Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ, అమర్ రామ్మూర్తి ఇంటికి వస్తారు. వినాయక చవితికి రమ్మని పిలవగానే రామ్మూర్తి మొహమాట పడుతుంటాడు. దీంతో భాగీ నాన్నా మీరు ఆ ఇంటికి రావడం మీకేమైనా ఇబ్బందా? అని అడుగుతుంది. దీంతో రామ్మూర్తి ఇప్పటికే ఆ ఇంటి నుంచి చాలా తీసుకున్నానని చెప్తాడు. దీంతో అమర్ ఆ ఇల్లు మీ కూతురిది కూడా అని మీరు వస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చింది మీరు రారనే వార్తను మోసుకెళ్లడానికి కాదు. మా వెంట మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాము అనగానే రామ్మూర్తి సరే అంటాడు. అమర్ బయట వెయిట్ చేస్తుంటాను. మీరు రెడీ అయ్యి రండి అని బయటకు వెళ్తాడు. తర్వాత మంగళ కూడా బయటకు వెళ్తుంది.
మంగళ: బాబు..
అమర్: చెప్పండి ఏంటి..
మంగళ: అది బాబు... ఏం లేదులే బాబు ఊరికే వచ్చా...
అమర్: ఏవండి.. ఏదో చెప్పాలని వచ్చి మొహమాట పడుతున్నారు. డబ్బుల గురించా? నన్ను అడగలేకపోతే రాథోడ్ ను అయినా అడగండి.
మంగళ: అయ్యోయ్యో అది కాదు బాబు మీ భార్య అరుంధతి గురించి.. మా ఆయన పెద్ద కూతరు గురించి
అమర్: ఆ విషయం మీకెలా తెలుసు..? ఈ విషయం ఆయనకు తెలుసా? మిస్సమ్మకు కూడా తెలుసా?
మంగళ: అయ్యో్యో ఈ నిజం నాకు మాత్రమే తెలుసు. ఆయనకు కానీ భాగీకి కానీ నేను చెప్పలేదు. మీరు నిజం ఎందుకో దాస్తు్‌న్నారు అని నేను చెప్పలేదు. అయినా మీరు ఎందుకు నిజం చెప్పలేదు.
అమర్: నేను చెప్పే ఒక్క నిజంతో ఆయన బ్రతకడానికి కారణం లేకుండా చేయలేకపోయాను. తన అక్క లేదనే నిజం తట్టుకుని నిలబడే శక్తి మిస్సమ్మకు లేదు. ఇందరి జీవితాలను తారుమారు చేసే నిజం మనసు విరిచేసే నిజం చెప్పకపోవడమే మంచిది అనిపించింది.
మంగళ: కరెక్టుగా చెప్పారు బాబు. ఆయన పెద్ద కూతురు గురించి కలవరపడుతున్నారు. ఆయన మంచాన పడి ఉండటం చూడలేకపోతున్నాను. ఇంతకు ముందు ఉద్యోగానికి వెళ్లేవాడు. ఇలాగే ఖాళీగా ఉంటే కూతురు జాడ కనుక్కోకుండా ఉండేలా లేడు. అందుకే బిజినెస్ చేద్దామనుకుంటున్నాము. ఒక పది లక్షలు ఇవ్వండి
అమర్: సరే లేండి డబ్బుల విషయం నేను చూసుకుంటాను.
అని చెప్పగానే ఇంతలోనే లోపలి నుంచి రామ్మూర్తి, భాగీ వస్తారు. రామ్మూర్తి మంగళను తిడతాడు. తర్వాత భాగీ, అమర్ వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిపోయాక అమర్‌తో ఏం మాట్లాడావు అని మంగళను అడుగుతాడు రామ్మూర్తి. నేనేం అడగలేదని చెప్తుంది. దీంతో డబ్బులు అడిగావా? అంటూ రామ్మూర్తి గట్టిగా నిలదీస్తే మంగళ తడబడుతూ నేనేం అడగలేదు. నీ పెద్దకూతురు గురించి మాట్లాడాను అంటుంది. దీంతో రామ్మూర్తి ఎమోషనల్ అవుతాడు. బాబు గారి ఇంట్లో ఆ పట్టుపంచె చూసినప్పటి నుంచి మనసంతా ఏదోలా ఉంది అంటాడు. తర్వాత అమర్ ఇంటికి మిలటరీ మేజర్ వస్తాడు.
అమర్: ఎనీ ప్రాబ్లమ్ సార్..
మేజర్: ప్రాబ్లం ఏమీ లేదు అమర్. జస్ట్ రొటీన్ చెక్ అప్. అండ్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేస్తున్నాం అంతే.
శివరాం: ఏదైనా సమస్య ఉంటే చెప్పండి బాబు పర్వాలేదు.
మేజర్: ఎం లేదండి..
అని చెప్పి మేజర్ అమర్‌తో పర్సనల్ గా మాట్లాడాలి అని పక్కకు తీసుకెళ్లి ఇండిపెండెన్స్ డే రోజు మనం అరెస్ట్ చేసి వారిలో మేయిన్ వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. అందుకే వాడు ఇప్పుడు నిన్ను నీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. అందుకే నీకు నీ ఫ్యామిలీకి సెక్యూరిటీ పెంచాము. అని చెప్పగానే జాగ్రత్తగా ఉండమని మేజర్ వెళ్లిపోతాడు. భాగీ ఎందుకు ఇంత సెక్యూరిటీ అని అడగ్గానే రొటీన్ అంట అని అందరినీ లోపలికి పంపిస్తాడు. రాథోడ్ ఏమైంది సార్ అని అడగ్గానే అరవింద్ జైలు నుంచి తప్పించుకున్నాడంట అందుకే టైట్ సెక్యూరిటీ చేశారు. అని చెప్తాడు. మరోవైపు తీవ్రవాదులు ఉక్రోషంతో అమర్‌ను తిడుతుంటాడు. అమరేంద్రను చంపాలని డిసైడ్ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా చెత్త కుండీని ఇంట్లో ఈ దిక్కున పెట్టకండి. లేదంటే ధన నష్టం వాటిల్లుతుందట