Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తల్లిని ల్యాండ్ పేపర్స్ అడుగుతాడు ఆర్య. నిజం చెప్పలేక నిలబడుతుంది సుగుణ. అప్పుడే సురేష్ వచ్చి బంగారం షాపింగ్ చేద్దాం అంటాడు.


ఆర్య : నేను కొంచెం బిజీగా ఉన్నాను రెండు రోజుల్లో ఆ పని పెట్టుకుందాం అంటూ తల్లిని మళ్లీ ల్యాండ్ పేపర్స్ అడుగుతాడు.


సుగుణ: ఆ పేపర్స్ నా దగ్గర లేవు అంటూ జరిగిందంతా చెప్తుంది.


దివ్య: తల్లి మీద కోప్పడుతూ ఆరోజు ల్యాండ్ ఇచ్చేద్దాం అంటే నీ కొడుకు అడ్డుకున్నాడు.. ఈరోజు ఏకంగా పేపర్స్ లేకుండా చేసేసావు అని కేకలు వేస్తుంది.


జ్యోతి: ఆస్తిలో నాక్కూడా వాటా ఉంటుంది.


యాదగిరి: నేనేమైనా నిన్ను ఆస్తి కోసం ఇబ్బంది పెట్టానా, నువ్వెందుకు అడుగుతున్నావు అని భార్యని మందలిస్తాడు.


సుగుణ: కన్నీటితో నా కొడుకు సూర్య కి మంచి చేద్దామనుకొని ఏదో చేయబోయాను కానీ ఇలా మోసపోతాను అనుకోలేదు అంటూ ఏడుస్తూ అందరికీ క్షమాపణ చెప్పుకుంటుంది.


ఆర్య : ఆ పేపర్స్ ఎలా తీసుకురావాలో నాకు తెలుసు నీ పెళ్ళికి ఎలాంటి డోకా రానివ్వను అని దివ్య కి మాట ఇచ్చి, తల్లికి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


సురేష్: నువ్వు వెళ్లి రెడీ అవ్వు బయటికి వెళ్లి కాఫీ తాగుదాం అని దివ్యకి  చెప్పి అతను బయటికి వెళ్లి ఇంట్లో జరిగిందంతా ఛాయాదేవి వాళ్ళకి చెప్తాడు.


మాన్సీ : మీ బావగారి ముఖంలో రంగులు మారిపోయాయా అని ఆనందంగా అడుగుతుంది.


సురేష్: అలాంటిదేమీ లేదు, ఆ పేపర్స్ ఎలాగైనా తిరిగి తీసుకు వస్తాను అని ఇంట్లో వాళ్లకి ఎంతో కాన్ఫిడెంట్ గా మాట ఇచ్చాడు అంటూ నా కాంట్రాక్ట్ సంగతి మరిచిపోరు కదా అని గుర్తు చేస్తాడు.


ఛాయదేవి : నువ్వు మాకు ఫేవర్ గా ఉన్నంతవరకు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఆ కాంట్రాక్ట్ నీకే అని చెప్పటంతో ఆనందంగా ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతాడు.


ఈ మాటలు విన్న అను ఎవరితోనో మాట్లాడుతున్నాడు, పైగా మేడం అంటున్నాడు. ఏదో జరుగుతుంది అని అనుమాన పడుతుంది.


మరోవైపు సుబ్బు ఎవరైనా స్వాములని దీక్షకి తీసుకు వస్తాను అని ఇంటి బయటకి వచ్చేసరికి అక్కి, అభయ్ ఇద్దరు ఎదురుగా ఉంటారు. వాళ్లని చూసి ఆనందపడతారు సుబ్బు దంపతులు.


సుబ్బు: మీరు ఎప్పుడు మాల వేసుకున్నారు.


పిల్లలు: మీరు మా ఇంటికి వచ్చారు కదా ఆ రోజే.


అచ్చు బాల అయ్యప్ప లాగా ఉన్నారు దీక్ష చేద్దాం రండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తారు సుబ్బు దంపతులు. పిల్లలిద్దరూ ఆ దంపతులతోకలిసి భోజనం చేసి ఆనందంగా గడుపుతూ ఉంటారు.


మరోవైపు స్కూల్ ప్రిన్సిపల్ అను కి ఫోన్ చేస్తాడు.


ప్రిన్సిపల్: ఈ మధ్య మీ పిల్లలు తరచుగా స్కూల్ కి రావడం లేదు ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు.


అను : లేదు సార్ వాళ్ళు స్కూల్ కి వస్తున్నారు అంటుంది.


ప్రిన్సిపల్: లేదు మేడం వాళ్ళు రెగ్యులర్ గా స్కూల్ కి రావటం లేదు.. ఈరోజు కూడా వాళ్ళు స్కూల్ కి రాలేదు.. వాళ్లకి కొంచెం డిసిప్లిన్ నేర్పించండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.


పిల్లలు ఎక్కడికి వెళ్లారు అని కంగారుపడిన అను తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తుంది తరువాత అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి ఉంటారు అని అక్కడికి వెళ్లి చూస్తుంది. అక్కడ తల్లిదండ్రులతో ఆడుతున్న పిల్లల్ని చూసి వీళ్ళు అమ్మానాన్నకి బాగా మచ్చిక అయిపోతున్నారు ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని బాధపడుతూ మళ్లీ వెనక్కి వచ్చేస్తుంది.


ఆ తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చినట్లుగా వస్తారు పిల్లలు.


అను: ఎక్కడికి వెళ్లి వస్తున్నారు? స్కూల్ కి వెళ్లి వచ్చాను అని మాత్రం అబద్ధం చెప్పొద్దు.


పిల్లలు: ఆరోజు మన ఇంటికి వచ్చిన తాతయ్య ఇంటికి వెళ్ళాము.. ఎందుకో తెలియదు వాళ్లతో ఎక్కువసేపు గడపాలనిపిస్తుంది అని అంటారు.. ఆ మాటలు విన్న అను వాళ్ళ వైపు బాధగా చూస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Read Also: తప్పు నాదే వీలైతే క్షమించు, బాలీవుడ్ బ్యూటీకి ‘యానిమల్’ డైరెక్టర్ క్షమాపణలు