Trinayani Serial Today November 28th Episode
నయని: నాగయ్యకు ఎవరి వల్ల శాపం కలిగిందిపెద్దబొట్టమ్మ: ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు నయనినయని: పెద్దమ్మ కాసేపు ఉలూచిని ఎత్తుకుంటావని పిలిచానుపెద్దబొట్టమ్మ: అలాగా రా అమ్మా రా.. ఉలూచి.. అమ్మని వచ్చాను చూడు.. నయని: పెద్దమ్మ అయితే నువ్వు ఒక సాయం చేయాలి నాగులాపురం నుంచి తెచ్చిన పెట్టెలోని తాళపత్రాలు నువ్వు చదవాలివల్లభ: దూరం నుంచి చాటుగా.. అమ్మనా పెద్ద మరదలూ పెద్ద స్కెచే వేశావ్ పెద్దబొట్టమ్మ: చదువుతానుగానీ జరగబోయేది తెలుసుకునే కొద్ది బాధగా ఉంటుంది అమ్మనయని: పర్లేదు కానీ అందులో ఏముందో తెలియాలి
వల్లభ తన తల్లి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి జరిగిన విషయం చెప్తాడు. మరోవైపు హాల్‌లో విశాల్, విక్రాంత్, హాసిని, పావనామూర్తి, డమ్మక్క కంగారుగా పెద్దబొట్టమ్మ ఎదురు చూస్తారు. సుమన వచ్చేలోపు ఆ తాళపత్రాలు చదవమని చెప్తారు. ఇంతలో తిలోత్తమ కూడా అక్కడికి వచ్చి బాగానే మ్యానేజ్ చేశారురా..తిలోత్తమ: ఉలూచిని నయని ఎత్తుకొని వచ్చి పెద్దబొట్టమ్మకు ఇవ్వడం ఆమె వచ్చి తాళపత్రాలు చదవడం గ్రేట్.. మీ పనులు పూర్తి చేసుకోవడానికి చిన్న కోడల్ని వాడుకుంటారా.. అది కూడా తన కళ్లకు గాయం చేసివిశాల్: అమ్మ వేరే దారిలేక ఇలా చేశాం. మానవమాత్రులు ఎవ్వరూ ఆ పెట్టెలోని తాళపత్రాలు చదవలేరు అని తెలిసినప్పుడు పాము రూపంలో ఉన్న పెద్ద బొట్టమ్మ చదవగలదు అని సలహా ఇచ్చింది విక్రాంతే. నయని పెట్టె తెరువు.
మరోవైపు వల్లభ సుమనను లేపుతాడు. తన తింగరి మాటలతో సుమనను కంగారు పెడతాడు. వల్లభ: కళ్లు మంటతో నువ్వు ఇక్కడ ఉంటే నీ కూతురు ఉలూచి ఆ పెద్దబొట్టమ్మ ఒడిలో ఉంది. సుమన: అదేంటి పాప గదిలో లేదా.. ఉయ్యాల్లో పడుకొని ఉంది కదావల్లభ: నువ్వు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నావు. నిన్ను ఇలా ఉంచి మీ అక్క ఉలూచిని తీసుకెళ్లి పెద్ద బొట్టమ్మకు ఇచ్చిందిసుమన: పాప.. పాప.. పెద్దబొట్టమ్మ: ఒక్క రోజుకు ఒకటి మాత్రమే చదవగలనువిక్రాంత్: అదేంటి.. పెద్దబొట్టమ్మ: నియమనిబంధనలు అలాగే ఉన్నాయిడమ్మక్క: సరే పెద్దబొట్టమ్మ ఒక్కటైనా చదివేసే.. టైం అవుతుందిపెద్దబొట్టమ్మ: ఆ తాళపత్రాన్ని గాయత్రి పాప చేతిలో పెట్టండి చదువుతానుతిలోత్తమ: తన చేతిలో ఎందుకు పెట్టాలి విశాల్: అమ్మా పసిపిల్లలు అంటే దేవుడితో సమానం కదా అందుకే ముందు వాళ్ల చేతిలో నైవేద్యంగా ఉంచి చదవాలిపెద్దబొట్టమ్మ: అంతే బాబు
ఇక నయని గాయత్రి చేతికి ఆ తాళపత్రాన్ని ఇస్తుంది. మరోవైపు వల్లభ సుమనను హాల్‌లోకి తీసుకెళ్తాడు. పెద్దబొట్టమ్మ తాళపత్రం చదువుతుంది."జన్మ మారినా శత్రుత్వం మారదు. దాని వల్లే గాయత్రీ దేవికి ప్రాణ గండం సంభవిస్తుంది. నెత్తుటి కష్టమే ఇష్టాన్ని సంరక్షించుకోగలదు" ఇది చదివేలోపు సుమన హాల్ లోకి వచ్చి మళ్లీ ఎందుకు వచ్చావ్ అని పెద్దబొట్టమ్మని అడుగుతుంది. సుమన: ఎక్కడ ఉన్నావ్.. మాట్లాడు.. నయని: చెల్లి ఎందుకు ఆవేశపడుతున్నావ్. నువ్వు విరుచుకుపడితే ఉలూచిని ఎత్తుకున్న పెద్దబొట్టమ్మ కింద పడుతుంది. సుమన: నా బిడ్డ కింద పడి ఏదైనా జరిగితే తనకు ప్రాణ గండం అని చేతులు దులుపుకుందాం అనుకున్నావా అక్కానయని: ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్ చెల్లి.. ప్రాణ గండం నీ బిడ్డకు కాదు నా బిడ్డకి. సుమన: ఇలాంటి కబుర్లు బాగానే చెప్తావ్. ఎక్కడో ఉన్న బిడ్డకు గండం అని నా బిడ్డని పాము చేతిలో పెడతావావిశాల్: సుమన మా అమ్మని అనే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదిసుమన: న్యాయం చెప్పే బావగారు నా కళ్లును మండించి ఈ జన్మలో మీ అమ్మ ఆయుష్షను పెంచుకోవాలి అనుకునే స్వార్థపరులు అయిపోయారానయని: అమ్మగారు పునర్జన్మలోనూ సంతోషంగా ఉండకూడదు అనుకున్నారాతిలోత్తమ: గండం వస్తే దాన్ని ఆడిపోసుకోక మమల్ని అంటే లాభం ఏముంది నయనిసుమన: అక్కా నీ పెద్ద బిడ్డకు గండం వస్తుందో పిండం పెడతారో విశాల్: విక్రాంత్ నీ పెళ్లం నోరు అదుపులో పెట్టుకోమని చెప్పువిక్రాంత్: రెండు పీకినా పర్లేదుసుమన: భార్యను వేరే వారితో కొట్టాలి అని చెప్పే భర్త ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేపెద్దబొట్టమ్మ: అమ్మా దయచేసి కొట్టుకోకండి ఇక్కడ ఎవరి స్వార్థంతో వాళ్లు ఉన్నారు. నేను కూడా కాసేపు అయినా ఉలూచిని ఎత్తుకోవచ్చు అని పెట్టెలో ఉన్న గాయత్రీ దేవి పునర్జన్మని ఎత్తుకోడానికి వచ్చానుడమ్మక్క: వచ్చావు.. చదివేశావు..ఇక బిడ్డను ఇచ్చి వెళ్లిపో
ఇక ఉలూచిని హాసిని తీసుకొని తిలోత్తమకు ఇస్తుంది. తిలోత్తమ సుమనకు ఇవ్వడంతో మంటతో కళ్లు తెరవలేని సుమన అది పెద్దబొట్టమ్మ అనుకొని తిలోత్తమ గొంతు పట్టుకుంటుంది. అందరూ విడిపించడానికి తెగ ప్రయత్నిస్తారు. దీంతో తిలోత్తమ సుమన చెంప మీద కొడుతుంది. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: డీప్ ఫేక్ వీడియోపై స్పందించిన రష్మిక - అలా అనేసింది ఏమిటీ?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply