Brahmamudi Serial Today Episode:  రాజ్‌ ఉద్యోగులందరినీ తిడుతూ ఉంటాడు. ఎందుకింత నెగ్లెక్ట్‌ గా ఉన్నారని కోప్పడతాడు. పదేళ్ల నుంచి మన కంపెనీకి వస్తున్న అవార్డు ఈసారి కూడా మనకే రావాలి. అది మనకు ఐఎస్‌ఐ మార్కు లాంటిది. మీరేం చేస్తారో నాకు తెలియదు. రేపటిలోగా గుడ్‌ డిజైన్స్‌ వేసి ఇవ్వాలి అని చెప్పి వెళ్లిపోతారు. మరోవైపు మేనేజర్‌ కావ్యతో మన కంపెనీ పెద్ద కంపెనీతో టైఆప్‌ అవుతుందని బెస్ట్‌ డిజైన్స్‌ వేసి ఇవ్వాలని అడుగుతాడు. కావ్య సరే అంటుంది. అదే విషయం మేనేజర్‌ అనామికకు చెప్తాడు. తాను వేసే డిజైన్స్‌ సామంత్‌ కంపెనీకి వెళ్తున్నట్లు ఎట్టి పరిస్థితుల్లో కావ్యకు తెలియకూడదు అని చెప్తుంది. మరోవైపు రాజ్‌, సామంత్‌ కలుస్తాడు.


సామంత్‌: హాయ్‌ రాజ్‌ చాలా రోజులు తర్వాత కలుస్తున్నాము ఎలా ఉన్నావు.


రాజ్‌: నేను ఆనందంగా ఉన్నానంటే మీ ఆనందం దూరం అయిపోతుంది కదా?


సామంత్: ఏం చేయమంటావు చెప్పు మనం చేసిన బిజినెస్‌ అలాంటిది.


రాజ్‌: బిజినెస్‌ ఏదైనా కావొచ్చు దానికంటే ముందు మనం మనుషులం కదా? అందరూ సంతోషంగా ఉండాలన్న సంగతే మర్చిపోయినట్లు ఉన్నావు.


సామంత్‌: నీలా ఉండటం అందరికీ సాధ్యం కాదు కదా?


రాజ్‌: మనసు క్లీన్‌గా పెట్టుకుంటే అందరికీ సాధ్యం అవుతుంది.


 అని రాజ్‌ చెప్పగానే సామంత్‌ సక్సెస్‌ మాత్రమే నీతో ఇలా మాట్లాడిస్తుంది అంటాడు. ఈ సారి ఆ సక్సెస్ నాకు రాబోతుంది అంటాడు. నువ్వు కలలు కంటూనే ఉండు అని వెళ్లిపోతాడు రాజ్‌. మరోవైపు అప్పును కోచింగ్‌ సెంటర్‌ కు తీసుకెళ్తాడు. ఎస్సై కావాలనే నీ యాంబిషన్‌ ఇక్కడే చేరితే ఫుల్‌ ఫిల్‌ అవుతుంది అంటాడు. ఫీజు గురించి తెలుసుకుని మళ్లీ వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇంటికి వచ్చిన రాజ్‌ ఇంట్లో వాళ్లతో మాట్లాడుతుంటాడు.


రాజ్‌: మీతో కొంచెం మాట్లాడాలి డాడ్‌. ఆడిటర్‌తో మీటింగ్‌ జరిగింది. ఈ ఇయర్‌ మనకు పన్నెండు కోట్ల నష్టం వస్తుంది. ఇన్ని రోజులు కంపెనీ గురించి పట్టించుకోకపోయే సరికి మనకు రావాల్సిన ఆర్డర్స్‌ వెనక్కి వెళ్లిపోయాయి. మార్కెట్‌ లో కూడా మన కంపెనీపై బ్యాడ్‌ పేరు పడింది.


రుద్రాణి: అర్థమైంది. ఆ పన్నెండు కోట్ల నష్టం నా కొడుకు వల్ల వచ్చిందనేగా..? ఈ లెక్కలన్నీ మొదలుపెట్టింది.


సుభాష్‌: నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు రుద్రాణి. ఇప్పుడు రాజ్‌ మాటల్లో రాహుల్‌ పేరు తీసుకొచ్చారా?


స్వప్న: ఎక్కడ కొడుకు బండారం బయటపడుతుందోనని మా అత్త రాజ్‌ మీద పడుతుంది.


రాజ్: అత్తా ఇప్పటి వరకు ఈ లాస్‌ గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు లాగుతాను. ఎవరు ఎంత మింగారో మొత్తాన్ని కక్కిస్తాను.


ప్రకాష్‌: చచ్చింది గొర్రె. ఇంత సేపు నీ కొడుకు సంగతి తెలిసినా నోరు విప్పలేదు. నువ్వే అనవసరంగా గెలుక్కున్నావు.


సుభాష్‌: మరి ఏం చేయాలనుకున్నావు రాజ్‌.


రాజ్: డాడ్‌ ఈ సంవత్సరం జరగబోయే ఎక్స్‌ ఫో చాలా పెద్ద ఎత్తున్న ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ సారి మన కంపెనీ నుంచి మంచి డిజైన్స్‌ పంపించి అవార్డు తీసుకోగలిగే మళ్లీ మనం నెంబర్‌వన్‌ పొజిషన్‌ కు చేరుకోవచ్చు.


 అని రాజ్‌ చెప్పగానే అంత బాగా డిజైన్స్‌ వేయాలంటే మన కావ్య వల్లే సాధ్యం అవుతుంది అంటాడు సుభాష్‌. ఇలాగైనా నా  కొడలిని మళ్లీ ఇంటికి తీసుకురారా. అంటుంది అపర్ణ. కావ్య వేసే డిజైన్స్‌ చాలా ట్రెండీగా ఉంటాయని సుభాష్‌ చెప్తాడు.  తర్వాత రుద్రాణి ఎవ్వరిసాయం అవసరం లేకుండా రాజ్ సొంతంగా గెలుస్తాడు అని అడ్డుకట్ట వేస్తుంది. దీంతో అపర్ణ, స్వప్న, ప్రకాష్‌, రుద్రాణిని తిడతారు. అవార్డు కోసం ఎవరిమీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు. నేనే ఏదైనా చేసి అవార్డు కొడతాను. కానీ ఆ కళావతిని సాయం అడగను అని చెప్పి వెళ్లిపోతాడు.



   మరోవైపు డిజైన్స్‌ వేస్తున్న కావ్య రాజ్‌ ను గుర్తు చేసుకుంటుంది. డిజైన్స్‌ చాలా స్పీడుగా ఎలా వేయాలో రాజ్‌ చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని ఎమోషన్‌ అవుతుంది. రాజ్‌ తనకు ముద్దు పెట్టినట్టు తన్మయం చెంది. ఎంత మర్చిపోదామనుకున్నా ఆ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయేంటి అనుకుంటుది. ఇంతలో కనకం వస్తుంది. పేపరు మీద కావ్య తాను రాజ్‌తో గడిపిన క్షణాలను గీస్తుంది. అది చూసిన కనకం షాక్‌ అవుతుంది. మరోవైపు రాజ్‌ కూడా కళావతి పేరు మీద లెటర్‌ రాస్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: మీ ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే భయంకరమైన వాస్తు దోషం ఉన్నట్లే