Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కెరియర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో 'ఆర్య',(Arya) 'ఆర్య 2'(Arya 2) వంటి సినిమాలు ముందు వరుసలో ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వెండితెరపై ఎన్ని ప్రేమకథలు వచ్చినా సుకుమార్ 'ఆర్య',(Arya) 'ఆర్య 2'(Arya 2) సినిమాలు ఎప్పుడు ప్రత్యేకమే. 'గంగోత్రి'(Gangotri) సినిమాతో తెలుగు వెండితెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ కి 'ఆర్య'(Arya) మూవీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. కేవలం తెలుగులోనే కాదు మలయాళం లోనూ బన్నీ స్టార్ హీరోగా ఎదగడానికి ఈ మూవీ ఎంతో ఉపయోగపడింది. 'ఆర్య'(Arya) వచ్చిన ఐదు సంవత్సరాలకు నా సినిమాకు సీక్వెల్ గా 'ఆర్య 2'(Arya 2) రిలీజ్ అయింది.
2009 నవంబర్ 27న విడుదలైన 'ఆర్య 2' నేటితో(2023 నవంబర్ 27) విజయవంతంగా 14 సంవత్సరాల పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. 'ఆర్య 2' మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ షూటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఆర్య 2 సినిమా 14 ఏళ్ళు పూర్తి చేసుకోవడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తపరిచిన బన్నీ ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని, మనసుకు దగ్గరైన చిత్రమని అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. దీంతో బన్నీ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక 'ఆర్య 2'(Arya 2) విషయానికొస్తే.. BVSN ప్రసాద్ సమర్పణలో ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై ఆదిత్య బాబు నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. నవదీప్, శ్రద్ధదాస్, బ్రహ్మానందం, శియాజీ షిండే, ముఖేష్ ఋషి, అజయ్ కీలక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు అప్పట్లోనే కాదు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ అనే చెప్పాలి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. 'ఆర్య 2' తర్వాత మళ్లీ బన్నీ - సుకుమార్ కాంబోలో పుష్ప ది రైజ్(Pushpa: The Rise) మూవీ తెరకెక్కింది. 2021 చివరలో వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే.
ఈ సినిమాతోనే బన్నీ పాన్ ఇండియా హీరోగా మారాడు. అంతేకాకుండా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా 'పుష్ప2' (Pushpa 2) తెరక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పార్ట్-1 పెద్ద సక్సెస్ అవడంతో 'పుష్ప 2'ని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. ఇండియా వైడ్ గా ఉన్న ప్రాంతీయ భాషలతో పాటు చైనా, రష్యా, జపాన్ వంటి దేశాల్లోనూ ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : అందమైన ఆలోచనలు కలిస్తే.. జ్యోతిక, మమ్ముట్టి సినిమాపై సూర్య ప్రశంసలు!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply