Prema entha madhuram October 16th: ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే...
ఆర్య: కొన్ని సంవత్సరాలు తర్వాత జైలు నుంచి విడుదలై చాలా ఆశలతో ఇక్కడికి వస్తున్నారు. ఈ ఆఫర్ లెటర్స్ వాళ్ల ఆశలకు తొలిమెట్టు. మనం ఇప్పుడే వెళ్లాలి.
జెండే: నీ బాధలని దాటి.. వాళ్ల సుఖం కోసం ఆలోచిస్తున్నావంటే నువ్వు గ్రేట్ ఆర్య.
అక్కి: నీ వర్క్ అయిపోయిందా ఫ్రెండ్ ఇంక మేము ఇంటికి వెళ్తాము. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది.
నీరజ్: నేను డ్రాప్ చేస్తాను లే అక్కి.
అక్కి: మాకు ఫ్రెండే డ్రాప్ చేయాలి..
అంజలి: సార్ కి పనుంది కదా. నేను డ్రాప్ చేస్తాను లేండి. మీకు దారిలో చాక్లెట్స్, కేక్స్ అన్ని కొంటాను ఓకేనా అని అనగా అభయ్, అక్కిలిద్దరూ సరే అని చెప్తారు.
మరొకవైపు జలంధర్ కారులో వెళ్తూ ఆ రౌడీతో మాట్లాడుతాడు.
జలంధర్: సుగుణ పని ఎంతవరకు వచ్చింది?
రౌడీ: ఆల్మోస్ట్ చచ్చిపోయింది అనుకున్న టైంలో అక్కడే గుడి దగ్గర ఉన్న ఒక అమ్మాయి వచ్చి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళింది సర్ అని హాస్పిటల్ పేరు చెప్తాడు.
జలంధర్: జనాలు ఉన్న దగ్గర హత్యాయత్నం చేయడం ఏంట్రా ఫూల్. నేను వచ్చి నా చేతులారా తనని చంపుతాను అని హాస్పిటల్‌కి బయలుదేరుతాడు జలంధర్.
మరోవైపు సుగుణ కూతుళ్లు ముగ్గురు ఆటో దిగి సుగుణ దగ్గరకు వస్తారు. ముగ్గురు వెళ్లి సుగుణను చూస్తూ బాధపడుతూ ఉంటారు.
జ్యోతి: అప్పటికి చెప్తూనే ఉన్నాను ఎందుకు ఈ గుడులు, గోపురాలు తిరుగుకుంటూ పూజలు చేయడం అవసరమా ఈ వయసులో అని. చెప్తే వింటేనే కదా.
దివ్య: కొడుకు మీదే ఆన్ని అసలు పెట్టుకుంది. వాడా జైలు నుంచి వచ్చిన వాడు. అని అనుకుంటూ ఉండగా అక్కడ వాళ్లకు అను కనిపిస్తుంది.
ఉష: మీరేనా రాధ? మాకు ఫోన్ చేసింది మీరే కదా?
అను: అవును నేనే ఫోన్ చేశాను. సరైన సమయంలో ఆంటీ హాస్పిటల్లో చేరారు కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు.
ఉష: చాలా థాంక్స్ అండి కరెక్ట్ టైమ్‌లో దేవతలా వచ్చి ఆదుకున్నారు.
అను: పర్వాలేదు లేండి. నేను ఒక కాల్ చేసుకుని వస్తాను అని చెప్పి పక్కకు వెళుతుంది. తన పక్కింటి ఆవిడతో రావడానికి లేట్ అవుతుంది పిల్లల్ని చూసుకోమని చెప్తుంది.
ఉష: అసలు అమ్మ ఇన్ని కష్టాలు దాటుకొని ఎలా ఉంటుందో. అన్నయ్య త్వరగా వచ్చేస్తాడు అని ఆనందపడుతూ గుడికి వెళ్ళింది పాపం ఇలా జరిగింది.
జ్యోతి: వాడి గురించి తెగ సందడి పడిపోతూ వెళ్ళింది ఇప్పుడు ఆఖరికి ఇలా జరిగింది. ఎంత జరిగినా బిల్లు కట్టాల్సింది నేనే కదా. నర్స్ బిల్ ఎంత? అని పక్కనున్న నర్స్ ని అడుగుతుంది.
నర్స్: హాస్పిటల్లో జాయిన్ చేసిన ఆవిడ కట్టింది మీరేం కట్టనవసరం లేదు. ఈ మందులు తెండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నర్స్.
ఇంతలో జలంధర్ హాస్పిటల్లోకి వస్తాడు. సుగుణ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో సూర్య ఉషకి ఫోన్ చేస్తాడు.
సూర్య: నేనమ్మ ఉష, అన్నయ్యని. ఎలా ఉన్నావు?
ఉష: నేను బాగున్నాను అన్నయ్య. ఎన్ని రోజులైంది నిన్ను కలిసి హైదరాబాద్‌కి వచ్చేసావా? ఇంటికి ఎప్పుడు వస్తావు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము అమ్మ నీ కోసం ఎన్ని కలలు కంటూ ఉందో.
సూర్య: చిన్న పని ఉండి గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఒక చోటికి తీసుకెళ్తున్నారు. అది అయిపోయిన వెంటనే వచ్చేస్తాను ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వు.. అమ్మతో మాట్లాడాలని ఉంది.
ఉష: లేదన్నయ్య గుడికి వెళుతున్న అమ్మకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో ఉన్నాము భయపడాల్సిన అవసరం లేదు లే.
సూర్య: అమ్మ జాగ్రత్త ఉష. రాత్రికి నేను వచ్చేస్తాను లే. జ్యోతి,దివ్యలు ఎలాగున్నారు? వాళ్ళు పక్కనే ఉంటే ఒకసారి ఇవ్వా అని అంటాడు. ఉష వాళ్లకి ఫోన్ ఇవ్వబోతుండగా వాళ్ళిద్దరూ ఉష వైపు కోపంగా చూస్తారు.
ఉష: వాళ్లు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టున్నారు అన్నయ్య. తర్వాత ఫోన్ చేపిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఉష. తర్వాత టాబ్లెట్స్ కోసమని జ్యోతి, దివ్యలు అక్కడ నుంచి వెళ్లిపోతారు.
ఉష: ఏమీ సమస్య లేదట కొంచెం బ్లడ్ పోయింది అంతే. థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ మీరే లేకపోతే అమ్మకి ఏమయ్యేదో..
అను: ఏం పర్వాలేదు. కానీ ఆక్సిడెంట్ చేసిన వెహికల్ నెంబర్ చూడలేదు, లేకపోతే కంప్లైంట్ ఇచ్చేదాన్ని..
ఉష: కావాలని చేసిన వాళ్ళు వెహికల్ నెంబర్ని ఎందుకు ఉంచుతారు అని చెప్పి ఆ పొలం గురించి గొడవ అంతా అనుకి చెప్తుంది ఉష.
అను: పరవాలేదులే మీ అన్నయ్య వచ్చేస్తాడు కదా అన్నీ చూసుకుంటాడు అని ఉషకి ధైర్యం చెప్తుంది అను.
అదే సమయంలో జలంధర్ అటువైపు రావడాన్ని అను చూస్తుంది.
అను: జలంధర్ ఏంటి ఇక్కడున్నాడు? నన్ను ఫాలో అవుతూ ఇక్కడ వరకు వచ్చేసాడా? అని మనసులో అనుకుంటుంది.
ఇంతలో జలంధర్ సుగుణ ఉన్న రూమ్‌లోకి వెళ్తాడు.
జలంధర్: నేను బుద్ధిగా పొలం నాకు ఇవ్వమని చెప్పాను అయినా సరే వినకుండా ఇక్కడ వరకు తెచ్చుకున్నావు. ఇంక నీ ప్రాణాలు నా చేతిలోనే పోతాయి అని వెనకనే ఉన్న దిండును తీసుకొని సుగుణ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు జలంధర్.
ఇంతలో ఆ హాస్పిటల్లో ఉన్న ఇద్దరూ ఆడవాళ్లు అష్టమి కదా ఆపరేషన్ చేయడం ఈరోజు మంచిది కాదు.. రేపు చేద్దాము అష్టమి రోజు మంచి జరగదు అని అనుకుంటారు. అదే సమయంలో అను ఒంట్లోకి ఏదో శక్తి వెళ్తుంది.
వెంటనే అను గదిలోకి వచ్చి జలంధర్ మెడని గట్టిగా పట్టుకుని కోపంగా చూస్తుంది. ఊపిరాడక జలంధర్ అల్లడిల్లిపోతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Join Us On Telegram: https://t.me/abpdesamofficial