Prema Entha Madhuram Telugu Serial Today Episode: జాతకం చూడటానికి ఆలస్యం చేస్తున్న పంతులు గారిని ఎంతసేపు చూస్తారు అని అడుగుతాడు యాదగిరి.


పంతులు: పెళ్లంటే రెండు జీవితాలు కలియిక అందుకే కాస్త జాగ్రత్తగా చూడాలి తొందర పనికిరాదు అంటాడు. కాసేపు జాతకం చూసిన తర్వాత లగ్నపత్రిక కి పసుపు కుంకుమ రాయాలి తీసుకురమ్మని సుగుణకి చెప్తాడు. నేను వెళ్లి తీసుకు వస్తాను అని అను అన్ని తీసుకొని వస్తుంది.


పంతులు: మీ కోడలు చాలా చురుకైనదండి అన్ని పనులు దగ్గరుండి బాధ్యతగా చేస్తుంది అంటాడు.


యాదగిరి: ఆమె మా ఇంటి కోడలు కాదు మా బావకి ఇంకా పెళ్లి అవలేదు అని చెప్తాడు.


పంతులు: అంత బాధ్యతగా చేస్తుంటే మీ కోడలేమో అనుకున్నాను అంటూ 10 నిమిషాల వరకు వర్జ్యం  ఉంది అది పోయిన తర్వాత లగ్న పత్రిక చదువుతాను అంటాడు.


సుగుణ: అలాగే పంతులుగారు ఈ లోపు నేను దైవ  దర్శనం చేసుకుని వస్తాను అని దేవుడి దగ్గరికి వెళ్తుంది.


ఆమె వెనకనే ఆర్య వచ్చి ఏం జరిగిందమ్మా అంటాడు.


సుగుణ: మన ఇంటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను అది మంచిదో చెడ్డదో తెలియని అయోమయంలో ఉన్నాను అందుకే భగవంతుడి దగ్గరికి వెళ్లి వేడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది.


ఇంతలో యాదగిరి వచ్చి పెళ్లి వాళ్ళు భోజనాలు సంగతి అడుగుతున్నారు అతికితే గతకతని చెప్పేసాను అంటాడు.


ఆర్య: అలా చేస్తే బాగోదు పద వెళ్లి భోజనాల సంగతి చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.


సుగుణ: భగవంతుడికి దండం పెట్టుకుంటూ సూర్య కి రాధకి పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ నా కొడుక్కి పెళ్లయిన అమ్మాయి ఏంటా అనిపిస్తుంది. కానీ వాడి గతం తెలిసి వాడికి ఎవరూ పిల్లని ఇవ్వటం లేదు ఏం చేయటానికి పాలు పోవడం లేదు నువ్వే దారి చూపించు అని దండం పెట్టుకుంటుంది.


శివలింగం మీద నుంచి పువ్వులు పడటంతో శుభశకునంగా భావించిఆనందపడుతుంది సుగుణ. అప్పుడే ఆమెకి తెలిసినవారు అక్కడికి వస్తారు వాళ్లతో మాట్లాడుతుండగా అను అక్కడికి వచ్చి తాంబూలాలు మార్చుకోవడానికి బట్టలు అవి ఉండాలి కదా ఎక్కడ ఉన్నాయి అని అడుగుతుంది.


సుగుణ: అన్ని జ్యోతి దగ్గర ఉన్నాయి అని చెప్పడంతో సరే నేను చూసుకుంటాను అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అను.


సుగుణతో మాట్లాడుతున్న వాళ్ళు ఆ అమ్మాయి మీ కోడలా చక్కగా ఉంది మీ అబ్బాయి ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతారు. ఆమె నా కోడలు కాదు అని చెప్తుంది సుగుణ. అవునా అంటూ అక్కడినుంచి  వెళ్ళిపోతారు తెలిసిన వాళ్ళు.


ఆ తర్వాత అన్ని వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమన్నట్లుగానే శుభ శకునాలు కనిపిస్తున్నాయి అనుకుంటూ ఉష ని మెల్లగా పిలిచి జాతకం పత్రాలు తీసుకొని రమ్మంటుంది.


ఉష: జాతక పత్రాలు తీసుకుని వచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం నీకు ఇష్టమే కదా మళ్ళీ జాతకాలు చూపించడం ఎందుకు అంటుంది.


సుగుణ: జాతకాలు బాగుంటేనే జీవితాలు బాగుంటాయి అనుకొని వాటిని పట్టుకొని పూజారి దగ్గరికి వెళ్ళబోతుంది.


అప్పుడే ఆమె వియ్యపురాలు లగ్నపత్రిక రాస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు రండి అనటంతో ఉష నేను జాతకం చూపిస్తాను. నువ్వు వెళ్లి అక్కడ కూర్చో లేదంటే దివ్యక్క రెంకెలు వేస్తుంది అని చెప్పడంతో ఉషకి జాతక పత్రాలు ఇచ్చి సుగుణ కార్యక్రమం దగ్గరికి వెళుతుంది.


ఉష జాతకం చెప్పే పంతులు గారి దగ్గరికి వెళ్లేటప్పటికీ ఆయన ఎవరికో జాతకం చెప్తూ ఈ జాతకం అసలు బాగోలేదు పెళ్లి జరిగితే అన్ని కష్టాలే అని చెప్తాడు.


ఉష: ఇప్పుడు రాధ గారి వాళ్ళ జాతకం చూసి అలా చెప్తే అమ్మ ఈ పెళ్లికి అసలు ఒప్పుకోదు అని అక్కడినుంచి వెళ్ళిపోబోతుంటే పూజారి పిలుస్తాడు. అప్పుడు ఉష తన జాతకం చూపించి నేను ఇంటర్ తప్పాను ఈ సంవత్సరం అయినా పాస్ అవుతానో లేదో చెప్పండి అంటుంది.


పూజారి: నీకు సరస్వతి కటాక్షం తక్కువే కానీ ఈసారి విగ్రహాలు అనుకూలించి తప్పకుండా పాస్ అవుతావు అని చెప్తాడు. ఈ విషయం మా అమ్మకి చెప్తే ఆనందపడుతుంది తనక్కూడా చెప్పండి అని చెప్పి సుగుణ దగ్గరికి వస్తుంది.


సుగుణ: పంతులుగారు జాతకం కలిసింది అని చెప్పారా అని అనుమానం గా అడుగుతుంది.


ఉష: వాళ్ళిద్దరికీ జాతకాలు బాగా కలిసాయంట వాళ్లది జన్మజన్మల బంధం కావాలంటే నువ్వే పంతులు గారిని అడుగు అని పంతులుగారిని దూరం నుంచి పిలిచి ఇందాక నాతో చెప్పింది అమ్మ తో చెప్పండి అంటుంది.


పూజారి: ఉష జాతకం గురించి అనుకొని  గ్రహాలన్నీ బాగున్నాయి అమ్మ అంతా శుభమే జరుగుతుంది అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


ఆ మాటలకి సంతోషిస్తుంది సుగుణ.


Also Read: అరే.. ఇదంతా ఎలా జరిగింది, ఇదే కదా కావాలనుకుంది - రష్మిక ఆసక్తికర పోస్ట్