Prema Entha Madhuram  Serial Today Episode: ఇంటికి వచ్చిన అకితో గౌరి పెళ్లి గురించి మాట్లాడుతుంది జ్యోతి. ఆ పెళ్లి ఆపేయాలన్న కోపం వచ్చింది తనకు అని చెప్తుంది. ఇంతలో యాదగిరి వచ్చి రవి రెడీ అవుతున్నాడు పది నిమిషాల్లో వస్తాడు. అని చెప్పగానే నేను అమ్మ దగ్గరకు వెళ్తున్నాను రవి కూడా ఉంటే మోరల్‌ సపోర్టుగా ఉంటుందని వచ్చాను అని చెప్తుంది. ఇంతలో రవి వచ్చి అకికి సారీ చెప్తాడు. ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. మరోవైపు సంధ్య బట్టలు మడత పెడుతుంటే వినయ్‌ వెళ్లి మరదలు పిల్ల ఒంటరిగా దొరికింది ఒకసారి సరసం ఆడదాం అనుకుంటాడు.  


 వినయ్‌: బూమ్‌.. బయపడ్డావు కదా? చిన్న ఫన్నీ అంతే ఇంతకీ ఏం చేస్తున్నావు.  


సంధ్య: ఏం లేదండి బట్టలు సర్ధుతున్నాను.


వినయ్‌: నేను హెల్ఫ్ చేస్తాను. నాకు బోరు కొడుతుంది. చీర ఎలా మడత పెడతారో నాకు తెలుసు. చీర ఎలా కట్టుకోవాలో నేర్పిస్తావా?


శ్రావణి: సంధ్య ఏంటో షాపింగ్‌ కు వెళ్దామని ఇంకా రాలేదేంటి? మీరేంటి ఇక్కడ ఉన్నారు.


వినయ్‌: జస్ట్‌ ఊరికే.. మాట్లాడుతున్నాను. మీ అక్క ఇష్టాఇష్టాలు తెలుసుకుంటున్నాను. మంచి హస్పెండ్‌ గా ఉండాలంటే తప్పదు కదా?


శ్రావణి: మాఅక్క చాలా సింపుల్‌ అండి. మీకు తనతో ఎలాంటి ప్రాబ్లమ్‌ ఉండదు. పద సంధ్య వెళ్దాం.


సంధ్య: ఆ అబ్బాయి మంచోడు కాదేమో శ్రావణి. నాతో మిస్‌ బిహేవ్‌ గా మట్లాడాడు. నాకెందుకో అక్కకు తను కరెక్టు కాదనిపిస్తుంది.


శ్రావణి: ఇప్పుడెల్లి ఏం చేస్తావు..


సంధ్య: అక్కకు వెళ్లి చెప్తాను. పెళ్లి చేసుకోవద్దని చెప్తాను.


శ్రావణి: నువ్వు ఈ విషయం చెబితే అక్క ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. అయినా ఆ అబ్బాయి మంచోడు కాదని నువ్వు గ్యారంటీగా చెప్పగలవా?


  అని శ్రావణి చెప్తుండగానే గౌరి వస్తుంది. ఏంటే మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏం లేదని చెప్తారు. తర్వాత సంధ్య ఒక్కతే పైకి వెళ్లి ఏడుస్తుంటే చిన్నొడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదని చెప్తాడు. సంధ్య చేయి పట్టుకుని అడుగుతుంటే శంకర్‌ వచ్చి చూసి చిన్నొడిని కొడతాడు ఆడపిల్ల చేయి పట్టుకుంటావా? అని నిలదీస్తాడు. దీంతో సంధ్య జరిగిన విషయం మొత్తం చెప్తుంది.



పెద్దోడు: నువ్వు గెస్‌ చేసింది కరెక్టే అన్నయ్యా..వాడు కచ్చితంగా ఫేకే అయ్యుంటాడు.


శంకర్‌: అది వాడి ముఖం చూస్తేనే తెలుస్తుంది కదరా? అయినా  ఈ విషయం నువ్వుమీ అక్కకు చెప్పొచ్చు కదమ్మా..


సంధ్య: చెప్పాలనే చూశాను కానీ శ్రావణి ఆపింది. అబ్రాడ్‌లో ఉండి వచ్చాడు. వాళ్లు అలాగే ఉంటారు. నువ్వే అపార్థం చేసుకుంటున్నావు అన్నది.  


శంకర్‌: వాడు అబ్రాడ్‌లో చదువుకుని వస్తే మిస్‌ బిహేవ్‌ చేస్తాడా? అకి ఉంది అబ్రాడ్‌లో చదువుకుని వచ్చింది తను ఎంత పద్దతిగా ఉంది. ఆ వినయ్‌ గాడి గుట్టు తెలుసుకుని రట్టు చేయకపోతే గౌరి గారి జీవితం పాడైపోతుంది.


 అకి వస్తుంది.


పెద్దోడు: అన్నయ్యా ఇలా తలుచుకున్నామో లేదో అలా అకి వచ్చింది.


అకి: హాయ్‌ అండి ఎలా ఉన్నారు. కిందకు రండి.


శంకర్‌: అలాగే అమ్మా వస్తున్నాను.


గౌరి: అకి ఎలా ఉన్నావు లోపలి పద


అకి: శంకర్‌ గారిని కూడా పిలిచాను వస్తున్నాడు.


 అని చెప్పగానే శంకర్‌ వస్తాడు. అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే లోపలి నుంచి వినయ్‌, అకిని చూసి అందగత్తెలందరూ ఒకే చోట మీటింగ్‌ పెట్టుకున్నారు. కరువు తర్వాత ఎంత ఆఫర్‌ వస్తుంది. అని బయటకు వచ్చి అకి ఎవరని వచ్చి అడుగుతాడు. అకి గురించి చెప్పగానే అకిని హగ్‌ చేసుకోబోతాడు. రవి అడ్డుపడి ఇండియా కల్చర్‌ గురించి చెప్తాడు. దీంతో గౌరి అకిని తీసుకుని లోపలికి వెళ్తుంది.


      తర్వాత శంకర్‌, జెండే, యాదగిరి అందరూ మీటింగ్‌ పెట్టుకుంటారు.  ఆ పెళ్లికొడుకు ఫేకే అని చెప్తాడు. ముల్లును ముల్లుతోనే తీయాలని తాము గెటప్‌ చేంజ్‌ చేసుకోవాలని చెప్తాడు శంకర్‌. ఈ దెబ్బతో ఆ ఫేక్‌ గాడి చాప్టర్‌ క్లోజ్‌ అంటాడు యాదగిరి. మరోవైపు గౌరిని పెళ్లికొడుకు మీకు నచ్చాడా? అని అకి అడుగుతుంది. ఎలాంటి భర్త వస్తే బాగుంటుంది అని అడగ్గానే గౌరి శంకర్‌ను గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: డార్జిలింగ్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ టైం అస్సలు మిస్ అవ్వద్దు