Prema entha maduram Serial Today Episode: ఆర్య సంతోషంగా పిల్లలతో ఉండగా కేశవ ఆనంది కూడా ఆఫీసుకు వచ్చిందని చెప్తాడు. నువ్వే తీసుకొచ్చావా అని అడిగితే లేదు తనే వస్తానని పట్టుబట్టడంతో తీసుకొచ్చానని కేశవ చెప్తాడు. పిల్లలు చూస్తే హర్ట్‌ అవుతారని ఆర్య అనడంతో ఆ పాపను పిల్లలకు కనబడకుండా మనమే మేనేజ్‌ చేయాలి అని చెప్పి తన చాంబర్‌ లోకి వెళ్తాడు. పిల్లలు, అను, నీరజ్‌ ముందే చాంబర్‌లోకి వెళ్తారు. అక్కడ ఆనంది, ఆర్య సీటులో కూర్చోవడం చూసి షాక్‌ అవుతారు. ఆనంది ఇక్కడ ఉంటే మేము ఇంటికి వెళ్తాం అని బయటకు వెళ్లిపోతారు.


అను: అఖి, అభయ్‌ ఇలా వచ్చేస్తే ఎలా నాన్న హర్ట్‌ అవ్వరా?


అఖి: మరి నా ప్లేస్‌లో ఆ అమ్మాయి కూర్చుంటే నేను హర్ట్‌ అవ్వనా?


అను: అది కాదమ్మా నాన్నకు తను వచ్చిందని తెలియదమ్మా..


అభయ్‌: తను ఇంట్లో ఉంటే మాకు డిస్టర్బ్‌ గా ఉందని ఆఫీసుకు వస్తే ఇక్కడికి కూడా తనని తీసుకొచ్చారా?


అను: అభయ్‌ కేశవకు మీరు ఇక్కడికి వస్తున్నారని తెలియదు. పాపం చిన్న పిల్ల అని తీసుకొచ్చి ఉంటారు.


అఖి: తను నాన్న చైర్‌లో కూర్చుంటే నాకు ఏడుపొస్తుంది.


అభయ్‌: తను ఇంకా ఎన్ని డేస్‌ మన ఇంట్లో ఉంటుంది అమ్మా.. వాళ్ల పేరేంట్స్‌ ఎప్పుడొస్తారు.


అంటూ పిల్లలు చెప్పి వెళ్లిపోతారు. లోపల నీరజ్‌ ఆనందిని పెద్దవాళ్ల చైర్‌లో కూర్చోకూడదు అని చెప్పడంతో నాన్న చైర్‌ అని కూర్చున్నాను అనడంతో నీరజ్‌, కేశవ షాక్‌ అవుతారు. ఆర్య ఆనందిని కారులో కూర్చో వెళ్లు అని చెప్పగానే సరే అంటూ వెళ్తూ అక్కడ సోఫాలో ఉన్న చీర తనకు నచ్చిందని తీసుకుని వెళ్తుంది. దీంతో ఆర్య, నీరజ్‌ కేశవ ఆలోచిస్తూ ఉండగానే ఆర్య  తన టేబుల్‌ వైపు షాకింగ్‌ గా చూస్తుంటాడు. అక్కడున్న ఫైల్‌ మీద రాజనందిని అని సైన్‌ చేసి ఉంటుంది. కేశవ వెంటనే సీసీటీవీ పుటేజీ తీసుకొస్తాడు. అందులో రాజనందిని సంతకం ఆనంది  చేయడం  చూసి షాక్ అవుతారు.


కేశవ: ఏంటిది ఆర్య ఈ పాప రాజనందిని సంతకం చేయడం ఏంటి? అసలు తనకి రాజనందిని పేరు కానీ తన గురించి ఎలా తెలుసు?


ఆర్య: అప్పుడప్పుడు అను మాత్రమే రాజనందిని ట్రాన్స్‌లోకి వెళ్తుంది. అది కూడా అష్టమి రోజు మాత్రమే కానీ ఈ ఆనంది ఇలా చేయడం ఎంటో నాకేం అర్థ కావడం లేదు.


నీరజ్‌: దాదా మనం ఈ విషయాన్ని వీలైనంత త్వరగా సాల్వ్‌ చేయాలి. లేదంటే కొత్త ప్రాబ్టమ్‌  రైస్‌ అయ్యే చాన్స్‌ ఉంది.


కేశవ: ఈ పాప ఎందుకిలా చేస్తుంది. స్వతహాగా తనకు తనే ఇలా ప్రవర్తిస్తుంది.


ఆర్య: నాకెందుకో ఇది మనం అనుకున్నంత సిపుల్‌ కాదనిపిస్తుంది.


అనగానే  దాదా ఈ విషయాలేవీ నువ్వు పట్టించుకోవద్దు. నేను జెండే చూసుకుంటాము. లేదంటే పిల్లలు డిస్టర్బ్‌ అవుతారు. నువ్వు వెళ్లు అంటూ ఆర్యను ఆఫీసు  నుంచి పంపిస్తారు. ఆర్య బయటకు రాగానే ఆనంది బయటే నిలబడి ఉంటుంది. ఎందుకు ఇక్కడున్నావు అని ఆర్య అడగ్గానే నీకోసమే నాన్న అంటుంది. దీంతో సరే పదా అని కారు దగ్గరకు వెళ్తుంటారు.  కారులో పిల్లలతో కూర్చున్న అను పిల్లలకు సర్దిచెప్తుంది.


అను: అఖి, అభయ్‌ మీరు ఇలా డల్‌గా ఉంటే  నాన్న ఫీలవుతారు. ప్లీజ్‌ మీరు నార్మల్‌గా ఉండండి. అదిగో నాన్న కూడా వస్తున్నారు.  మనం దారిలో ఐస్‌క్రీమ్‌ కూడా తిందాం ఓకే.


అనగానే ఆర్య, ఆనంది వస్తారు. కారులో ఇంటికి వెళ్తుంటారు. అఖి, అభయ్‌ ఆనందిని తిడతారు. అను, ఆర్య పిల్లలను వారిస్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


Also Read: మోడ్రన్ మహానటి.. ట్రెడీషనల్​ నుంచి ట్రెండీగా మారిన కీర్తి సురేష్