Prema Entha Madhuram  Serial Today Episode:  శంకర్, యాదగిరికి డబ్బులు ఇచ్చి తన తమ్ముళ్లకు ఇవ్వమని చెప్తాడు. అవి తాను ఇచ్చినట్టు కాకుండా.. నువ్వే ఇస్తున్నట్టు చెప్పు. కావాలంటే నన్ను నాలుగు మాటలు తిట్టు అని చెప్తాడు. దీంతో యాదగిరి సరే అని తీసుకుని వెళ్తాడు. మరోవైపు చిన్నొడు, పెద్దొడు ఒక దగ్గర నిలబడి తన ప్యూచర్ గురించి ఆలోచిస్తుంటే.. పాండు వస్తాడు. మీ ఉద్యోగాల కోసం ఎవ్వరి కాళ్లు పట్టుకోవద్దు అంటాడు.


పెద్దొడు: మరేం చేయమంటారండి మీరేమో ఉద్యోగానికి లక్ష అడిగారు. ఇప్పుడు ఆ లక్ష ఎక్కడి నుంచి తీసుకొస్తాం.


పాండు: మీ అన్నయ్యా మీరు అడిగితే ఇవ్వడు అని నేను ముందే చెప్పాను కదా? ఏమైంది. అడిగి లేదనిపించుకున్నారు.


చిన్నొడు: మా కోసమే బతుకుతున్నాను అంటే ఆ మాత్రం ఇవ్వడా అనుకున్నాము. ఇలా చేస్తాడనుకోలేదు.


పాండు: దాన్నే స్వార్తం అంటారు. మీ అన్నయ్య కూడా స్వార్థపరుడే.. నేను ఉన్నాను కదా? నేను ఒక బిజినెస్‌ మ్యాన్‌ దగ్గరకు తీసుకెళ్తాను.


పెద్దొడు: ఎవరండి ఆ బిజినెస్‌ మ్యాన్‌..


పాండు: నేను ఆయన గురించి తర్వాత చెప్తాను. అదిగో యాదగిరి వస్తున్నాడు. మీ అన్నయ్యే పంపించి ఉంటాడు. నన్ను ఇక్కడ చూస్తే లేనిపోని డౌట్లు వస్తాయి నేను పక్కకు వెళ్లి దాక్కుంటాను.


యాదగిరి: బాబు మీరు ఇక్కడ ఉన్నారేంటి..? మీరు చేసింది కరెక్టు కాదు. మీకోసం సార్‌ ఎంత బాధపడుతున్నారో తెలుసా..? ఆయనేదో ఆవేశంలో..


చిన్నొడు: ఆవేశాలు ఆక్రోశాలు మాకు ఉంటాయి బాబాయ్‌. మీరు ఎన్ని చెప్పినా సరే మేము ఆయన దగ్గరకు తిరిగి రాము.


యాదగిరి: మా ఇంటికి రండి మా ఇంట్లో ఉందురు కానీ..


పెద్దొడు: మీరు కూడా ఆయన మనిషే కదా బాబాయ్.


యాదగిరి: సరే బాబు మిమ్మల్ని దేనికీ ఇబ్బంది పెట్టను. ఈ డబ్బైనా తీసుకోండి ఇది నా డబ్బే.. పోనీ అప్పుగానైనా తీసుకొండి.


అని యాదగిరి చెప్పగానే పెద్దొడు, చిన్నోడు యాదగిరి తిట్టి వెళ్లిపోతారు. పాండు హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు గౌరి కూరగాయలు కట్‌ చేస్తూ.. శంకర్ వాళ్ల గురించి ఆలోచిస్తుంది. ఇంతలో శ్రావణి, సంధ్య వస్తారు.


శ్రావణి: అక్కా పాపం శంకర్‌ గారు చాలా బాధలో ఉన్నారు కదా..?


గౌరి: ప్రాణంగా ప్రేమించిన తమ్ముళ్లు కాదని వెల్లిపోతే ఎవరికి బాధ ఉండదే.. ఆయన కాబట్టి తట్టుకున్నారు. అది మీరే చేసి ఉంటేనా..?


శ్రావణి: నీ ప్రాణం పోయేది కద అక్కా..


గౌరి: చీచీ అలా ఏం కాదు. మీ కాళ్లు విరగొట్టి పొయ్యిలో పెట్టేదాన్ని


అనగానే ఇద్దరూ షాక్‌ అవుతారు. మేమెందుకు అలా చేస్తాం అంటారు. శంకర్‌ గారు ఏమీ తినలేదని వెల్లి భోజనానికి పిలువు అక్కా అని చెప్తారు. సరేనని గౌరి వెళ్తుంది. శంకర్‌ ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉంటాడు. బాధగా ఫీలవుతూ శంకర్ ను భోజనానికి పిలుస్తుంది. నేను కూడా కుక్కర్‌ లో రైస్‌ పెట్టానని మీరు త్వరగా కర్రీ చేయండని చెప్పడంతో గౌరి షాకింగ్‌ గా వెళ్లిపోతుంది. మరోవైపు శంకర్‌ మాటలు గుర్తు చేసుకుంటూ అకి ఏడుస్తుంది.


జెండే: బాధపడకు అకి మీ నాన్న ఎప్పటికీ ఓడిపోడు. ఎలాంటి క్లిష్ట పరిస్తితులనైనా ఎదుర్కొంటాడు. మీ నాన్న విలువ తెలుసుకుని ఆ వదిలేసి వెళ్లిపోయిన తమ్ముళ్లే తిరిగి వస్తారు.


రవి: సార్‌ నాకో విషయం తెలిసింది. అకి బాధపడుతుందని వచ్చాను.


జెండే: రవి వాళ్ల నాన్న ఒంటరివాడు అయిపోయాడని బాధపడుతుంది. నువ్వైనా ఓదార్చు.


రవి: అకి ..


  అని రవి పిలవగానే అకి వెంటనే ఏడుస్తూ రవిని హగ్‌ చేసుకుంటుంది. శంకర్‌ గురించి చెప్తూ బాధపడుతుంది. రవి కూడా అకిని హగ్‌ చేసుకుని ఓదారుస్తుంటాడు. ఇంతలో బయట నుంచి అభయ్, రాకేష్‌ వస్తారు. అకి, అభయ్‌ లను చూసిన రాకేష్‌ షాక్ అవుతాడు. ఎంతకు తెగించారు వీళ్లు ఆ అభయ్‌ చేతే వీణ్‌ని మెడపట్టి బయటకు గెంటివేయిస్తా అనుకుని అభయ్‌  వచ్చి రవి, అకిలను చూసేలా చేస్తాడు. వాళ్లను అలా చూసిన అభయ్‌ కోపంగా రవిని కొట్టి గల్లా పట్టుకుని కిందకు లాక్కొస్తాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!