Rahasya Gorak Age and Background: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరఖ్‌తో త్వరలో పెళ్లీ పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా 'రాజావారు రాణివారు' హీరోయిన్‌తోనే ప్రేమలో పడిన అబ్బవరం ఇప్పుడు ఆమెతోనే జీవితం పంచుకోబోతున్నాడు. దీంతో రహస్య గోరక్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. దీంతో అంతా ఆమె గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పెళ్లీ చేసుకోబోతున్న ఈ రహస్య గోరక్ ఎవరూ, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఎంటాని సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తెలుగు, తమిళంలో నటించిన రహస్యను చాలా మంది సౌత్ బామ అనుకున్నారు. కానీ రహస్య గోరక్ అచ్చమైన తెలుగు అమ్మాయి అనే విషయం మీకు తెలుసా?.
రహస్య గోరక్ బ్యాక్ గ్రౌండ్
Rahasya Gorak Age and Biography: 'రాజావారు రాణివారు' తర్వాత రహస్య మరే సినిమాలో నటించలేదు. అందుకే ఆమె గురించి పెద్దగా ఎవరికి పరియం లేదు. దాంతో ఆమె బయోగ్రపీ, కుటుంబ నేపథ్యం గురించి ఇక్కడ చూద్దాం. రహస్యది తెలంగాణ అట. హైదరబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆమె ఇంజనీరింగ్ చదివింది. 1995 మార్చి 3న ఆమె హైదరాబాద్ జన్మించింది. ఇక్కడే విద్యాభ్యాసం చేసిన ఆమె 'బిర్లా ఇనిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ; పిలానీ' నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందింది. నటిగా కెరీర్ ప్రారంభించడానికి ముందు ఆమె లక్స్ డ్రీమ్ గర్ల్ పోటీలో పాల్గొని టైటిల్ కొట్టింది. ఆ తర్వాత షార్ట్స్ ఫిలింస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే 'ఆకాశమంత ప్రేమ'(2016)అనే షార్ట్ ఫిలింలో నటించి సినీ కెరీర్ ప్రారంభించింది. అలాగే కిరణ్ అబ్బవరం కూడా షార్ట్ ఫిలింస్‌తోనే కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరద్దరు 2019లో రాజావారు రాణివారు మూవీతో హీరోహీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.
రహస్య ఎమోషనల్ పోస్ట్
ఈ మూవీ సమయంలోనే వారిద్దరి మంచి స్నేహితులు అయ్యారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ఆరేళ్ల సీక్రెట్ డేటింగ్ అనంతరం ఈ లవ్ బర్డ్స్ పెళ్లి సిద్ధమయ్యారు. అయితే ఇన్నేళ్లు రిలేషన్‌లో ఉన్న వీరిపై పెద్ద రూమర్స్ వినిపంచకపోవడం గమనార్హం. మార్చి 12న నిశ్చితార్థం చేసుకున్న ఈ టాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆ ఫోటోలు షేర్ చేసి తమ రిలేషన్ ఆపీషియల్ చేశారు. అలాగే రహస్య కూడా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు షేర్ చేసి కిరణ్ అబ్బవరంపై ప్రేమ కురిపించింది. ఆరేళ్ల పరిచయం. మంచి స్నేహితులుగా ఉంటూనే ఎప్పుడు ప్రేమలో పడిపోయామో తెలియదు. కానీ, అనుకొకుండానే జంటగా ఎన్నో వెకేషన్స్‌క వెళ్లాం. ఈ జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు చూశాం. ఇక నీతోనే జీవితం కొనసాగించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా సర్వస్వమంత కిరణ్ అబ్బవరమే" అంటూ రహస్య గోరక్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రహస్య చేసిన ఈ పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. కాగా వీరి పెళ్లి ఆగస్ట్‌లో జరగనుందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.