Brahmamudi Telugu Serial Today Episode: అప్పును టిఫిన్ చేయమని వాళ్ల పెద్దమ్మ పిలవడంతో టిఫిన్ వద్దని ఇంత విషం ఉంటే పెట్టమని కోపంగా చెప్పి బయటకు వెళ్తుంది అప్పు. అప్పు పరిస్థితిని అర్థం చేసుకున్న కనకం వాళ్ల అక్కతో ఎలాగైనా అప్పును కళ్యాణ్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. అదే విషయం వాళ్ల అక్కతో చెబితే వద్దని వారిస్తుంది. కానీ కళ్యాణ్ కూడా అప్పును ప్రేమిస్తుండొచ్చని పెళ్లికి ముందే కళ్యాణ్‌కు విషయం చెప్పి అప్పును పెళ్లి చేసుకునేటట్లు చేస్తే అప్పు సంతోషిస్తుందని కనకం చెప్తుండగానే వాళ్ల ఆయన కోపంగా దీన్ని కూడా ఆ ఇంటికే కోడలుగా పంపుతావా? నీకు బుద్దుందా ఈ విషయం తెలిస్తే ఇక్కడ ఉన్నదాన్ని అక్కడకు పంపడం కాదు. అక్కడ ఉన్న ఇద్దరినీ ఇక్కడకు పంపిస్తారు అంటూ వార్నింగ్ ఇస్తాడు. కనకం బాధపడుతూ చూస్తుండిపోతుంది. స్వప్న బెడ్‌రూంల టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడికి కావ్య వచ్చి
కావ్య: ఇలా ఎంతకాలమని ఇంకా పిచ్చి పనులు చేస్తూనే ఉంటావు అక్క.
స్వప్న: అసలే నేను చాలా చిరాకులో ఉన్నాను. నన్ను ఇంకా చిరాకు పెట్టకు.
కావ్య: నీకెందుకు చికాకు. మాకు కదా ఉండాలి.
స్వప్న: ఇక్కడ సమస్య నాది. నీది కాదు.
కావ్య: నీ సమస్య నాది కూడా.. అని ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు అక్క. నువ్వు ఏ తప్పు చేసినా అది నా మెడకు చుట్టుకుంటుంది. నీతో పాటు నన్ను కూడా కలిపి తప్పు పడతారు.
స్వప్న: అయితే ఇప్పుడు అందరి దగ్గరకు వెళ్లి మా చెల్లి ఏ తప్పు చేయలేదని బతిమాలమంటావా?
కావ్య: నేను మాట్లాడుతుంటే నీకు కోపం వస్తుంది కానీ నువ్వు ఎంత ధీనమైన పరిస్థితుల్లో ఉన్నావో తెలుస్తుందా?
స్వప్న: తెలుసు
కావ్య: తెలియదు. తెలిస్తే నువ్వు ఇలా చేయవు. ఏ ఆడపిల్లకైనా తల్లి కావడం అనేది చాలా పెద్ద విషయం. అది తెలియగానే ఎంత సంతోషపడుతుందో తెలుసా? తన చుట్టు ఉన్నవాళ్లకు తన భర్తకు అందరికీ గర్వంగా చెప్పుకుంటారు. దాన్ని ఒక పండగలా చేస్తారు. కానీ నీ విషయంలో మాత్రం అది తెలియగానే అందరూ అయోమయంలో పడ్డారు.
స్వప్న: ఎవ్వరేమనుకున్నా నేను మాత్రం ఏ తప్పు చేయలేదు.
కావ్య: చేయని దానివి అయితే ఆ అరుణ్‌కు డబ్బులెందుకు ఇచ్చావు?
అని కావ్య అడగగానే నేను ఎంతో నమ్మిన అరుణ్ ఇలా మారతాడని నేను అస్సలు ఊహించలేదు అంటూ బాధపడుతుంది స్వప్న. అయితే అరుణ్ ఎందుకు అలా మారాడో నేను తెలుసుకుంటాను. తెలుసుకుని నిజానిజాలు బయటపెడతాను. అంటూ స్వప్నను ధైర్యంగా సంతోషంగా ఉండమని చెప్తుంది కావ్య. తర్వాత బయటకు వచ్చిన కావ్య అరుణ్ గురించి ఆలోచిస్తుంది.
రుద్రాణి రాహుల్ ను ఆఫీసుకు వెళ్లమని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం బాగాలేదని మందలిస్తుంది.
రాహుల్: అక్కడికి వెళ్లి రాజ్ చెప్పింది చేస్తూ.. అలాగే సార్ అంటూ అసిస్టెంట్‌గా పనిచేయమంటావా?
రుద్రాణి: రాజు లాంటి శకుని కూడా కొన్నాళ్లు ఖారాగారంలో ఉండాల్సి వచ్చింది.
రాహుల్: పోలీకలు కూడా విలన్‌తోనే పోల్చాలా మామ్.
రుద్రాణి: మనది కానీ అస్థిని మనది చేసుకోవాలనుకుంటే అలాంటి వాళ్లనే ఫాలో అవ్వాలి.
అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి కావ్య వస్తుంది. అరుణ్‌కు స్వప్న డబ్బులు ఇచ్చిన విషయం మీకెలా తెలిసింది. ఆ ఫోటోలు మీ దగ్గరకు ఎలా వచ్చాయి. అంటూ ప్రశ్నించడంతో రాహుల్, అరుణ్ ఇచ్చాడని వాడినే అడగమని చెప్తాడు. అనామిక, కళ్యాణ్ షాపింగ్‌కు ఓల్డ్ సిటీకి వెళ్తుంటారు. కళ్యాణ్ షాపింగ్‌కు అప్పును తీసుకెళ్దామని అనామికకు చెప్తాడు. కనకం ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. వాళ్ల అక్క వచ్చి మూర్తి చెప్పిందే కరెక్ట్ అని నువ్వేమి ఆలోచించొద్దని చెప్తుంది. కానీ అప్పు పరిస్థితి చూస్తే బాధేస్తుందని కనకం చెప్తుంది. ఇంతలో కళ్యాణ్ అప్పును పిలుస్తూ లోపలికి వస్తాడు.
కళ్యాణ్: ఆంటీ అప్పు ఎక్కడ?
కనకం: ఎక్కడంటే ఏం చెప్పను బాబు గదిలోంచి బయటకు రావడమే లేదు.
కళ్యాణ్: ఏందుకు.. ఏమైంది?
కనకం: ఎందుకు అంటే సమాధానం చెప్పదు. తినమంటే తినదు. ఊరికే మామీద అరుస్తుంది. దాని బాధేంటో నువ్వైనా కనుక్కో బాబు.
అనగానే కళ్యాణ్ అప్పు రూంలోకి వెళ్లి ఎందుకు బాధపడుతున్నావు.. అసలు నువ్వు నువ్వేనా అంటూ బయటకు తీసుకువస్తాడు. అప్పు కళ్యాణ్‌ను తిడుతుంది. కళ్యాణ్ అవేమీ పట్టించుకోకుండా అప్పును షాపింగ్‌కు వెళ్దామని బతిమాలుతాడు. అప్పుకు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు. ఇంతలో అనామిక లోపలికి వచ్చి కళ్యాణ్ మీద కోప్పడుతుంది. పిచ్చిదానిలా నన్ను కారులో కూర్చోబెట్టడం ఎం బాగాలేదని.. ఇప్పటివరకు నాకోసం ఎవ్వరైనా వెయిట్ చేశారని నేను ఎవ్వరి కోసం వెయిట్ చేయలేదని సీరియస్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read : 'ఆర్య 2'కి 14 ఏళ్లు - బన్నీ ఎమోషనల్ పోస్ట్!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply