Vijay Devarakonda  Instagram Followers: యంగ్ హీరో విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ట్రెండ్ అవుతున్నారు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రేమాయణం గురించి బాగా వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక కొంత కాలంగా విజయ్ ఇంట్లోనే ఉంటుందనే టాక్ నడుస్తోంది. విజయ్, రష్మిక పెట్టే ఫోటోలను నెటిజన్లు బూతద్దం వేసి మరీ వెతుకుతున్నారు. ఏదైనా కొత్త విషయం దొరకకపోదా అని ఆరా తీస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన విజయ్, ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా కూడా సంచనల విజయం సాధించడంతో ఆయన కెరీర్ మరింత స్వింగ్ లోకి వచ్చింది. ‘టాక్సీ వాలా’ ఫర్వాలేదు అనిపించినా, పూరి జగన్నాథ్ పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కించి ‘లైగర్’ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. విజయ్ కెరీర్ కే పెద్ద మచ్చగా మిగిలిపోయింది. తాజాగా ఆయన నటించి ‘ఖుషి’ సినిమా కూడా ప్రేక్షకులను అంతంత మాత్రంగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తున్నారు.


ఇన్ స్టా గ్రామ్ లో 20 మిలియన్ల ఫాలోవర్లు 


ఇక సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ క్రేజ్ రోజు రోజుకు మరింత పెరుగుతోంది. నిత్యం ఎంతో మంది ఆయన అభిమానులుగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆయను ఫాలో అవుతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో మరింత దూసుకెళ్తున్నాడు విజయ్. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ సంఖ్య 20 మిలియన్లకు చేరుకుంది. 2018 మార్చి 7న విజయ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించగా,  తాజాగా 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ అందుకున్నారు. టాలీవుడ్ లో అత్యధిక ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోల లిస్టులో విజయ్ చేరిపోయాడు. విజయ్ సరికొత్త ఫీట్ పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా విజయ్ కి ఉన్న క్రేజ్ కు ఈ ఫాలోవర్సే నిదర్శనం అంటున్నారు.   


వరుస సినిమాలతో విజయ్ ఫుల్ బిజీ


విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పరుశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  వీలైనంత త్వరగా ఈ సినిమాను కంప్లీట్ చేసి సంక్రాంతి బరిలో దించాలని భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఫ్యామిలీ స్టార్’ గ్లింప్స్ బాగా అలరించింది. ఇందులో విజయ్ ‘ఐరనే వంచాలా ఏంటి?’ అని చెప్పే డైలాగ్‌ బాగా ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాలో అందాల తార మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ స్పై థ్రిల్లర్ కూడా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆ సినిమా తర్వాత రవి కిరణ్ కోలాతో ఓ సినిమా చేయనున్నారు.  ఈ సినిమాకు 'యుద్ధం' అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.


Read Also: వింటేజ్ ఫీల్‌తో ‘డెవిల్‘ సెకెండ్ సింగిల్- ‘థిస్ ఇజ్ లేడీ రోజీ’ అంటూ ఎల్నాజ్ అందాల కనువిందు


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply