Prema Entha Madhuram Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో తండ్రికి ఫోన్ చేసిన పిల్లలు ఎప్పుడు వస్తున్నారు మిమ్మల్ని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా చూడాలని ఆశగా ఉంది అంటారు.


ఆర్య : వచ్చేస్తున్నాము, అమ్మవాళ్ళు బయలుదేరిపోయారు అంటాడు. పిల్లలు ఫోన్ పెట్టేసిన తర్వాత జెండే కి ఫోన్ చేస్తాడు ఆర్య. స్కెచ్ ఇంతవరకు వచ్చింది అని అడుగుతాడు.


జెండే : ఫైనల్ స్టేజ్ లో ఉంది, కెనడి ఆ పని మీదే ఉన్నాడు అని చెప్తాడు.


ఆర్య : డాక్టర్ దగ్గరికి వెళ్లి డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకున్నావా అని అడుగుతాడు.


జెండే : లేదు, వెళ్తున్నాను, నువ్వేమీ కంగారు పడకు అంటాడు జెండే.


ఆర్య : నాది కంగారు కాదు భయం. పొరపాటున ఈ పెళ్లి జరిగిందంటే నేను దోషిగా నిలబడాల్సి వస్తుంది అంటాడు.


జెండే : అలా ఏం జరగదు అన్ని నువ్వు అనుకున్నట్లు జరుగుతాయి కానీ మరొక విషయం ఏమిటంటే మినిస్టర్ ఫోన్ చేశారు నిన్ను మీట్ అవ్వాలంట అంటాడు.


ఆర్య : ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు వేరే దేని మీద కాన్సెంట్రేట్ చేయలేను, అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.


తర్వాత దివ్య, అను ఇద్దరూ కారు ఎక్కుతారు. అను శారీ కారు డోర్ లో ఇరుక్కుపోతే ఆర్య వచ్చి శారీ తీసి లోపల పెడతాడు. ఏం కేరింగన్నయ్య అంటూ ఉషా నవ్వుతుంది. కానీ ఆర్య అల్లరి చాలు అన్నట్టు బయలుదేరమంటాడు.


మరోవైపు పిల్లలు పెళ్లి లో మినిస్టర్ కి మర్యాదలు చేస్తూ ఉంటారు. మరోవైపు జలంధర్ వాళ్ళు పెళ్లి ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తారు.


ఛాయాదేవి : సూర్య డెడ్ బాడీని వాళ్ల ముందు పెడితే ఆర్య బండారం బయటపడుతుంది అంటుంది.


జలంధర్: లేదు వాళ్లకి ఆర్యతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ఆర్యా అయినా, సూర్య అయినా నువ్వేనా కొడుకువి అంటూ కాంప్రమైజ్ అయిపోతారు. పెళ్లి ఆపాలంటే ఈ రోజు సరిపోదు అంటూ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చెప్తాడు.


మరోవైపు హరీష్ కూడా ఎలా అయినా ఆర్య వాళ్ల పెళ్లి ఆపాలి అనుకుంటూ ఆర్య దగ్గరికి వెళ్లి బావగారు పదండి టైం అవుతుంది అనడంతో వాళ్ళిద్దరూ కూడా మండపానికి బయలుదేరుతారు.


మండపానికి వచ్చిన ఇద్దరు పెళ్ళికొడుకులు, ఇద్దరు పెళ్లికూతురులకి సుగుణమ్మ హారతి ఇచ్చి ఆహ్వానిస్తుంది.


సుగుణ: మిమ్మల్ని ఆశీర్వదించడానికి మినిస్టర్ గారు వచ్చారు ఒకసారి కనిపించి వెళ్లిపోండి అనడంతో రెండు జంటలు మినిస్టర్ గారి దగ్గరికి వస్తారు.


మినిస్టర్ : ఆశ్చర్యంతో ఆర్య సార్ అని పిలుస్తాడు. ఆర్య కనుసైగ చేయడంతో అర్థం చేసుకొని ఆర్య సర్ లా కనిపించారు అందుకే అలా పిలిచాను అంటాడు.


సుగుణ : మినిస్టర్ గారి దగ్గర మీ నాన్నగారు చాలా సంవత్సరాలు పనిచేశారు ఆ అభిమానంతోనే మిమ్మల్ని దీవించడానికి వచ్చారు అంటుంది.


తర్వాత ఆర్య వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మినిస్టర్ పిఏ ఆయన ఆర్య గారే కదా సార్ అని మినిస్టర్ తో చెప్తాడు.


మినిస్టర్: అవును, ఆయన ఆర్యనే ఇలా చేస్తున్నారంటే ఏదో కారణం ఉండి ఉంటుంది తెలుసుకోవాలి. పార్టీ ఆఫీస్ కి లేటుగా వస్తానని ఫోన్ చెయ్యు అంటాడు.


మరోవైపు దిగులుగా కూర్చున్న అను దగ్గరికి పిల్లలు ఇద్దరు వస్తారు. పెళ్లికూతురులా ఎంతో అందంగా ఉన్నావు అంటూ ఆనందపడతారు. ముభావంగా ఉన్న తల్లితో మమ్మల్ని క్షమించమ్మ,మా మొండితనం వల్లే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు. కానీ మమ్మల్ని నమ్ము ఈ పెళ్లి జరిగితే అందరం ఆనందంగా ఉంటాము అని చెప్తారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.


Also Read: హనుమాన్ 17డేస్ కలెక్షన్స్‌: ఆ విషయంలో ‘RRR’ని దాటేసిన 'హనుమాన్‌'