Prema Entha Madhuram Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో షాపింగ్ వద్దని చెప్పేద్దాము అంటారు సుగుణ, ఉష. వాళ్లకి సర్ది చెప్పి బట్టలు కొనటానికి పంపిస్తాడు ఆర్య.
అను: సార్ ఇప్పుడు ఆర్యలాగా కాకుండా సూర్యలాగా ఆలోచిస్తున్నారు.. ఇప్పుడు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో అని బాధపడుతుంది.
మరోవైపు వచ్చిన చుట్టాలు అందరూ వేల ఖరీదు చేసే బట్టలు కొంటూ ఉంటారు. అది చూసి కంగారు పడతారు సుగుణ వాళ్ళు.
సుగుణ: వదిన..పక్క కౌంటర్ కి వెళ్లి కొనుక్కుందాము.
హరీష్ తల్లి : వద్దు అక్కడ అన్ని చీప్ చీరలు ఉన్నాయి.. నాకు ఇదే కావాలి అని పాతికవేల చీర తీస్తుంది. మొహం ఇబ్బందిగా పెట్టుకుంటుంది సుగుణ.
అను: సుగుణని పక్కకు పిలిచి దివ్యతో చెప్పండి హరీష్ తో మాట్లాడమని, వాళ్ళు చాలా ఎక్కువ ఖరీదులో బట్టలు తీసుకుంటున్నారు.
సుగుణ దివ్యని పక్కకు పిలిచి అను చెప్పింది చెప్తుంది.
దివ్య: మన దగ్గర డబ్బులు లేవన్న విషయం షాపింగ్ కి బయలుదేరినప్పుడే గుర్తుండాలి.. ఇక్కడికి వచ్చాక ఆలోచించకూడదు.అయినా నీ కొడుకు అన్నీ చూసుకుంటాను అన్నాడు కదా ఏం.. నీ కొడుకు మీద నమ్మకం తగ్గిందా అని వెటకారంగా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు సంపత్ అక్కడికి షాపింగ్ కి వస్తాడు అను ని చూసి గుర్తుపడతాడు. అను అని పిలుస్తుంటే ఉష షాక్ అవుతుంది. అను కంగారుగా తడబడుతూ ఉషను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది
సంపత్: ఆమెని వెంబడించి అను ఇన్నాళ్లు ఏమైపోయావు? నువ్వు ఆర్య సార్ తో ఉండటం లేదంట నేను ఆంటీ వాళ్ళతో మాట్లాడాను.. నువ్వు పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయావు అని చెప్పారు అలా ఎందుకు చేసావు అని అడుగుతాడు.
అను ఉషని నీతో తర్వాత మాట్లాడుతాను కాసేపు పక్కకు వెళ్ళు అని చెప్పి పంపించేస్తుంది. ఆ తర్వాత సంపత్ తో ఇప్పుడు ఏమి అడగొద్దు అన్ని తర్వాత చెప్తాను అంటుంది.
సంపత్: ఇప్పుడు నువ్వు ఏమి మాట్లాడే పరిస్థితిలో లేవని అర్థం అవుతుంది.. ఇదిగో నా విసిటింగ్ కార్డు.. ఖాళీ అయ్యాక నాకు ఫోన్ చెయ్యు అని చెప్పే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఉష : మీ పేరు రాధ కదా అతను ఏంటి అను అని పిలుస్తున్నాడు.. మీ వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారా అని అయోమయంగా అడుగుతుంది.
అను : ఇప్పుడు ఏమీ అడగొద్దు సమయం వచ్చినప్పుడు అని నేనే చెప్తాను అంటుంది.
ఆ తర్వాత ఏమాత్రం చీకు, చింత లేకుండా బట్టలు కొంటున్న దివ్యని చూసి తిట్టుకుంటుంది ఉష. ఏ ధైర్యంతో అన్నయ్య బట్టలు కొనుక్కోమంటున్నాడో అర్థం కావడం లేదు అని అనుతో చెప్తుంది.
ఆ తర్వాత హరీష్ కి సూట్ లు సెలెక్ట్ చేస్తూ ఉంటారు బంధువులందరూ. ఈ సూట్ హరీష్ కి అతికినట్టుగా సరిపోతుంది హీరోలాగా ఉంటాడు.. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని దివ్యతో అంటారు.
హరీష్: మీరు కూడా ఒక సూట్ కొనుక్కోండి బావగారు.
ఆర్య: నాకు వద్దు మీరు కొనుక్కోండి.
హరీష్ తల్లి: అతగాడికి ఇలాంటివి సూట్ అవ్వవు, సూట్ వేసుకోవాలంటే కళ ఉండాలి మా హరీష్ లాగా అంటుంది.
అప్పటికే కోపంతో ఉన్న యాదగిరి ఆయన వేసుకునే సూట్ ఖరీదు అంత ఉండదు మీ బతుకులు.. మీరు ఆయనని అవమానిస్తారా అని మనసులో అనుకుంటాడు.
అను : ఆయనని అలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేంటి ఆంటీ.
సుగుణ : ఏం చేస్తాం ఆడపిల్ల వాళ్ళం కదా,
అను: బాధ్యత భుజాన్ని ఎత్తుకునే మనిషికి దక్కాల్సిన గౌరవం ఇది కాదు అని సుగుణతో అంటుంది.
ఆ తర్వాత ఆర్య అందరి బలవంతం మీద సూట్ వేసుకుని వస్తాడు. అతనిలోని హుందాతనాని చూసి అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.