Manoj Bajpayee On Dance: మనోజ్ బాజ్‌పాయ్‌. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు. పాత్ర ఏదైనా 100 శాతం న్యాయం చేయడంలో ఆయనను మించిన వారు లేరు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా చాలా భాషల్లో ఆయన సినిమాలు చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ అయ్యారు. ఇతర భాషల్లోనూ నటిస్తున్నారు. వెండితెరపై ఆయన సీరియస్ గా కనిపించినా, తెర వెనుక మాత్రం అందరితో చాలా సరదాగా ఉంటారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనలోని కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో చూపించారు.


హృతిక్ డ్యాన్స్ చూసి నేను మానేశా- మనోజ్     


ఢిల్లీలో రీసెంట్ గా ఓ టీవీ ఛానెల్ ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు మనోజ్ చీఫ్ గెస్టుగా వెళ్లారు. ఈ సందర్భంగా సదరు మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తను నటించబోయే పాత్రలకు ఎలా రెడీ అవుతారో వివరించారు. పనిలో పనిగా తను డ్యాన్స్ ఎందుకు మానేయాల్సి వచ్చిందో వివరించారు.  కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో డ్యాన్స్ చేసినట్లు చెప్పిన ఆయన, ఓ బాలీవుడ్ హీరో డ్యాన్స్ చూసి వెంటనే మానేసినట్లు వివరించారు. “నిజానికి నేను కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో డ్యాన్సులు చేసే వాడిని. అప్పట్లో ‘కహో నా ప్యార్‌ హై’ సినిమా వచ్చింది. ఇందులో హృతిక్‌ రోషన్‌ డ్యాన్స్‌ చూసి ఫిదా అయ్యాను. అంతేకాదు, డ్యాన్స్ అంటే ఆయన లాగే చేయాలి అనుకున్నాను. ఆయనలా నేను చేయలేను కాబట్టి, అసలు చేయడమే మానేశాను. ఆ తర్వాత కొద్ది కాలానికి ఇండస్ట్రీలోకి టైగర్‌ ష్రాఫ్‌ అడుగు పెట్టాడు. అతడు కూడా డ్యాన్స్ అద్భుతంగా చేస్తారు. నేను చాలా సాధారణ వ్యక్తిని. వారి కాకుండా సాధారణంగా డ్యాన్స్ చేస్తాను” అని చెప్పుకొచ్చారు.  


క్యారెక్టర్ ఏదైనా బాగా కష్టపడుతా- మనోజ్


ఇక తనకు మంచి గుర్తింపు తెచ్చిన సినిమా క్యారెక్టర్ల గురించి కూడా ఆయన కీలక విషయాలు చెప్పారు. “‘సత్య’చిత్రంలోని భీకూ మాత్రే పాత్ర కోసం ఏకంగా 4 నెలల పాటు రెడీ అయినట్లు వెల్లడించారు.  ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపుర్‌’లోని సర్దార్‌ ఖాన్‌ క్యారెక్టర్ కోసం నేను, దర్శకుడు అనురాగ్ కశ్యప్ చాలా చర్చించుకున్నాం. చివరకు అనుకున్నట్లుగానే వచ్చింది. ప్రేక్షకులు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమా ఏదైనా గానీ, నేను మాత్రం సాధ్యమైనంత వరకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తాను” అని మనోజ్ వివరించారు.


ఇక మనోజ్ బాజ్‌పాయ్‌ తాజాగా ‘జోరమ్’ అనే సినిమా చేశారు. డిసెంబరు 8న విడుదల కానుంది. తెలుగులో ఆయన పలు సినిమాలు చేశారు ‘ప్రేమకథ’, ‘హ్యాపీ’, ‘వేదం’, ‘కొమరం పులి’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా మరింత క్రేజ్‌ సంపాదించుకున్నారు. తాజాగా ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2023లో ఆయన బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు.   


Read Also: వింటేజ్ ఫీల్‌తో ‘డెవిల్‘ సెకెండ్ సింగిల్- ‘థిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ ఎల్నాజ్ అందాల కనువిందు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply