Prema Entha Madhuram  Serial Today Episode:  అయోధ్యపురంలో ప్రెసిడెంట్‌ డల్లగా కూర్చుని ఉంటాడు. ఇంతలో కోయదొర వచ్చి త్వరలో నీకు అనుకోని సంఘటన జరగబోతుంది. ఒక నిజం నీకు ఎదురురాబోతుంది. ఆ నిజం బయటకు చెబితే నీ తల వెయ్యి ముక్కులు అవుతుందని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు గౌరి వాళ్లు రెడీ అయి బ్యాగులు తీసుకుని బయటక వస్తారు.


శంకర్: ఏంటి గౌరిగారు రాను రాను అని చెప్పి లగేజీ గట్టిగా సర్దినట్టు ఉన్నారు.


గౌరి: అవునండి రాను అని చెప్పాను ఇప్పుడు వస్తున్నాను. ఏంటి మీ ప్రాబ్లమ్‌. రావొద్దంటారా? చెప్పండి. శ్రావణి, సంధ్య తాళం తీయండే లోపలికి వెళ్లిపోదాం.


శ్రావణి: అక్కా తీరా బయటుదేరాక ఏంటిది. శంకర్ గారు. అసలే మా అక్కను కష్టపడి ఒప్పించాము. తనతో మీరు గొడవ పడకండి.


శంకర్: నేను ఎక్కడ గొడవ పడ్డానండి తనే రాను అన్నారు కదా? వస్తున్నారేంటి అని అడిగాను దానికే మూతి ముఫ్పై మూడు వంకలు తిప్పారేంటి?


గౌరి: రాను అంటే రమ్మని బతిమిలాడాలి కానీ ఇలా అంటారేంటి?


శంకర్‌: నేను మిమ్మల్ని బతిమాలడం ఏంటి..?


 అంటుంటే ఇంతలో చిన్నొడు, పెద్దోడు రెండు బైకులు తీసుకుని వస్తారు.


శంకర్: ఏరా ఇప్పటికే ఆలస్యం అయింది. ఎక్కడికి వెళ్లారు. అన్నట్టు ఈ బైక్స్‌ ఎక్కడివి..


పెద్దొడు: మా ఫ్రెండ్స్‌ వి అన్నయ్యా.. అయోధ్యపురం వెళ్లాలంటే బస్సు పట్టుకుని ట్రైన్‌ పట్టుకుని అక్కడి నుంచి మళ్లీ బస్సులో వెళ్లాలి. అది చాలా లాంగ్‌ ప్రాసెస్‌.


చిన్నొడు: అందుకే బైక్‌ పట్టుకుని రోడ్డు జర్నీ చేస్తే బాగుంటుందని బైక్స్‌ తీసుకొచ్చాం.


శంకర్‌: చూశారా.. నా తమ్ముళ్ల క్యాలికిలేషన్స్‌, ఇంటలిజెన్స్‌. అందుకే వాళ్లని జెమ్స్‌ అంటాను. పదండి మంచి మంచి ఫోటోలు తీసుకుందాం.


గౌరి: అసలు మీరు ఏమనుకుంటున్నారు.


శంకర్‌: ఏంటండి మేము ఫోటోలు దిగకూడదా..?


గౌరి: ఆ మీరు పెద్ద సెలబ్రెటీలు అని..


శంకర్: పోనీ మీరు మాతో బైక్‌ ఎక్కి రండి..


పెద్దొడు: అబ్బా అన్నయ్యా నువ్వు ఊరుకో.. ఆ ఊరికి వెళ్లడం కష్టం అందుకే మీరు కూడా మా బైక్స్‌ మీద రండి.


సంధ్య: అక్కా వాళ్లు అన్నట్లు ఇబ్బంది పడటం కంటే వీళ్ల బైక్‌ మీద వెళ్లడం బెటర్‌


 అని చెప్పగానే అందర సరేనని మూడు జంటలు మూడు బైక్స్‌ మీద కలిసి వెళ్తారు. మరోవైపు రాకేష్‌ రోడ్డు మీద వెయిట్‌ చేస్తుంటే కారులో అభయ్‌, జెండే, అకి వస్తారు. రాకేష్‌ను పికప్‌ చేసుకుని వెళ్తారు.


అకి: అన్నయ్య నీకు అసలు విషయం చెప్పలేదు. గౌరి, శంకర్‌ గార్లు కూడా అయోధ్యపురం వస్తున్నారు.


  అకి మాటలకు రాకేష్‌ సడెన్‌ బ్రేక్‌ వేస్తాడు.


అభయ్‌: వాట్‌ రాకేష్‌ కేర్‌ఫుల్‌..


రాకేష్‌: సారీ స్పీడ్‌ బ్రేకర్‌ ఉంది చూసుకోలేదు.


జెండే: అందుకే ముందు చూపు ఉండాలి రాకేష్‌. లేదంటే ఇలాంటి కుదుపులే ఎదురవుతాయి.


రాకేష్‌: సారీ అంకుల్‌..


అభయ్‌: అవును అకి వాల్లు అయోధ్యపురం ఎందుకు వస్తున్నారు. నువ్వు పిలిచావా?


అకి: స్పెషల్ గా ఇన్వైట్‌ చేయలేదు అన్నయ్యా.. వాళ్లెవరో పెళ్లికి వస్తున్నారు. ఎలాగో వస్తున్నారు కానీ మన ఇంట్లోనే ఉండమని చెప్పాను.


రాకేష్‌: అమ్మా అకి  మీ అన్నయ్యకు మీ అమ్మా నాన్నలను కలపాలని ఇలా ప్లాన్‌ చేశావా? (అని మనసులో అనుకుంటాడు.)


అభయ్‌: మన ఇంట్లో అంత మందికి కంఫర్ట్‌ గా ఉంటుందా? వాళ్లను అవుట్‌ హౌస్‌ లో ఉండమని చెప్పు..


 అనగానే అకి అభ్యంతరం చెప్పబోతుంటే.. జెండే అడ్డుపడి డెస్టినీ అంటాడు. దీంతో అకి సరే అంటుంది. మరోవైపు అయోధ్యపురంలో ఆర్య వాళ్ల ఇల్లును శుభ్రం చేస్తుంటారు. ఇంతలో ప్రెసిడెంట్‌ వచ్చి ఆర్య గురించి తప్పుగా మాట్లాడతాడు. రాజనందని ఫోటో ముందు నిలబడి వెటకారంగా మాట్లాడుతూ నవ్వుతుంటాడు. రాజనందిని ఆత్మ ప్రెసిడెంట్‌ ను కొడుతుంది. ప్రెసిడెంట్‌ భయంతో వణికిపోతాడు. కోటి వచ్చి ఆయన్ని తీసుకెళ్తాడు. మరోవైపు శంకర్‌ వాళ్లు బైకుల మీద అయోధ్యపురం వెళ్తుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  



ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:   కావ్యను ఒప్పించిన రాజ్‌ – నిజం తెలుసుకున్న రుద్రాణి