Guppedanta Manasu  Serial Today Episode: దేవయాని, శైలేంద్ర, ఫణీంద్ర, మహేంద్ర ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఫణీంద్ర తాను ఒక డిసిషన్‌ తీసకున్నానని దానికి నువ్వు ఒప్పుకోవాలని మహేంద్రకు చెప్తాడు. ఏంటని మహేంద్ర అడగ్గానే రిషికి కర్మకాండలు జరిపిద్దాం. నీ బాధ చూడలేకపోతున్నాను అని ఫణీంద్ర అంటాడు. దాంతో షాక్ అయిన మహేంద్ర సైలెంట్‌గా ఉండిపోతాడు. నీ మనసు ఏమైనా నొప్పించానా అని ఫణీంద్ర అడుగుతాడు. లేదు అన్నయ్య.. మీరు ఎప్పుడు నా మనసు నొప్పించలేదు. సంతోషంగా ఉండేలా చూసుకున్నావ్. కానీ, మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తి వచ్చిందో కానీ నా బతుకు ఇలా అయింది అని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు.


దేవయాని: ఎమోషనల్ అవకు మహేంద్ర. అంతా విధి రాత.


శైలేంద్ర: అవును బాబాయ్ నాకు చాలా బాధగా ఉంది. ముందు జగతి పిన్ని, తర్వాత నాకు ప్రాణంకంటే ఎక్కువైన నా తమ్ముడు రిషి చనిపోయారు.


ఫణీంద్ర: నేను అయితే రేపు కర్మకాండలు జరిపిద్దామనుకుంటున్నాను.


మహేంద్ర: వద్దు అన్నయ్య.. వద్దు. నన్ను క్షమించండి అన్నయ్య. మీ మాట కాదంటున్నందుకు.


ఎందుకు వద్దంటున్నావ్ అని దేవయాని అంటే.. చెప్పు మహేంద్ర అని ఫణీంద్ర అంటాడు. వసుధార ఇంకా రిషి బతికే ఉన్నాడని నమ్ముతుంది. మొన్న సంతాప సభ జరిపిస్తేనే అరిచింది. ఇలా చేస్తే ఇంకా కోప్పడుతుంది. ఇంకోసారి రిషి చనిపోయాడని అనొద్దు అంటుంది అని మహేంద్ర అంటాడు. రిషి లేడని వసుధార నమ్మేవరకు ఇవేవి జరిపించొద్దు అని మహేంద్ర అంటాడు. మనందరం మోసం చేశామని వసుధార దూరంగా వెళ్లిపోతుంది అని మహేంద్ర అంటాడు.


శైలేంద్ర: అలా జరగాలనే కదా ఇలా ప్లాన్ చేసింది (అని మనసులో అనుకుంటాడు.)


ఫణీంద్ర: నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.


మహేంద్ర: అన్నయ్య మీరు ఇంత చెప్పాకా ఇంకా ఇలా కఠిన నిర్ణయం తీసుకుంటే ఎలా


ఫణీంద్ర: తండ్రిగా రిషి కర్మకాండలు జరిపిస్తే జరిపించు లేకుంటే తండ్రి స్థానంలో పెదనాన్నగా నేనే జరిపిస్తాను. ఏమంటావ్ చెప్పు


మహేంద్ర: మీ ఇష్టం అన్నయ్య జరిపించండి నేను వస్తాను.


 అని చెప్పి మహేంద్ర వెళ్లిపోతాడు. దీంతో పంతులుకు ఫోన్ చేసి ఏర్పాట్లు చేయమని దేవయానికి ఫణీంద్ర చెబుతాడు. మరోవైపు ఫణీంద్ర, మహేంద్ర గురించి ఆలోచిస్తుంటుంది వసుధార. ఇది శైలేంద్ర కుట్రనా అని డౌట్ పడుతుంది. ఇంతలో అటెండర్ వచ్చి మను గారు ఈ ఫైల్ పై సంతకం చేయమన్నారు అని చెబుతాడు. దీనిపై ఆయన సంతకం లేదేంటి అని వసుధార అడుగుతుంది. ఫైల్ తీసుకుని మను దగ్గరికి వెళ్తుంది వసుధార. ఏంటిది. అధికారం చెలాయిద్దామనుకుంటున్నారా అని ఫైర్ అవుతుంది.


మను: నేను మీలాగే కాలేజీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. మీరు అప్రూవల్ చేసిన ఫైల్ పై సంతకం చేస్తే ఎలాంటి సమస్య ఉండదు అని అనుకున్నాను. కూల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకే కరెక్ట్ అనిపిస్తుంది.


వసుధార: నేను మీకు టైమ్ ఇస్తున్నాను. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి.


 అని చెప్పి వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు ఇంట్లో జరిగిన విషయం వసుధారకు చెప్పాలనుకుని ధరణి ఫోన్‌ చేయబోతుంటే  శైలేంద్ర, దేవయాని వచ్చి ఏంటీ ఇక్కడ జరిగేది వసుధారకు చెప్పాలనుకుంటున్నావా అని ఫోన్ లాక్కుంటాడు శైలేంద్ర. నేను ఆ ఎండీ సీటు కోసం పిచ్చెక్కిపోతున్నాను. రేపటి వరకు సైలెంట్‌గా ఉండు అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ తీసుకుని వెళ్లిపోతాడు శైలేంద్ర.  తర్వాత కాలేజీకి వచ్చిన మహేంద్రతో మీ అన్నయ్య ఎందుకు పిలిచారు అని అనుపమ అడుగుతుంది. ఏం లేదని మహేంద్ర అంటాడు.


అనుపమ: ముఖ్యమైన విషయం అన్నావ్. ఏం లేకుండా ఎలా ఉంటుంది. నువ్ అబద్ధం చెబుతున్నావ్ అని అర్థమవుతోంది.


వసుధార: మావయ్య ఏమైనా సమస్యనా


మహేంద్ర: అలాంటిదేం లేదు అమ్మా. అన్నయ్యకు హెల్త్ బాలేదట అందుకే రమ్మన్నారు.


 అని మహేంద్ర అంటాడు. అవునా, ఇప్పుడు ఎలా ఉంది. అయినా దానికి ఒంటరిగా రమ్మనాల్సిన అవసరం ఏముంది అని వసుధార అంటుంది. దాంతో మహేంద్ర సైలెంట్ అవుతాడు. మరోవైపు ఈ మాటలన్నీ మను వింటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: నవ్విస్తూ భయపెట్టిన అంజలి - అంచనాలు పెంచేసిన 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' టీజర్