Prema Entha Madhuram  Serial Today Episode:  రాకేష్‌ ఎవరో స్వామిజీ దగ్గర కూర్చుని ఉంటాడు. ఆయన అప్పుడే కళ్లు తెరచి చూసి వాళ్ల ప్రేమకు మరణం లేదని జన్మజన్మలుగా ముడిపడిని బంధం వాళ్లది. చావులోనూ తోడు వీడని ప్రేమ. ఆ ప్రేమను బతికించుకోవడానికి మళ్లీ పుట్టారు. వాళ్ల ప్రేమ ఎంతో శక్తివంతమైనది. వాళ్లను ఎవ్వరూ విడదీయలేరు అని స్వామిజీ చెప్పగానే..  లేదు  వాళ్లు అసలు కలవకూడదు. వర్ధన్‌ కుటుంబం ఉనికే లేకుండా నేను చేయాలని నేను ప్రయత్నిస్తుంటే.. వాళ్లు మళ్లీ తిరిగి పుట్టడమేంటి? అంటాడు రాకేష్‌. దీనికి పరిష్కారమేంటి అని అడగ్గానే వాళ్లిద్దరిలో ఎవరికో ఒకరికి వేరే వాళ్లతో పెళ్లి కావాలి. లేదంటే ఒకర్ని చంపేయాలి అని స్వామి చెప్తాడు. మరోవైపు పూజ అయిపోయాక అందరూ భోజనం చేయడానికి రెడీ అవుతుంటారు.


శంకర్‌: గౌరి గారికి ఉన్న పిసినారి తనానికి భోజనాలు పెడతానంటే ఏ పప్పు, సాంబార్‌, పులిహోరతో గడిపేస్తారనుకున్నాను. కానీ ఇన్ని వెరైటీలు చేస్తారని అసలు ఊహించలేదండి. భలే మారిపోయారండి మీరు.


గౌరి: మీరు పొగడటంలో కూడా నన్ను వెటకారం చేసినట్టు ఉంది. అసలు మీరు ఏ కామెంట్లు చేయకండి ప్లీజ్‌.


శంకర్‌: సరే సరే లేండి మిగిలినవీ తీసుకురండి ఆకలేస్తుంది భోం చేద్దాం.


 అని శంకర్‌ చెప్పగానే పాండు వీళ్ల సంతోషాన్ని ఎలాగైనా చెడగొట్టాలని మనసులో అనుకుని వండిన వటకాలను తీసుకురావడంలో నేను హెల్ఫ్‌ చేస్తాను అని వంటకాలు తీసుకురావడానికి వెళ్తాడు. లోపలికి వెళ్లి వంటల్లో ఉప్పు కలుపుతుంటాడు. ఇంతలో లోపలికి వచ్చిన సంధ్య, సాంబారులో పాండు ఉప్పు కలపడం చూసి అందర్నీ లోపలికి పిలుస్తుంది.  శంకర్‌ ను పాండును కొట్టబోతుంటే జ్యోతి ఆపి నేను అందులో ఉప్పు కలపలేదు ఇప్పుడు ఆయన కలిపాడు సరిపోయింది అని చెప్తుంది. దీంతో పాండు కూడా నేను టేస్ట్‌ చేశాను ఉప్పు లేదనే కలుపుతున్నాను అంటాడు. దీంతో అందరూ సైలెంట్‌ అయిపోతారు. ఇంతలో జ్యోతి ఇలా పండుగలకు పబ్బాలకు అన్నం పెట్టడమేనా లేక మీరిద్దరూ కలిసి పప్పన్నం పెట్టడం ఏమైనా ఉందా? అని అడుగుతుంది.


శంకర్‌: ఓహో మీకు పప్పనం  పెట్టాలంటే నేను గౌరి గారు పెళ్లి చేసుకోవాలా?... జోకు జస్ట్‌ జోకు.


పెద్దొడు: అన్నయ్య అది జోకులా లేదు. షాక్‌ ఇచ్చినట్టు ఉంది.


యాదగిరి: కొన్ని విషయాలు విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. ఏమో ఎవరికి ఎవరితో ముడిపడుతుందో ఎవరికి తెలుసు.


జ్యోతి: పైగా ఈ టైంలో తథాస్తు దేవతలు తిరుగుతుంటారు.


పాండు: అంత లేదు లేండి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని ఈవిడకు ఎవరూ లేరు. ఆయనకు ఎవరూ లేరు. ఆ అమ్మాయి ఓ పెద్ద కుటుంబానికి కోడలిగా వెళితే బాగుంటుంది.


శ్రావణి: నిజమే మా అక్కకు లోకల్‌ సంబంధాలు ఏవీ సెట్టు అవ్వవంట. పారిన్‌ లో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని మా జ్యోతిష్యుడు చెప్పాడు.


అకి: అవన్నీ మూఢనమ్మకాలు జ్యోతిష్యుడు చెబితే జరిగిపోతాయా? ఏంటి?  


సంధ్య: ఆయన పెద్ద జ్యోతిష్యుడు. ఆయన చెప్పినవన్నీ జరిగాయి. మా అక్కకు ఫారిన్‌ సంబంధమే సెట్టు అవుతుంది.  


 అని చెప్పగానే గౌరి ఇక ఆపండని భోజనాలు చేద్దాం పదండి అని చెప్పగానే సోదమ్మ పిలుపు విని అందరూ బయటకు వెళ్తారు. సోదమ్మ సోది చెప్తుంది. అన్ని బంధాలు కలిసి ఇక్కడ సంతోషంగా ఉన్నాయి అంటుంది. దీంతో జెండే అమ్మా ఈ సంతోషాలు ఎప్పటికీ ఇలాగే ఉండేలా చూడు అంటాడు. అప్పుడు దుష్టశక్తులను దూరం చేయాలని అమ్మ మీద నమ్మకంతో ఉండండని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు అభయ్‌ తాను సడెన్‌ గా గౌరి వాళ్ల ఇంటికి  వెళ్లి అకికి సర్‌ప్రైజ్‌ చేయాలనుకుని బయలుదేరుతాడు. మరోవైపు జెండే, యాదగిరి జోగమ్మ మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంటారు. ఇంతలో అకి వచ్చి ఆమె మాటలు వింటుంటే నాకెందుకో బాధగా ఉందంటుంది. అభయ్‌ గౌరి వాళ్ల ఇంటికి వెళ్లగానే సంధ్య, శ్రావణి వచ్చి జెండే, అకి భోజనం చేసి వెళ్లిపోయారు అని చెప్తారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: పొరపాటున కూడా చెత్త కుండీని ఇంట్లో ఈ దిక్కున పెట్టకండి. లేదంటే ధన నష్టం వాటిల్లుతుందట