Prema Entha Madhuram November 29th Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఉష అనుని చూసి ఎందుకు ఇలా కంగారుపడుతుందో కనుక్కోవాలని ప్రయత్నిస్తుంది.


ఉష: మా అన్నయ్యని చూసినప్పుడల్లా మీరు కంగారు పడిపోతున్నారు. నేను ఈ ఒక్కసారి కాదు చాలా సార్లు గమనించాను. పరాయి స్త్రీల మీద తప్పుగా ప్రవర్తించే వాడు కూడా కాదు మా అన్నయ్య మరి ఎందుకు మీరు అలా ప్రవర్తిస్తున్నారు?


అను: అలా ఏమీ లేదు తెలియని వాళ్లు కనిపిస్తే నాకు ఆటోమేటిక్ గా పానిక్ వచ్చేస్తాది. అందుకే అలా అయ్యాను కానీ అంతకుమించి ఏమీ లేదు. ఇంక నాకు పని ఉంది నేను వెంటనే వచ్చేస్తాను అని మంచం మీద ఉన్న బట్టలను కబోర్డ్ లో పెడుతూ ఉండగా అను ఫోటో కింద పడిపోతుంది. చూసుకోకుండా కంగారులో అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


ఉష: ఎందుకు రాధ గారు అన్నయ్య పేరు ఎత్తిన వెంటనే ఇంత టెన్షన్ పడుతున్నారు? అంటే ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలి అని ఆ కింద పడిపోయిన ఫోటోను తీసి, ఈ ఫోటోని అన్నయ్యకి చూపిద్దాము. అన్నయ్య రియాక్షన్ బట్టి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాము అని అనుకుంటుంది.


ఆ తర్వాత సీన్లో చట్నీలని ఆటోలో పెట్టి ఆర్య ఆటో ఎక్కబోతుండగా ఉష అక్కడికి వస్తుంది.


ఉష: అన్నయ్య నేను కూడా నీతో వస్తాను. అక్కడి నుంచి మనం గుడికి వెళ్దాము.


సుగుణ: ఇంట్లో పని తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకాలు ఇవి. అన్నయ్యను ఇబ్బంది పెట్టకు బుద్ధిగా ఉండు.


ఉష: సరే చూద్దాంలే అమ్మ అని చెప్పి పర్స్ లో అను ఫోటో పెట్టి ఆర్యతో పాటు ఆటో ఎక్కుతుంది ఉష.


ఆర్య: ఈ గుడి ప్లాన్ ఎందుకు పెట్టావమ్మ?


ఉష: ఊరికినే అన్నయ్య. ఇంతకీ నువ్వు మ్యాగ్జిన్ లో కథ ఎప్పుడు రాస్తావు. వాళ్లు ఫోన్ చేశారు నీ కథ అందరికీ నచ్చిందట. ఎక్కువ ప్రింట్లు కూడా తీపిస్తున్నారట


మణి: ఏ కథ రాసారు బిజినెస్ టిప్స్ గురించి రాశారా?


ఉష: బిజినెస్ గురించి అన్నయ్యకి ఏం తెలుస్తుంది. లవ్ స్టోరీ రాశాడు.


ఆర్య: మణి నువ్వు ముందు రోడ్డు వైపు చూసి నడుపు అని ఆ సంభాషన్ని అక్కడితో ఆపేస్తాడు ఆర్య.


ఆ తర్వాత సీన్లో జలంధర్, మాన్సి, ఛాయాదేవిలు హాల్లో కూర్చుని ఉంటారు.


ఛాయాదేవి: ఆ కాంట్రాక్టర్ ని ఇంకొంచెం టైం అడుగుతుంటే ఇవ్వడం లేదు అని బాధపడుతూ ఉండగా అప్పుడే అను అక్కడికి నవ్వుకుంటూ వస్తుంది.


ఛాయాదేవి: ఏ ఎందుకు నవ్వుతున్నావ్? అయినా ఈ ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం?


అను: ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది కదా అది చూపించడానికి వచ్చాను. మీరు తీసుకున్న గోతిలో ఎప్పుడూ మీరే పడతారు. లేకపోతే మాటిమాటికి నా పిల్లలు జోలికి వచ్చి భయపెడదామని చూస్తున్నారు. అందుకే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చా


మాన్సి: నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చేదేంటే?


అను: ముందు నీకే చెప్తున్నాను వీళ్ళతో కలిసి సహవాసం చేస్తున్నావు. ఇంకొన్ని రోజుల్లో, మీ ఇంట్లో కొంచెం నాకు స్థానం ఇవ్వండి, ఒక ముద్ద ఇవ్వండి చాలు తినడానికి అని మళ్లీ వర్ధన్ కుటుంబం దగ్గరికి అడుక్కోవడానికి వస్తావు.


మాన్సి: ఇదే, ఇదే నీలో నాకు నచ్చనిది. అందుకే నీ శత్రువులతో చేతులు కలిపి నీ అంతు చూడడానికి చూస్తున్నాను


అను: నా జోలికి, నా పిల్లల జోలికి వస్తే అక్కడ ఎదురుగా నిలబడడానికి ఆర్య సార్ ఉన్నారు, వర్ధన్ కుటుంబం ఉంది. వాళ్ల దెబ్బ పవర్ ఏంటో ఆల్రెడీ తిన్న ఈ జలంధర్ కి తెలుసు వెళ్లి వాడిని అడగండి అని అనగా జలంధర్ ఒకేసారి కోపంతో రగిలిపోయి పాకెట్ లో నుంచి గన్ ని బయటకు తీస్తాడు.


జలంధర్: నీకు అసలు భయమే లేదా ఇప్పుడు చూడు భయపడతావు అని చెప్పి గన్ ని అను నుదిటిన పెడతాడు. కానీ అను మాత్రం ఏ మాత్రం భయపడకుండా నవ్వుతూ ఉంటుంది.


వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తారు.


అను: వీళ్ళు ఎవరో అనుకుంటున్నావా? షీ టీం నేనే పిలిచాను అని జలంధర్ తో చెప్తుంది.


అను: మేడం ఆ ఫోన్ రికార్డింగ్ చూపించాను కదా ఇప్పుడు మీకు ప్రత్యక్ష సాక్ష్యం కూడా దొరికింది. వీళ్ల వల్ల నాకు ప్రమాదం ఉంది. యాక్షన్ తీసుకోండి.


షీ టీం: మా కళ్ళ ముందే ఒక అమ్మాయి మీద గన్ చూపిస్తావా? ఆ కాల్ రికార్డింగ్ అంతా విన్నాము. ఇక్కడ కాదు నీ సంగతి లాకప్ లో చూస్తాను అని చెప్పి జలంధర్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. ఛాయాదేవి వాళ్ళని ఆపాలని చూసినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు పోలీసులు.


అను: మన సొంతవాళ్లు మన ముందు వెళ్లిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలిసింది కదా. ఇంక ఎప్పుడు నా జోలికి కానీ నా పిల్లలు జోలికి కానీ రావద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


ఛాయాదేవి: నాకు ఉన్నది కేవలం నా అన్నయ్య మాత్రమే వాడిని కూడా నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయింది.. నీ సంగతి చూస్తా అను అని కోపంతో ఏడుస్తూ ఉంటుంది ఛాయాదేవి.


ఆ తర్వాత సీన్లో ఆర్య, ఉషలిద్దరూ గుడికి వస్తారు.


ఉష: గుడి లోపలికి రా అన్నయ్య


ఆర్య: వద్దమ్మా దేవుడు నేను ఏం అడిగినా ఇవ్వడు అని తెలిసినప్పుడు అడగడం ఎందుకు? నువ్వు వెళ్ళు


ఉష: అడగాలి అన్నయ్య దేవుడు చేసేంతవరకు విసిగిస్తూనే ఉండాలి. ఏమైనా కోరుకో. నేను లోపల దండం పెట్టుకుంటాను అని గుడి లోపలికి వెళ్ళిపోతుంది.


ఆర్య: నేను అనుని నా దగ్గరికి చేర్చమన్నాను అది ఎలాగా చేయడం లేదు. కనీసం అనుని, పిల్లలని క్షేమంగా చూడు అని మనసులో కోరుకుంటాడు. తర్వాత గుడి దగ్గర కూర్చుంటాడు ఆర్య. ఇంతలో ఉష అక్కడికి వస్తుంది.


ఉష: దేవుణ్ణి ఏమని కోరుకున్నావు అన్నయ్య అందమైన భార్య రావాలని కోరుకున్నావా? ఒక అమ్మాయి ఫోటో ఉంది చూపించినా అని అనగా ఆర్య ముఖం పక్కకు తిప్పేస్తాడు. అదే టైంలో అను ఫోటోని ఉష ఆర్య కి చూపిస్తుంది. అది చూసిన ఆర్య కళ్ళల్లో ఒకేసారి మెరుపు రావడం ఉష గమనిస్తుంది.


ఆర్య: ఈ ఫోటో నీకు ఎక్కడిది? ఈ అమ్మాయి ఫోటో నీకు ఎవరు ఇచ్చారు? నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా?అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు.


ఉష: ఏంటి అన్నయ్య ఇన్ని క్వషన్స్ అడుగుతున్నాడు? ఇప్పుడు నిజం చెప్తే లేనిపోని సమస్యల్లో పడతానేమో ఎందుకైనా మంచిది నిజం దాచేద్దాము అని మనసులో అనుకొని, ఇందాక గుడిలో ప్రదక్షణాలు చేస్తుంటే దొరికింది అన్నయ్య. నిన్ను టీజ్ చేద్దాము అని చూపించాను అంతే. అవును ఇంతకీ అంతలా అడుగుతున్నావ్ కదా ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా?


ఆర్య: లేదు ఊరికినే అడిగాను అని కవర్ చేస్తూ చెబుతాడు ఆర్య. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply