు. అంటే నీకు పెళ్లి కాలేదు కదా అందుకే అలా చేశావు కదా అనటంతో.. అవును పెళ్లి కాలేదు అని నిజం చెబుతుంది రాధ.


also read it : Trinayani July 19th: ‘త్రినయని’ సీరియల్: భర్తను చితక్కొట్టిన హాసిని, తిలోత్తమ బోనం సమర్పించిందా?


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial