Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో పూజలో కూర్చోవాలి అనుకుంటున్న పిల్లలకి ఒకవైపు తల్లి మరొకవైపు తండ్రి మరొకవైపు యాదగిరి కనిపించడంతో వాళ్లకి కనిపించకుండా వేరే గదిలోకి వెళ్లి దాక్కుంటారు. అక్కడికి వెతకటానికి అను వెళ్తుంది కానీ ఆమెకి కనిపించకుండా దాక్కుంటారు పిల్లలిద్దరూ.


ఆర్య : ఆ తర్వాత ఆర్య కూడా అక్కడికి వచ్చి పూజారి గారిని ఇద్దరు పిల్లలు మాల వేసుకుని ఉంటారు వాళ్ళు ఇటువైపుగా వచ్చారా అని అడుగుతాడు. పూజారి లేరు అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


పూజారి వెళ్ళిపోతూ పిల్లలు లోపల ఉన్నది చూసుకోకుండా బయట తాళం వేసుకొని వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోదాం అనుకున్న పిల్లలకి తలుపు రాకపోవడంతో బయట గడియ పెట్టారు అని అర్థం చేసుకుంటారు.


అక్కి : మనం రాత్రంతా గుడిలో ఉండిపోవాల్సిందేనా, ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు  నాకు చాలా భయంగా ఉంది అని ఏడుస్తుంది.


అభయ్: మనకి ఏ తోడుగా ఆ భగవంతుడు ఉన్నాడు అని చెల్లెలిని ఓదారుస్తాడు.


అక్కి : నాకు ఆకలిగా ఉంది అంటుంది.


అభయ్ : చుట్టూ చూసి మనకోసం దేవుడు ఫుడ్ కూడా ఉంచాడు అని చెప్పి ప్రసాదం తీసుకువచ్చి చెల్లెలికి ఇస్తాడు. ప్రసాదం తిన్న అక్కి అన్న ఒడిలోనే నిద్రపోతుంది.


పొద్దున్నే వచ్చిన పూజారి గారు తలుపు తెరుచుకొని గుడి లోపలికి వెళ్తారు  అతనికి కనిపించకుండా గుడి బయటికి వచ్చేస్తారుపిల్లలిద్దరూ.


అభయ్ : మనం ఇక్కడే ఉంటే అమ్మ నాన్న వాళ్ళకి దొరికిపోతాం అందుకే మనం వేరే ఊరు వెళ్లి పోదాం అంటాడు.


అక్కి: మన దగ్గర డబ్బులు లేవు కదా ఎలా వెళ్తాం.


అభయ్: ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్దాం అని అక్కడ నుంచి బయలుదేరబోతుంటే సుబ్బు ఎదురవుతాడు ఒకరిని ఒకరు చూసుకుని షాక్ అవుతారు.


సుబ్బు: ఇక్కడ మీరేం చేస్తున్నారు, రాత్రి ఎక్కడికి వెళ్లారు, మిమ్మల్ని వెతుక్కుంటూ ఉష వచ్చింది అంటాడు.


అక్కి : రాత్రి గుడిలో పూజకి వెళ్ళాము తర్వాత ఉష తో ఇంటికి వెళ్ళిపోయాము అని అబద్ధం చెప్తుంది.


అభయ్ :  ఇప్పుడు కూడా పూజ చేసుకోవటానికి ఫ్రెండ్ కారులో వచ్చాము మళ్ళీ ఫ్రెండ్ కారులో వెళ్లిపోతాము అంటారు.


సుబ్బు: కాసేపు ఆగండి పూజ అయిపోతే నేను మిమ్మల్ని ఆటోలో ఇంటిదగ్గర దిగబెడతాను అంటాడు.


పిల్లలు: వద్దు మాకు స్కూలుకు టైం అయిపోతుంది మేము వెళ్తాము అంటారు.


సుబ్బు: సరే సాయంత్రం చూసిన తర్వాత ఇంటికి రండి మీ అమ్మమ్మ మీకోసం కంగారుపడుతుంది అని చెప్తాడు సరే అని ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు పిల్లలు.


ఆ తర్వాత వాళ్లనే వెతుకుతున్న అను కనిపిస్తుంది. తనకి కనిపించకుండా దాక్కుంటారు పిల్లలు. అదే సమయంలో యాదగిరి అక్కడికి వస్తాడు.


యాదగిరి : మీరేంటమ్మా ఇక్కడ అని అను అని అడుగుతాడు.


అను : మన వీధిలో ఉండే వాళ్లు రాత్రి పిల్లల్ని ఇక్కడ చూసినట్లు చెప్పారు అందుకే వచ్చాను అంటుంది.


యాదగిరి: రాత్రి నేను సార్ ఈ పరిసరాలు అన్ని వెతికాం ఎక్కడా కనిపించలేదు అని అనుకి చెప్తాడు. ఇంతలో ఆర్య కనిపించడంతో సార్ వస్తున్నారు మీరు వెళ్ళండి అని చెప్పడంతో అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


యాదగిరి: ఆర్యతో పిల్లలు గుడి పరిసరాల్లో ఉన్నట్లు తెలిసింది కానీ ఎక్కడ ఉన్నారో తెలియటం లేదు అంటాడు.


ఆర్య : అంటే రాత్రి పిల్లలు మనకి కనబడకూడదని దాక్కున్నట్లు ఉన్నారు అంటాడు.


యాదగిరి: రాత్రంతా పిల్లల్ని వెతుకుతూనే ఉన్నారు ఇంటికి వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి అంటాడు.


ఏదైనా పిల్లలు దొరికిన తర్వాతే అంటాడు ఆర్య.


ఒకవైపు జలంధర్ పెట్టిన మనుషులు పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో  పిల్లలు తమకోసం వెతుకుతున్న అనుని ఆర్యని చూసి వాళ్లకి ఎక్కడ దొరికిపోతామని భయపడతారు. అక్కడే ఉన్నా రౌడీల కారు చూసి మనం అందులో దాక్కుందాము ఆ కారు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్లి పోదాము అని ఎవరికి కనిపించకుండా వెళ్లి ఆ కారు డిక్కీలో  దాక్కుంటారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.