Jagadhatri Serial Today Episode: నువ్వు కౌషికిని సురేష్ అన్నయ్యని కలపడమేంటి దివ్యాంక అని నిషిక అడుగుతుంది. దీంతో కౌషికి మీద పగ తీర్చుకోవాలంటే సురేష్‌ను పెళ్లి చేసుకోవాలి. కానీ సురేష్ పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఇలా నాటకం అని పెళ్లి దాకా తీసుకొచ్చానని అసలు విషయం చెప్తుంది దివ్యాంక. ఒక వేళ అప్పుడు సురేష్ పెళ్లి వద్దని అంటే నీ పరిస్థితి ఏంటని అడుగుతుంది నిషిక. పెళ్లిపీటల దాకా వెళ్లాక నా జీవితం ఏం కావాలని నిలదీస్తాను. అంటూ దివ్యాంక చెప్పడంతో నీ ప్లాన్ బాగానే ఉంది కానీ మధ్యలో ఆ జగధాత్రి ఎంటర్ కాకుండా చూసుకో లేదంలే అది పెంటపెంట చేస్తుంది అని నిషిక చెప్తుంది. మరోవైపు బూచి మందు ఎత్తుకెళ్లిన కేదార్, ధాత్రి ఆ మందును కూల్ డ్రింక్‌లో కలిపి దివ్యాంకకు ఇవ్వాలని ప్లాన్ చేస్తారు.
కేదార్: ధాత్రి ఈ గ్లాస్ దివ్యాంకనే తాగుతుందన్న గ్యారంటీ ఏంటి? ఇంకెవరైనా తాగితే
ధాత్రి: కరెక్టే కదా.. దివ్యాంకనే తాగేలా నేను చూసుకుంటాను కదా?
అని మందు కలిపిన గ్లాస్‌కు చిన్న స్టిక్కర్ వేస్తుంది ధాత్రి. అందరూ మెహిందీ హడావిడిలో ఉండగా ధాత్రి కూల్‌డ్రింక్స్ ఇస్తూ వెళ్తుంది. చివరకు మందు కలిపిన గ్లాస్ సురేష్ తీసుకుంటాడు. దీంతో ధాత్రి కంగారు పడుతుంది.
దివ్యాంక: తాగి ఎలా ఉందో చెప్పాలా ఏంటి? వెళ్లు ఇక్కణ్నుంచి.
ధాత్రి: అన్నయ్యా ఆగండి..
సురేష్: ఏమైంది సిస్టర్..
దివ్యాంక: అడుగుతుంటే నోరు మెదపవేంటి? వెళ్లు ఇక్కణ్నుంచి..
కౌషికి: ఆ మందున్న డ్రింక్ ఆ మనిషి తీసుకున్నాడు ఇప్పుడెలా ధాత్రి
కేదార్: బావగాని ఆ డ్రింక్ తాగితే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది ధాత్రి.
ధాత్రి: మీరు టెన్షన్ అవ్వకండి ఏదో ఒకటి చేద్దాం..
అని కేదార్‌ను తీసుకుని వైజయంతికి వినిపించేలా దగ్గరకు వెళ్లి కేదార్ వదినకు ఏదో ఒకటి చెప్పి ఇక్కణ్నుంచి తీసుకెళ్లు అనగానే ఎందుకు అని కేదార్ అడిగితే సురేష్ అన్నయ్యతో ఆ దివ్యాంక కూల్‌డ్రింక్ తాగించుకుందంటే. అది వదిన చూసి తట్టుకోలేదు. అనగానే వైజయంతి వెళ్లి దివ్యాంకకు చెప్తుంది. దీంతో దివ్యాంక సురేష్‌ను మీరు నాకు కూల్‌డ్రింక్ తాగించండి అని అడగడంతో సురేష్ మందు కలిపిన డ్రింక్‌ను దివ్యాంకకు తాగిస్తాడు. అది చూసి కేదార్, ధాత్రి, కౌషికి హ్యాపీగా ఫీలవుతుంటే వారిని చూసిన నిషిక ఇక్కడేదో కుట్ర జరుగుతున్నట్లుంది అనుకుంటుంది. ఇంతలో తనకు ఇలాంటి కూల్‌డ్రింకే ఇంకా కావాలని దివ్యాంక అడుగుతుంది. ధాత్రి వెళ్లి ఇంకాస్త డ్రింక్ తెచ్చి ఇస్తుంది. డ్రింక్ తాగిన దివ్యాంక కల్లుతాగిన కోతిలా ఎగురుతుంది.
వైజయంతి: ఏమైంది నిషి ఈ అమ్మి ఇలా ఎగురుతుంది.
నిషిక: ఆ జగధాత్రిని అవమానించింది కదా అది డ్రింక్‌లో ఏదో కలిపినట్లుంది.
సురేష్: దివ్యాంక మీరు కాసేపు సైలెంట్‌గా కూర్చోండి.
దివ్యాంక: ఏయ్ ఎవరు నువ్వు ఆఫ్ట్రాల్ నా ఆఫీసులో జీతానికి పనిచేసేవాడివి. నా కాళ్ల కింద పడి ఉండకుండా నాకే ఎదురు మాట్లాడతావా? నా పగకోసం పావులా వాడుకుంటున్నాను నిన్ను..
అనగానే నిషిక, దివ్యాంకను తీసుకెళ్లబోతుంటే వెళ్లకుండా ధాత్రిని, కౌషికిని తిడుతుంది. దీంతో ధాత్రి నిన్ను మరోసారి జైలుకు పంపిస్తానని చెప్పడంతో దివ్యాంక నిన్ను చంపేస్తానని ధాత్రి మెడ పట్టుకుంటుంది. దీంతో కౌషికి దివ్యాంకను కొడుతుంది. ఇంతలో నిషిక దివ్యాంకను తీసుకుని వెళ్ళిపోతుంది. దీంతో మెహింది ఫంక్షన్ చెడిపోతుంది. మీ బంధం ఎంత పవిత్రమైంది కాబట్టే ఆ దివ్యాంక చేస్తున్న ప్రతి ఫంక్షన్ చెడిపోతున్నాయి. గతం మరిచిపోయి ఒక్కసారి అన్నయ్య ప్రేమను గుర్తు చేసుకోండని ధాత్రి, కౌషికికి చెప్తుంది. కొన్ని బంధాలు ఎంత కలపాలని చూసిన కలవవు అని చెప్పి కౌషికి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసో అయిపోతుంది.
Also Read: కిరణ్ అబ్బవరంతో ప్రేమ, పెళ్లి - రహస్య గోరక్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?