Prema Entha Madhuram Telugu Serial Today Episode:  ఆర్యను దెబ్బకొట్టడానికి కొత్త ప్లాన్‌ వేశానని ప్లాన్‌ ప్రాసెస్‌ చేయడమే ఉదని మీరాకు చెప్తాడు అజయ్‌. ఓడిపోయానని అక్కడే ఆగిపోవడం నాకు తెలియదు. నా గెలుపుకు ఎలా దారులు వేసుకోవాలో నాకు తెలుసు? అని చెప్పగానే ఎలా చేశావు అని మీరా అడుగుతుంది. ఇంతలో లాయర్‌ వచ్చి డాక్యుమెంట్స్‌ ఇస్తాడు అవి చూసిన మీరా సూపర్‌ అంటూ ఆర్యవర్ధన్‌ ఫ్యామిలీ కట్టుబట్టలతో రోడ్డుమీద పడ్డట్టు కలగంటుంది. మరోవైపు శారదాదేవి ఫ్యామిలీతో కలిసి గుడికి వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇంతలో అజయ్‌ మీరా వస్తారు.


అజయ్‌: ఏంటి పెద్దమ్మా మొదటిసారి భార్యతో కలిసి మీ ఇంటికి వచ్చాను. హారతి ఇవ్వడాలు లాంటి ఫార్మాలిటీస్‌ ఎం లేవా?


మీరా: పాపం మేడం షాక్‌లో ఉన్నట్లున్నారు అజయ్‌ లైట్‌ తీసుకో..


శారదాదేవి: ఎందుకొచ్చారు..?


మీరా: వాట్‌ ఈజ్‌ దిస్‌ మేడం..


అజయ్‌: మీరా ఇంకా మేడం ఎంటి? అత్తయ్య అని పిలువు


మీరా: సారీ అత్తయ్య గారు వర్ధన్‌ ఫ్యామిలీ అంటే అతిథులను ఎంతో గౌరవంగా చూస్తారంటారు. మీరేమో మమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నారు.


అనగానే మంచి కోరేవారికి మర్యాదలు ఉంటాయి అని శారదాదేవి చెప్పగానే.. అయితే నేను బ్యాడ్‌ బాయ్‌ అని తెలుసు కాబట్టే చెప్తున్నాను. ఆర్యను త్వరలోనే అంతం చేస్తానని అజయ్‌ చెప్పడంతో శారదాదేవి నవ్వుతుంది. నా కొడుకు కృష్ణుడి లాంటోడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఓపికగా ఉంటాడు. అలాగని నీఇష్టం వచ్చినట్లు చేస్తుంటే నరసింహావతారం ఎత్తుతాడు. అంటూ శారదాదేవి, అజయ్‌కు వార్నింగ్‌ ఇస్తుంది. నువ్వెన్ని కుట్రలు చేసినా నా ఆర్య వాటిని చేధించి నిన్ను శిక్షిస్తాడు. అనగానే లోపలి నుంచి నీరజ్‌ వస్తాడు.


నీరజ్‌: ఏంటి మమ్మల్ని భయపెట్టాలని వచ్చి మీ ఫేసుల్లో రంగులు మారిపోయాయి. ఏంటి మీరా? మీ హస్బెండ్‌కు దాదా గురించి పూర్తిగా తెలియదు.. కానీ నీకు తెలుసు కదా.. ఆర్య సార్‌ జోలికి వెళ్లకూడదు. వెళ్తే మనకు పుట్టగతులు ఉండవు అని చెప్పాలి కదా మీరా.


అజయ్‌: మీ అందరికీ ఆర్యవర్ధన్‌ మీద చాలా కాన్పిడెంట్‌ ఉంది. ఆ కాన్ఫిడెంట్‌ని మీలోని ధైర్యాన్ని అన్ని పోగొడుతా.. వార్నింగ్ ఇద్దామని వస్తే వార్‌ డిక్లేర్‌ చేశారు. ఇక మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు.


నీరజ్‌: ఎర్లీ మార్నింగ్ జోక్స్‌ వినే అలవాటు నాకసలు లేదు. బయటకు వెళ్లండి. గెట్‌ అవుట్‌..


అనగానే అజయ్‌, మీరా వెళ్లిపోతారు. తర్వాత ఆర్య బెడ్‌రూంలో ఏదో వర్క్ చేసుకుంటుంటే పిల్లలు హోంవర్క్‌ చేయించమని వస్తారు. మీ అమ్మ లేదా అని ఆర్య అడుగుతే కిచెన్‌లో బిజిగా ఉందని చెప్తారు. దీంతో ఆర్య పిల్లలతో హోంవర్క్‌ చేయిస్తుంటాడు. అను వస్తుంది.


అను: ఎవరు ఎవరికి హోంవర్క్‌ చేయిస్తున్నారో అర్థం కావడం లేదు.


ఆర్య: నువ్వు బిజీగా ఉన్నావని చెబితే నేను హోం వర్క్‌ చేయిస్తున్నాను.


అను: ఓ అలా చెప్పారా? నేనైతే ఆన్సర్‌ చెప్పకపోతే చెవి మెలేస్తానని మీ దగ్గరకు వచ్చి డ్రామాలు చేసి  హోం వర్క్‌ కూడా మీతోనే చేయిస్తున్నారు. ఇద్దరికి ఇద్దరూ బాగా తెలివి మీరి పోతున్నారు.


ఆర్య: పోనీలే వదిలెయ్‌ అను.. ఈ సబ్జెక్ట్‌ లోనే వీక్‌ గా ఉన్నారు. మిగతా అన్నిట్లో షార్ప్‌ గా ఉన్నారు తెలుసా?


అను: మీరేంటి? వాళ్లకు సపోర్టా? మీ చెవి కూడా మెలేయాలా?


అనగానే ఆర్య అను తీసుకొచ్చిన పాలు తీసుకుని తాగుతుంటాడు. ఇంతలో ఆర్యకు పోలమారడంతో పిల్లలు అను ఆర్య తలమీద దువ్వుతారు. దీంతో ఆర్య నేను చాలా లక్కీ మీ ముగ్గరి ప్రేమ ఉంటే చాలు అనగానే పిల్లలు ఆర్యను హగ్‌ చేసుకుంటారు.  మరోవైపు ఆర్యకు కొరియర్‌ రావడంతో కేశవ తీసుకుంటాడు. ఫ్రమ్‌ అడ్రస్‌ అజయ్‌ ఉండటంతో కేశవ ఓపెన్‌ చేసి చూస్తాడు. అది ఆర్యకు లీగల్‌ నోటీసు ఉంటుంది. దీంతో కోపంగా కేశవ ఈ విషయం వెంటనే ఆర్యకు చెప్పాలని వెళ్తాడు. మరోవైపు మీరా, అను దగ్గరకు వెళ్లి  వాదిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: బుల్లితెరకు 'గుంటూరు కారం' - ఆ స్పెషల్ డేకి టెలికాస్ట్!