Prema Entha Madhuram  Serial Today Episode:   అకి, గౌరి దగ్గరకు వచ్చి పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? అని అడుగుతుంది. ముబావంగా గౌరి నచ్చాడు అని చెప్తుంది. ఇంకో ప్రశ్న అడుగుతాను అంటూ ఏ అమ్మాయికైనా ఎలాంటి భర్త వస్తే బాగుంటుంది అని అడుగుతుంది. దీంతో గౌరి, శంకర్‌ ను గుర్తు చేసుకుని కొన్ని విషయాలు చెప్తుంది. దీంతో అకి మొత్తానికి శంకర్‌ గారిలా ఉండాలని చెప్తారు అంటే కదా? అంటుంది. దీంతో కంగారుగా గౌరి లేదే నేను జస్ట్‌  నా అభిప్రాయాలు చెప్పాను అంటుంది. దీంతో అకి మీకు శంకర్‌ గారి మీద ఎలాంటి అభిప్రాయం లేదా? అంటూ అడగ్గానే గౌరి తనకు పని ఉందని వెళ్లిపోతుంది. అకి బయటకు వెళ్లిపోతుంది.



రవి: అకి వచ్చిన పని ఏమైంది..? అత్తయ్య ఏమన్నారు..?


అకి: అమ్మకు నాన్నంటే చాలా ఇష్టం రవి. కానీ బయట పడి చెప్పడం లేదు.


రవి: గుడ్‌ ఇక వాళ్లను కలపడానికి.. వాళ్ల ప్రేమను బయటపెట్టడానికి మనం ప్లాన్ చేస్తే సరిపోతుంది. ప్లాన్‌ చేయడం ఏంటి ఇద్దరి మద్య ప్రేమ ఉంటే ఆ ప్రేమే వాళ్లను కలుపుతుంది.


అకి: అవునా నాకొక స్మాల్‌  డౌట్‌ రవి. నన్ను ఎవరో హగ్‌  చేసుకోబోతుంటే అతని మీద ఎందుకు అంతలా కోప్పడ్డావు.


రవి: అంటే అది మన కల్చర్‌ కాదు కదా?  అందుకే అలా చేశాను.


అకి: సింపుల్‌ గా నో అని చెప్పొచ్చు కదా? అంత కోపం ఎందుకు వచ్చింది.


రవి: ఏమో నాకే తెలియదు. సడెన్‌ గా అలా ఫైర్‌ అయిపోయాను అంతే.


 అని చెప్పి వెళ్దాం పద అకి అని కారు స్టార్ట్‌ చేస్తాడు రవి. అకి రవినే చూస్తూ ఉంటుంది. మరోవైపు పాండును కలిసిన యాదగిరి ముగ్గురు  అరబ్బు షేకులు లాండ్‌  కొనడానికి  వచ్చారని వాళ్లిప్పుడే మా ఇంట్లోనే ఉన్నారని మీరు సాయంత్రం రండి అని చెప్తాడు. సరే అని పాండు వెళ్లిపోతాడు. మరోవైపు గౌరి బాబాయ్‌ ని పిలిచి పెళ్లికొడుకు గురించి చెప్తాడు. వాణ్ని పట్టుకోవడానికి మేము ప్లాన్‌ చెప్తాము  మీరు అలాగే చేయండి అని చెప్తాడు. సరే అంటాడు. మరోవైపు శ్రావణి, సంధ్య చదువుకుంటుంటే  వినయ్‌ వస్తాడు.


వినయ్‌: వెదర్‌ చాలా హాట్‌  గా ఉంది. అమెరికాలో అయితే చాలా కూల్ గా ఉంటుంది.


శ్రావణి: ఇంట్లో కూలింగ్‌  గ్లాసెస్‌  పెట్టుకున్నారేంటి?


వినయ్‌: అమెరికాలో అందరూ ఇంతే. ఇక్కడైతే పడుకునేటప్పుడైనా తీస్తాం. అక్కడైతే ఎప్పుడూ పెట్టుకునే ఉంటాం. కూర్చోండి.


సంధ్య: మీరు  అమెరికాలో ఎక్కడ ఉండేది.


వినయ్‌: చచ్చాం ఇప్పుడు ఏం చెప్పాలి..


సంధ్య: ఎంటి అంతలా ఆలోచికస్తున్నారు.


వినయ్‌: ఏం లేదు నేను ఉండేది. చర్చి స్ల్రీట్‌.


శ్రావణి: అయ్యో తను అడిగింది అమెరికాలో ఏ సిటీలో ఉంటారు అని


వినయ్‌: అమెరికాలో మల్లీ సిటీనా..? అమెరికా అంటే ఊరు కదా?  ( అని మనసులో అనుకుంటాడు)


శ్రావణి: అంటే లాస్‌ ఎంజెల్స్‌, న్యూయార్క్‌, చికాగో, డల్లాసా? అని


వినయ్‌: శ్రావణి నాకు తెలియదు అనుకున్నావా. ఏదో సరదాగా సంధ్యను ఆట పట్టిద్దామని.. న్యూయార్క్‌  అని చెప్పాను కదా మీకు గుర్తు లేదా? అక్కడ నాకు చాల మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు వెళ్లగానే మీకు జాబ్స్‌ చూస్తాను.


గౌరి: నా చెల్లేలు నాతోనే  ఉంటారంటే  అంతకన్నా సంతోషం ఏముంటుంది.


 అని మాట్లాడుకుంటుండగా బాబాయ్‌  వస్తాడు. వినయ్‌ని  అమెరికాలో నువ్వు ఎక్కడ ఉంటావు ఏ కంపెనీలో వర్క్ చేస్తావు. ఇక్కడ మనకు ఆధార్‌ కార్డు ఉన్నట్లే అక్కడ ఏదో గ్రీన్‌ కార్డు ఉంటుందట కదా? అదేదో నాకు ఇవ్వు అని అడగ్గానే వినయ్‌ కంగారుపడుతుంటాడు. బాబాయ్‌  అవన్నీ ఉన్నాయి కదా బాబు అని అడగ్గానే ఉన్నాయి అని చెప్తాడు. అయితే నీ ఫ్రెడ్స్‌ వివరాలు చెప్పు బాబు అని అడగ్గానే వినయ్‌  ఆలోచిస్తుంటాడు.


    ఇంతలో పాండు వచ్చి నీ ఫ్రెండ్స్‌  దుబాయ్‌  నుంచి వచ్చారని రేపు నిన్ను కలుస్తారట అని చెప్తాడు. దీంతో బయటి నుంచి అంతా గమనించిన శంకర్‌ ఇక వాణ్ని ఫేక్‌ అని నిరూపిస్తా అంటాడు. మరోవైపు బాబాయ్‌ గౌరిని కన్వీన్స్‌ చేస్తుంటాడు. మరోవైపు అకి, రవి ఇద్దరూ కలిసి గౌరి,శంకర్‌ లను ఎలా కలపాలని ఆలోచిస్తుంటారు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం