Prema entha madhuram October 17th: జలంధర్, సుగుణ ప్రాణాలు తీయడానికి అని దిండుతో తన మొఖాన్ని కప్పి ఊపిరాడకుండా చంపేద్దామని ప్లాన్ వేస్తాడు. 


కానీ అష్టమి కావడంతో అనులోకి ఏదో తెలియని శక్తి ఆవహిస్తుంది. పక్కనే ఉన్న డాక్టర్ కోట్ ని మాస్క్ ని పెట్టుకొని జలంధర్ ఉన్న గదిలోకి వెళ్లి తన మెడ పట్టుకొని గాల్లోకి లేపుతుంది అను. వెంటనే జలంధర్ భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతాడు. ఇంతలో ఉష అక్కడికి వస్తుంది.


ఉష: అమ్మకి నయం అవ్వాలని ఇప్పుడే గుడికి వెళ్లి మొక్కుకున్నాను అని గుడి నుంచి తెచ్చిన కుంకుమని అనుకి పెట్టగా అను తిరిగి మామూలు స్థితికి వస్తుంది. అప్పుడే సుగుణ స్పృహలోకి వస్తుంది.


ఉష: అమ్మ ఎలా ఉన్నావ్ అమ్మ? డాక్టర్స్ నీకేం ప్రమాదం లేదని చెప్పారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని సుగుణకి ధైర్యం చెబుతుంది.


సుగుణ: నేను బాగున్నానంటే దానికి కారణం నన్ను కాపాడిన ఈ అమ్మే మీకు రుణపడి ఉంటాను అమ్మా.


అను: అంత పెద్ద మాటలు వద్దు అంటీ మీకు నయమైతే ఇంట్లో మీ బాధ్యతలు అన్నీ తీసుకోవడానికి మీ కొడుకు హైదరాబాద్ వచ్చేసాడట అని అనగా ఆ మాటలకు సుగుణ ఎంతో ఆనందపడుతుంది.


ఉష: అవునమ్మా అన్నయ్య ఫోన్ చేశాడు నీ గురించి చెప్తే చాలా బాధపడ్డాడు. రాత్రికి ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాడు. ఏదో గవర్నమెంట్ పనున్నదని గవర్నమెంట్ వాళ్ళు అన్నయ్యని ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారట.


సుగుణ: పోనీలే అమ్మ మంచి మాట చెప్పావు.


అను: నేను ఇంక వెళ్ళొస్తాను అంటీ ఇంట్లో పిల్లలు నాకోసం ఎదురు చూస్తున్నారు. రాత్రి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను.


సుగుణ: సరేనమ్మా ఇంతకీ అడగడం మర్చిపోయాను నీ పేరేంటి?


అను: రాధ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత సుగుణ మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా వచ్చి సుగుణ కోలుకోవడానికి చూసి ఆనందపడతారు. తర్వాత డాక్టర్ సుగుణకి డిశ్చార్జ్ ఇచ్చేస్తారు.


తర్వాత సూర్య వాళ్ళందరూ వర్క్ ప్లేస్ కి వెళ్తారు. అక్కడ మినిస్టర్ తో పాటు ఆర్య కూడా అప్పుడే వస్తాడు.


మినిస్టర్: మనం మంచి పని చేయబోతున్నందుకు నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. దానికి మీరు చేయి కలపడం అంటే అది నా ప్లెజర్ అని ఆర్యతో అంటాడు.


ఆర్య: నాదేమున్నది వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఇప్పటికే చేయని తప్పుకి చాలా సంవత్సరాలు శిక్ష అనుభవించారు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకం ఇవ్వడమే మన ఉద్దేశం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ లోపల మీటింగ్ కి పిలుస్తాడు ఆర్య.


ఆర్య: నాకు తెలుసు మీరందరూ చేయని తప్పులుకి జైలుకు వెళ్లి వచ్చినవారు. కానీ ఇప్పుడు మీ జీవితాలలో అసలు మొదలవుతాయి. ఈ ఆఫర్ లెటర్ మీ భవిష్యత్తుకు తొలిమెట్టు.


సూర్య: థాంక్యూ సర్ థాంక్యూ వెరీమచ్. చిన్నప్పుడే మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు సార్ మా అమ్మే నన్ను, మా ముగ్గురు చెల్లెల్ని చూస్తూ వచ్చింది. వాళ్ల కోసం నేను సహాయం చేద్దామని అక్కడికి వెళ్లి ఎవరో చేసిన తప్పుకి శిక్ష అనుభవించాను సార్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలో అర్థం కాలేదు కానీ ఇప్పుడు ఈ ఉద్యోగం ఉండడం వల్ల నేను వాళ్ళని జాగ్రత్తగా చూసుకోగలరు సర్. నేను వాళ్ళని పోషించగలను
 అని ఎమోషనల్ అవుతాడు. అప్పుడు సూర్యతో పాటు మిగిలిన వాళ్లు కూడా ఆర్యకి కృతజ్ఞతలు చెప్తారు.


ఆ తర్వాత సీన్లో సుగుణ ఇంట్లో వంట వండుతూ ఉంటుంది. ఇంతలో ఉష అక్కడికి వస్తుంది.


ఉష: నీకు ఒంట్లో బాలేదు కదమ్మా చెప్తే నేను చేస్తాను కదా ఎందుకు నువ్వు కష్టపడడం?


సుగుణ: 20 ఏళ్ల తర్వాత మీ అన్నయ్య ఈరోజు ఇంటికి వస్తున్నాడు వాడికి నా చేతి భోజనం అంటే మహా ప్రాణం అందుకే చేస్తున్నాను.


జ్యోతి: నీకు కంటి ముందు ఉన్న వాళ్ళు కనిపించరు కాని ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన వాడు మాత్రం కనిపిస్తాడు. నీకోసం చెల్లి చదువు మానేసి సేల్స్ గాల్ లా పని చేస్తుంది. భారం తీరిపోతుంది కదా అని నన్ను దారిన పోయే వాడికి కట్టపెట్టావు వాడు కట్నం ఇవ్వకపోతే ఇంటికి తీసుకెళ్ళను అని చెప్పి పుట్టింట్లో వదిలేసాడు.


దివ్య: బాధ్యతలని తీసుకోవాల్సిన వాడు 20 ఏళ్ల ముద్దు అందరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తిరిగి వస్తే వాడికోసం నువ్వు ఆనందపడిపోతున్నావు చీ!! అని కోప్పడుతుంది. 


కానీ సుగుణ మాత్రం పట్టించుకోకుండా తన వంట తాను చేసుకుంటుంది.


ఉష: బాధపడుద్దమ్మా అన్నయ్య వచ్చేంత వరకే ఈ గొడవలు. అన్నయ్య వచ్చిన తర్వాత అక్కళ్ళిద్దరూ మారుతారులే అని సుగుణకి ధైర్యం చెబుతుంది ఉష.


మరోవైపు ఆర్య ఆఫీస్ లో ఆఫర్ లెటర్స్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు.


జెండే: మినిస్టర్ గారు, ఇంక మీరు ఆఫర్ లెటర్స్ ఇవ్వండి


మినిస్టర్: వద్దు ఇందులో నా ప్రమేయం ఏం లేదు. చేసినదంతా ఆర్య వర్ధన్ గారే ఆయన చేత ఇప్పించండి అని అనగా ఆర్య ఒక్కొక్కరికి ఆఫర్ లెటర్స్ ఇస్తూ ఉంటాడు.


మరోవైపు సూర్యని చంపడానికి వచ్చిన కిల్లర్ సూర్య మీద గురి పెడుతూ షూటింగ్ కి రెడీ అవుతాడు.


ఆర్య: మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేశాము భోజనం చేయండి అని అందరికీ చెప్పాడు


మినిస్టర్: ఇంక నేను వెళ్ళొస్తాను సార్. వీళ్ళందర్నీ చూసి నా కడుపు నిండిపోయింది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు.


ఆ షూటర్ సూర్య వైపే గురు చూపుతూ ఉంటాడు.


Join Us On Telegram: https://t.me/abpdesamofficial