Priyanka Jain - shivakumar: ప్రియాంక జైన్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మౌనరాగం సీరియల్ తో పరిచయం అయ్యి జానకి కలగనలేదు సీరియల్ తో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 లో తొలి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అభిమానులందిరికి షాక్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ షోకు వెళ్ళాకముందే ఆమె ప్రియుడు, మౌనరాగం సీరియల్ హీరో శివ కుమార్ తో కలిసి ఒక ప్రాంక్ వీడియో చేసింది.


అ వీడియో ఏంటంటే.. ఒక సినిమా చూస్తూ ఉండగా అందులో హీరో లేడీ గెటప్ లో కనిపిస్తారు. దీంతో నువ్వు కూడా ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు కదా నాకు నిన్ను అలా చూడాలని కోరికగా ఉంది అంటూ ప్రియాంక చెబుతుంది. అలా ప్రియాంక చెప్పటంతో శివకుమార్ అదేం కుదరదు నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళాలి కదా ఏదో షాపింగ్ అన్నావు వెళ్లి షాపింగ్ చేసుకోపో అంటూ తనని బయటకు పంపిస్తారు. ఇక తాను షాపింగ్ కోసం వెళ్లగా తాను బిగ్ బాస్ కి వెళ్తుందని వెళ్లే ముందు తన కోరికను తీరుద్దాము అంటూ ఈయన ప్రత్యేకంగా ఒక మేకప్ ఆర్టిస్టును పిలుచుకొని అమ్మాయిగా గెటప్ వేసుకున్నారు.


Also Read: Trinayani september 4th: కొడుకు చెంప పగలగొట్టిన తిలోత్తమ.. విశాల్ శాపానికి సుమన ప్రసవనే కారణమా?


 ఇలా అమ్మాయిగా గెటప్ వేసుకున్నటువంటి శివకుమార్ జానకి కలగనలేదు సీరియల్ నటుడితో కలిసి ప్రియాంక ఇంటికి వచ్చి తనని సర్ప్రైజ్ చేయాలని ప్రయత్నిస్తారు. శివకుమార్ గెటప్ మార్చుకున్న ఆయన వాయిస్ మాత్రం మారకపోవడంతో వెంటనే ఈమె తనని గుర్తుపట్టారు అయినప్పటికీ గుర్తుపట్టన్నట్టే మేనేజ్ చేశారు. కానీ చివరికి తను శివ అని గుర్తుపట్టానని చెప్పడంతో ఈ ఫ్రాంక్ కాస్త అట్టర్ ఫ్లాప్ గా మారింది.


అనంతరం శివ మాట్లాడుతూ అసలు ఎలా గుర్తుపట్టావు అని అనడంతో నువ్వు గెటప్ మార్చిన నీ వాయిస్ మారలేదు అలాగే కనుక్కోకూడదని వ్యాక్స్ చేయించుకున్నప్పటికీ చేతికి ఉన్నటువంటి రాఖీలు ఉంగరాలు అలాగే పెట్టుకున్నావు అంటూ చెప్పడంతో ఈ ఫ్రాంక్ కాస్త అట్టర్ ప్లాప్ గా మారిందని శివ చెబుతారు. ఆయనప్పటికీ లేడీ గెటప్ లో శివ చాలా అందంగా ఉన్నారు అంటూ ప్రియాంక తెగ మురిసిపోయింది.ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత ఈ వీడియోని తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.


Youtube Video Link: 



Also Read: Prema Entha Madhuram September 4th: ఛాయాదేవికి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. అను ఇంటికి వచ్చిన ఆర్య?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: 
https://t.me/abpdesamofficial