Prema Entha Madhuram November 28 episode: అక్కిని తీసుకు వస్తున్న ఆర్య ని చూసి అదిగో అన్నయ్య అక్కిని తీసుకు వస్తున్నాడని చెప్తుంది ఉష. అప్పుడు ఇంట్లో అందరూ బయటికి పరుగులు తీస్తారు. అను మాత్రం లోపల ఉండిపోతుంది.


సుగుణ: ఆర్య చేతుల నుంచి అక్కిని తీసుకుని ముద్దు చేస్తుంది. అక్కి అమ్మ కావాలి అనడంతో లోపల ఉంది వెళ్ళు అని పాపని లోపలికి పంపిస్తుంది. తర్వాత ఆర్య పక్కన కూర్చొని సమయానికి నువ్వు వెళ్ళకపోయి ఉంటే పాప పరిస్థితి ఏమైయ్యేదో, తల్లి పిల్లల్ని కలిపి ఎంతో పుణ్యం చేసుకున్నావు.


ఇంట్లోకి వెళ్లిన అక్కి అనుని హగ్ చేసుకుటుంది. ఇద్దరూ బాగా ఏడుస్తూ ఉంటారు అంతలోనే అక్కడికి అభయ్ వచ్చి నీకోసం ఎంత ఏడ్చానో తెలుసా అంటాడు.


అక్కి: నేను కూడా ఎంతో ఏడ్చాను. ఫ్రెండ్ రాకపోతే నా పరిస్థితి ఏంటో అని భయపడిపోయాను.


అభయ్ నేరుగా ఆర్య దగ్గరికి వెళ్లి థాంక్యూ సో మచ్ ఫ్రెండ్, నీవల్లే అక్కి సేఫ్ గా ఇంటికి వచ్చింది. నువ్వు చాలా మంచోడివి ఐ లవ్ యు అంటూ హగ్ చేసుకుంటాడు.


అను: ముసుగు వేసుకొని బయటికి వచ్చి ఆర్యకి థాంక్స్ చెప్తుంది. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.


ఆర్య: ఇది నా బాధ్యత అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా వల్లే వస్తున్నాయి కానీ మీ ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకునే బాధ్యత నాది.


సుగుణ: పాప ఎప్పుడు తిన్నదో ఏంటో వెళ్లి స్నానం చేయించి తనకు తినటానికి ఏమైనా పెట్టు అనడంతో అను లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఆర్యకి దిష్టి తీసి లోపలికి తీసుకు వెళ్తుంది.


తర్వాత ఆర్యకి ఆయింట్మెంట్ పెడుతూ కన్నీరు పెట్టుకుంటుంది సుగుణ.


సుగుణ: పాపిష్టి వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టారు, ఆ ల్యాండ్ కోసం ప్రాణాలు తీసేలాగా ఉన్నారు, మన వల్ల రాధా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ గొడవలు అవి వద్దు నాన్న ఈ ల్యాండ్ ఇచ్చేద్దాం, మాకు నువ్వు ఉంటే చాలు.


ఆర్య: వద్దమ్మా, ఇది నాన్న సంపాదన, దాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది..  నువ్వు ధైర్యంగా ఉండు.


అప్పుడే అక్కి వచ్చి ఆర్యకి ఆయింట్మెంట్ రాస్తూ కన్నీరు పెట్టుకుంటుంది. మీరు నన్ను కాపాడటానికి వచ్చారు కాబట్టి ఇన్ని దెబ్బలు తగిలాయి. నొప్పిగా ఉందా,


ఆర్య: నొప్పిగా ఉంది కానీ నువ్వు ఏడుస్తుంటే నొప్పి ఎక్కువైపోతుంది. నువ్వు నవ్వుతుంటే నొప్పి తగ్గిపోతుంది అంటూ పిల్లలు ఇద్దరినీ నవ్విస్తాడు ఆర్య.


తర్వాత సుగుణ వాళ్లు టిఫిన్ ఆర్డర్ రావడంతో కంగారుపడుతూ పనులు చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన అను నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి పూరీలు వేయించడానికి కూర్చుంటుంది. అప్పుడే ఆర్య రావడం చూసిన సుగుణ అన్నయ్య టిఫిన్ చేస్తాడేమో అడుగు అని ఉషకి చెప్తుంది.


ఉష: అన్నయ్య టిఫిన్ చేస్తావా?


ఆర్య: వద్దు ఆర్డర్స్ లిస్టు రాసుకుంటున్నాను.


వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే తన వెనుక ఆర్య ఉన్నాడు అని గ్రహించిన అను పైటకొంగు తలపై కప్పుకొని కంగారు పడుతూ ఉంటుంది.


ఉష :అది గమనించి ఎందుకు మా అన్నయ్యని చూసిన ప్రతిసారి ఈవిడ భూకంపం వచ్చినట్లు వణికి పోతుంది అనుకుంటుంది.


అను: సుగుణ దగ్గరికి వచ్చి మీరు పూరీలు వేయించండి నేను ఆరేసిన బట్టలు తీసి లోపల పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఆర్య బయటకు వచ్చి డబ్బులు సుగుణకి ఇచ్చి వెళ్ళిపోతాడు. అతని కంటపడనందుకు ఊపిరి పీల్చుకుంటుంది అను.


మరోవైపు దెబ్బలతో బాధపడుతూ కూర్చుంటాడు జలంధర్.


ఛాయాదేవి: అప్పుడే అన్న దగ్గరికి వచ్చి టాబ్లెట్ ఇచ్చి వేసుకోమంటుంది.


జలంధర్: ఆ టాబ్లెట్స్ తోసేసి నాకు ఈ నొప్పుల కన్నా ఆ ఆర్యని ఏమీ చేయలేకపోతున్నాం అనే బాధ ఎక్కువైపోతుంది. ఆ ల్యాండ్ మనం దక్కించుకోకపోతే ప్రాజెక్ట్ మనకి దక్కదు అని అంటాడు. 


మాన్సీ: బ్రో ఇన్ లా అక్కడ ఉండగా ఆ ల్యాండ్ మనకి దక్కదు. మనం వేరే బిజినెస్ చూసుకోవడం మంచిది.


ఛాయాదేవి: కోపంగా మన ప్రయత్నం మాత్రమే విఫలమైంది అయినా ఆ ల్యాండ్ సంపాదించడానికి ఇంకా రెండు వారాలు టైముంది ఈ లోపు ఏమైనా చేద్దాం.


మాన్సీ: అయినా ఇదంతా అను వల్లే భర్త వచ్చి కాపాడుతాడు అన్న ధీమాతో సంతకం పెట్టనీయకుండా చేసింది అని కోపంగా అంటుంది.


అప్పుడు జలంధర్ కోపంగా అనుకి ఫోన్ చేస్తాడు.


జలంధర్: నీ కూతురు నీ దగ్గరికి వచ్చేసిందని ఆనందపడుతున్నట్లుగా ఉన్నావు కానీ జాగ్రత్త మళ్ళీ నీ పిల్లల్ని ఎప్పుడూ ఎలా ఏం చేస్తానో నాకే తెలియదు.


అను: తెలివిగా ఫోన్ రికార్డింగ్ చేస్తూ అయితే మళ్లీ చావు దెబ్బలు తినటానికి రెడీగా ఉండు నిన్ను ఆయన ప్రతిసారి వదిలేస్తున్నారు అని లైట్ తీసుకోకు ఇప్పటికే చావు అంచుల వరకు వెళ్లి వచ్చావు. మళ్లీ అలాంటి ప్రయత్నం చేస్తే చావు అంచులు దాటి వెళ్లిపోవడమే అటు నుంచి మళ్లీ వెనక్కి రావు అంటూ ధీమాగా మాట్లాడుతుంది.


జలంధర్ : ఎప్పటికైనా ఆర్యని ఓడించి నీ నమ్మకం మీద దెబ్బ కొడతాను.


నువ్వు ఏమి చేయలేవు అన్నట్లుగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది అను. అప్పుడే అక్కడికి వచ్చిన ఉష తనని పిలవడంతో ఉలిక్కిపడుతుంది.


ఉష: ఎందుకు నన్ను చూసి ఉలిక్కి పడుతున్నారు, మా అన్నయ్యని చూసినప్పుడు కూడా మీరు అలాగే కంగారు పడిపోతూ ఉంటారు మా అన్నయ్య ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే మనిషి కాదు కదా.


అను: ఛా, ఛా అలాంటిదేమీ లేదు నేను కొత్త వాళ్ళతో సరిగ్గా కలవలేను కొత్త వాళ్ళని చూస్తే నాకు భయం అంతే అంటుంది.


ఉష: అంతేనా లేకపోతే నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అంటూ అనుమానంగా అడుగుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆