Prema Entha Madhuram Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో జలంధర్ వాళ్ళు మాట్లాడుకోవటం విన్న పిల్లలు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిది లేదంటే ఫినిష్ అయిపోతాం అనుకుంటూ అక్కడ నుంచి పారిపోతారు.
జలంధర్: రౌడీలు చెప్పింది విని మీరు ఎందుకూ పనికిరారు, పని అవ్వాలంటే నేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగాలి అంటాడు.
మరోవైపు తప్పించుకున్న పిల్లలు ఊరునించి దూరంగా వెళ్లిపోతే ఇటు రౌడీలకి అటు అమ్మానాన్నలకి దొరకము అనే ఉద్దేశంతో రోడ్డు మీద నించోని ఉంటారు. అక్కడికి ఒక ఆటో వస్తుంది. అందులో డ్రైవర్ పిల్లల్ని ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతాడు.
పిల్లలు: మేము ఊరి నుంచి దూరంగా వెళ్లిపోవాలి కానీ మా దగ్గర డబ్బులు లేవు అంటారు.
డ్రైవర్: పర్వాలేదు నేను డ్రాప్ చేస్తాను అనడంతో ఆటో ఎక్కి కూర్చుంటారు పిల్లలు. అయితే ఆ డ్రైవర్ ముసుగు వేసుకొని ఉన్న జలంధర్. అది గమనించరు పిల్లలు.
అయితే జలంధర్ పిల్లల్ని చాలా దూరంగా తీసుకెళ్లి ఆటో దిగి ఆటోని ముందుకి తోసేస్తాడు. అంకుల్ ఆటో వెళ్ళిపోతుంది అని పిల్లలు ఏడుస్తూ కేకలు వేస్తారు. ఆ ఆటో పేలిపోయినట్లుగా కల వస్తుంది అనుకి. పిల్లలకి ఏదో జరుగుతుంది అని ఏడుస్తుంది అను. ఇంట్లో వాళ్ళందరూ ఆమె ని ఓదారుస్తారు. అప్పుడే ఆర్య, యాదగిరి ఇంటికి వస్తారు. పిల్లలు దొరకలేదు అని చెప్పడంతో మరింత ఏడుస్తుంది అను.
అను : ఆర్య కాళ్లు పట్టుకొని నా పిల్లల్ని మీరే రక్షించగలరు, వాళ్లకి ఏదో పెద్ద ప్రమాదం ఎదురయ్యేలాగా అనిపిస్తుంది దయచేసి నా పిల్లల్ని తీసుకురండి అని వేడుకుంటుంది.
ఆర్య : మీరేమీ బాధపడకండి మీ పిల్లల్ని తీసుకువచ్చే బాధ్యత నాది ఒకవేళ వాళ్ళు ప్రమాదంలో పడితే నా ప్రాణాలు అడ్డేసి తీసుకొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత హరీష్ దివ్య దగ్గరికి వస్తాడు.
దివ్య: ఏంటి ఇంత సడన్గా ఫోన్ చేయకుండా వచ్చేసావు అని అడుగుతుంది.
హరీష్: ఎప్పుడు ఫోన్ చేసినా మీ ఇంట్లో ఏదో ఒక డిస్టబెన్స్ జరుగుతూనే ఉంటుంది అందుకే ఫోన్ చేయలేదు అయినా ఈ ఇంట్లో మన పెళ్లి త్వరలోనే జరగబోతుంది అనే ఎక్సైట్ మెంట్ ఎక్కడా లేదు అని నిష్టూరంగా అంటాడు.
దివ్య: నాక్కూడా అదే బాధగా ఉంది కానీ ఇప్పుడు మన గురించి ఆలోచించే పరిస్థితులలో ఎవరూ లేరు.
హరీష్: అందుకే మన గురించి మనమే ఆలోచించుకోవాలి ముందు ఈ పేపర్ మీద సంతకం పెట్టు అంటాడు.
దివ్య ఏంటి ఈ పేపర్స్ అని అడుగుతుంది.
హరీష్: మీ అమ్మగారు ల్యాండ్ అమ్మిన వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడాను మన పరిస్థితి చెప్తే నువ్వు మీ అక్క సంతకాలు పెడితే 50 లక్షలు ఇస్తానన్నారు. ఉష మైనర్ కాబట్టి తన సంతకం అక్కర్లేదంట అంటాడు.
దివ్య ఆలోచిస్తూ ఉంటే ఏంటి నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు.
దివ్య: నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను అని చెప్పి ఆ పేపర్స్ జ్యోతి దగ్గర తీసుకువెళ్లి జరిగిందంతా చెప్పి ఆమె చేత కూడా సంతకం పెట్టిస్తుంది.
మరోవైపు పిల్లలు రోడ్డుమీద నడుస్తూ ఉంటే ఒక కొబ్బరి బొండాలు అతను బోండా ఐదు రూపాయలకే అమ్ముతాను అని బోర్డు పెడతాడు.
పిల్లలు: బోండా ఐదు రూపాయలా అని అడుగుతారు.
బోండాలతను : అవును ఇవి వాడిపోయాయి సరుకు క్లియర్ చేద్దామని తగ్గించి అమ్మేస్తున్నాను అంటాడు.
అభయ్ : ఈ బోండాలు అన్నీ నేను కొనుక్కుంటాను అంటాడు.
బోండాలతను : అన్ని నువ్వేం చేసుకుంటావు అంటే అమ్ముతాను అంటాడు అభయ్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నేనే అమ్మ లేక పోతున్నాను నువ్వేం అమ్ముతావు అంటాడు.
అభయ్: అమ్మటానికి కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు బుర్రలో గుజ్జు అంటాడు.
బోండాలతను : అంటే నాకు లేదని నీ ఉద్దేశమా సరే తీసుకొని డబ్బులు ఇచ్చేయ్ అంటాడు.
అభయ్ రెండు రూపాయలు తీసి చూపిస్తాడు. ఏంటి రెండు రూపాయలా అని ఆశ్చర్యంగా అడుగుతాడు బోండాలతను.. అక్కడితో ఈరోజు కథ ముగుస్తుంది.
Also Read: తేజ సజ్జ చిన్నోడు కాదు, చిచ్చరపిడుగు - హనుమాన్ పెయిడ్ ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్